లాక్‌డౌన్ కారణంగా వేసవిలో విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలుగా రిలీజయ్యేందుకు ముస్తాబవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ', రణ్‌వీర్ సింగ్ '83' చిత్రాలు కూడా ఈ వేసవిలో సందడి చేయాల్సి ఉంది. విడుదల తేదీలు కూడా ఖరారైన తర్వాత.. కరోనా కారణంగా ఆగిపోయాయి. ఒకానొక దశలో ఈ రెండూ ఓటీటీ ఫ్లాట్‌ఫాంల వేదికగా విడుదల చేస్తారని టాక్ వినిపించింది. అయితే, ఆ వార్తలను చిత్ర బృందాలు ఖండించాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాల విడుదలపై స్పష్టత వచ్చింది.
-
Exciting times ahead.. Gearing up to release Rohit Shetty's Sooryavanshi on Diwali and Kabir Khan's 83 on Christmas this 2020! pic.twitter.com/JojLypeiro
— P V R C i n e m a s (@_PVRCinemas) June 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Exciting times ahead.. Gearing up to release Rohit Shetty's Sooryavanshi on Diwali and Kabir Khan's 83 on Christmas this 2020! pic.twitter.com/JojLypeiro
— P V R C i n e m a s (@_PVRCinemas) June 30, 2020Exciting times ahead.. Gearing up to release Rohit Shetty's Sooryavanshi on Diwali and Kabir Khan's 83 on Christmas this 2020! pic.twitter.com/JojLypeiro
— P V R C i n e m a s (@_PVRCinemas) June 30, 2020
దీపావళికి అక్షయ్ సినిమా
అక్షయ్ కుమార్, కత్రినాకైఫ్, అజయ్ దేవగణ్, రణవీర్ సింగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'సూర్యవంశీ'. రోహిత్‌శెట్టి దర్శకుడు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు పీవీఆర్ సినిమాస్ వెల్లడించింది. యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తానిష్ బాగ్చి సంగీతం అందించారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై యశ్ జోహార్, అరుణ్ భాటియా, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, రోహిత్‌శెట్టి నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
క్రిస్మస్‌కు కపిల్ బయోపిక్
భారత క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం '83'. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్ సింగ్ నటించాడు. కపిల్‌దేవ్ సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొణె కనిపించనుంది. ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది.