ETV Bharat / sitara

క్రిప్టో కరెన్సీతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్​ కొనుగోలు! - రేవ్ పార్టీ

రేవ్​ పార్టీ కేసులో(mumbai rave party bollywood) మరో విస్తుపోయే నిజం బయటకు వచ్చింది. క్రిప్టో కరెన్సీతో ఆర్యన్ ఖాన్(Aryan Khan Arrest) డ్రగ్స్​ కొనుగోలు చేసినట్లు మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

Aryan Khan
ఆర్యన్ ఖాన్
author img

By

Published : Oct 6, 2021, 10:53 AM IST

ముంబయి(mumbai rave party bollywood) క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్​ను(Aryan Khan Arrest) అక్టోబరు 7 వరకు ఎన్​సీబీ కస్టడీకి తరలిస్తున్నట్లు కోర్టు ఆదేశించింది. అయితే.. ఆర్యన్​ ఖాన్ వాట్సాప్​ చాట్ ఆధారంగా డ్రగ్స్​ సరఫరాకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టారు అధికారులు.

వాట్సాప్​ కోడ్​ ఆధారంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపి ఆర్యన్​ ఖాన్​ డ్రగ్స్​ కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందని మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ డ్రగ్స్​ ముఠాపై ఇది ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

దుస్తుల్లో దాచుకుని..

శనివారం రాత్రి ముంబయి నుంచి గోవా వెళ్తున్న ఓడలో ఏర్పాటుచేసిన రేవ్‌ పార్టీపై ఎన్​సీబీ అధికారులు జరిపిన దాడిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (23) సహా మరో ఏడుగురు అరెస్టయ్యారు. ఈ పార్టీలో కొంతమంది దుస్తుల్లో దాచుకొన్న ఎక్‌స్టసీ, కొకెయిన్‌, మఫెడ్రోన్‌ (ఎండీ), చరస్‌ వంటి మత్తు పదార్థాలను(Drugs Case News) అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు యువతులతోపాటు అదుపులోకి తీసుకున్న బృందంలో మూన్‌మూన్‌ ధామేచ, నుపుర్‌ సారిక, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రా, ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేశారు.

ఎవరీ అర్బాజ్‌, మూన్‌మూన్‌..?

ఈ కేసులో ఆర్యన్‌తోపాటు ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధామేచ. మిగిలిన వారికి సంబంధించిన వివరాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. మోహక్‌ జస్వాల్‌, నుపుర్‌ సారిక, గోమిత్‌ చోప్రాలు దిల్లీ వాసులు. మోహక్‌, నుపుర్‌ సారిక ఫ్యాషన్‌ డిజైనర్లు కాగా గోమిత్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌.

అర్బాజ్‌ మర్చంట్‌: ఇతను ఒక నటుడు. ఆర్యన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. వీరిద్దరు తరచూ పార్టీలు చేసుకున్న ఫొటోలు మీడియాలో వస్తుంటాయి. ఆర్యన్‌ సోదరి సుహానా ఖాన్‌కు కూడా మిత్రుడు.

మూన్‌మూన్‌ ధామేచ: ఈమెది మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్తల కుటుంబం. ఫ్యాషన్‌ పరిశ్రమలో మోడల్‌గా పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి:ఇంటి భోజనాన్ని తిరస్కరించిన ఆర్యన్​ ఖాన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.