ETV Bharat / sitara

Allu arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో ఘనత - pushpa OTT

Allu arjun news: 'పుష్ప' సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్ కొట్టిన అల్లు అర్జున్.. ఇన్​స్టాలో మరో మైలురాయిని అధిగమించారు. 15 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు

Allu Arjun
అల్లు అర్జున్
author img

By

Published : Jan 14, 2022, 2:23 PM IST

Allu arjun insta follwers: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.. ఇన్​స్టాలో మరో మైలురాయిని చేరుకున్నారు. 15 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను చేరుకున్నారు. ఈ మార్క్​ను అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. ఈ సందర్భంగా అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలానే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

ఇటీవల 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. దక్షిణాదితో పాటు ఉత్తరాది ఆడియెన్స్​ను విపరీతంగా అలరిస్తున్నారు. శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్.. వన్​మ్యాన్ షో చేశారు.

'గంగోత్రి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఆ తర్వాత బన్నీ, దేశముదురు, పరుగు, అల వైకుంఠపురములో లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్​కు సిద్ధమవుతున్నారు. మార్చి నుంచి ఇది మొదలుకానుంది. దీని తర్వాత మురగదాస్, ప్రశాంత్​నీల్​తో కలిసి పనిచేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.