తెలుగులో నాయికా ప్రాధాన్యమున్న కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది హీరోయిన్ అనుష్క. 'అరుంధతి', 'భాగమతి' వంటి చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించి, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహా కథలో మరోసారి కనిపించనుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
ఓ యువ దర్శకుడు, అనుష్క కోసమే సిద్ధం చేసిన ఓ కథను ఇటీవలే ఆమెకు వినిపించినట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు ఊపందుకున్నాయని సమాచారం. ఇటీవల అనుష్క 'నిశ్శబ్దం'లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:స్వీటీ అనుష్కశెట్టి మరో మైలురాయి