ETV Bharat / sitara

దుశ్యంతుడి పాత్ర పూర్తి.. 'పుష్ప' ఆల్ ఇండియా రికార్డు - శాకుంతలం అప్​డేట్

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శాకుంతలం' సినిమాలో దుశ్యంతుడి పాత్ర చిత్రీకరణ పూర్తయింది. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప'లోని 'దాక్కో దాక్కో' సాంగ్ రికార్డుల పరంపర కొనసాగుతోంది.

Pushpa
పుష్ప
author img

By

Published : Aug 24, 2021, 4:26 PM IST

Updated : Aug 24, 2021, 5:22 PM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. ఇటీవలే ఈ సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ ఈ సాంగ్​ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి యూట్యూబ్​లో ట్రెండింగ్​లో నిలిచి రికార్డు సృష్టించిందీ పాట. 11 రోజుల నుంచి ఈ పాట నాలుగు భాషల్లో ట్రెండింగ్​లో కొనసాగుతోంది. ఇది భారతీయ సినీ చరిత్రలోనే మొదటిసారి అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ సినిమలో రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

'శాకుంతలం' అప్​డేట్

సమంత, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'శాకుంతలం'. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో నటించారు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ముగియడం వల్ల దర్శక నిర్మాతలు దేవ్ మోహన్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యుల మధ్య దేవ్ మోహన్ తన ఆనందాన్ని పంచుకున్నారు. దేవ్ చేసిన దుశ్యంతుడి పాత్ర ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందని గుణశేఖర్ బృందం తెలిపింది.

ఇవీ చూడండి: ఐశ్వర్యా రాయ్ ప్రెగ్నెన్సీతో ఉందా?

Last Updated : Aug 24, 2021, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.