ETV Bharat / sitara

రాజ్​కుంద్రాపై మరో నటి సంచలన ఆరోపణలు - రాజ్​కుంద్రాపై ఫిర్యాదు

ప్రముఖ వ్యాపారవేత్త రాజ్​కుంద్రా పోర్నోగ్రఫీ కేసు రోజురోజుకూ కీలక మలుపులు తీసుకుంటోంది. తాజాగా మరో నటి కుంద్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తన అనుమతి లేకుండా అశ్లీల వీడియోలు హాట్​షాట్స్ యాప్​లో విడుదల చేశారని ఆరోపించారు.

Raj Kundra
రాజ్​కుంద్రా
author img

By

Published : Aug 6, 2021, 12:19 PM IST

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాపై మరో నటి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనుమతి తీసుకోకుండానే తన అశ్లీల చిత్రాలు హాట్‌షాట్స్‌ యాప్‌లో రాజ్‌కుంద్రా విడుదల చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ముంబయి పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసుకున్నారని పలు వార్తా కథనాలు బయటకు వచ్చాయి.

తాజాగా ఆ నటి రాజ్‌కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మల్వాణీ పోలీస్‌స్టేషన్‌లో కుంద్రాపై ఫిర్యాదు చేసిన నటి నుంచి తాజాగా ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ స్వీకరించినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా మంచి వ్యక్తి కాదని.. తనకిచ్చిన మాట తప్పాడని ఆమె వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రైవేట్‌ పార్ట్స్‌ని వీడియోలో చూపించకూడదు అనే షరతుతో రాజ్‌కుంద్రా నిర్మించిన ఓ అశ్లీల చిత్రంలో తాను నటించానని.. అందుకుగాను కుంద్రా తనకి కొంత మొత్తాన్ని చెల్లించాడని ఆమె పోలీసుల ఎదుట తెలిపారట. అయితే, తన అనుమతి తీసుకోకుండా.. ఏవిధమైన మార్పులు చేయకుండా పూర్తి వీడియోను హాట్‌షాట్స్‌లో విడుదల చేశారని.. ఓ స్నేహితుడి ద్వారా ఆ విషయం తనకు తెలిసిందని ఆమె వివరించింది.

అశ్లీల చిత్రాలు నిర్మించి వివిధ యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్‌కుంద్రాను జులై 19న ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రా, ఆయనకు చెందిన సంస్థల వల్ల ఇబ్బందిపడిన పలువురు బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఓటీటీలో ఆ 'స్టోరీ'ల​కు ఎందుకంత క్రేజ్?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.