'క్షణం'తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు 'రంగస్థలం' సినిమాతో భారీ బ్రేక్ వచ్చింది. ఇప్పుడీ భామ రెండు మెగా ఛాన్స్‌లు కొట్టేసినట్లు సమాచారం అందుతోంది. అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంతో పాటు, పవర్‌స్టార్ కొత్త సినిమాలోనూ నటించే అవకాశం దక్కించుకుందని సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
'పింక్' రీమేక్ తర్వాత పవన్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం తెరకెక్కనుంది. దీనిని మొఘలాయుల కాలం నాటి కథతో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తారని సమాచారం. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనుండగా.. అతడికి సహాయపడే ఓ కీలక పాత్రలో అనసూయ నటించనుందట. ఇప్పటికే ఈ పాత్ర చేయడానికి ఆమె ఒకే చెప్పినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణను మార్చిలో ప్రారంభించి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి.. 'మైదాన్' సినిమా విడుదల తేదీలో మార్పు