కరోనా లాక్డౌన్ వల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల క్రేజ్‌తో పాటు జోరు కూడా పెరిగింది. తమ సినిమాలకు వస్తున్న ఆఫర్లను వదులుకోలేక వీటిలోనే రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. కానీ యశ్‌రాజ్ ఫిల్మ్స్((yash raj films new movie) అధినేత ఆదిత్య చోప్రా మాత్రం తాను నిర్మించిన పలు చిత్రాలకు వచ్చిన భారీ ఆఫర్‌ను వదులుకున్నారట!
యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న చిత్రాల్లో ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ 'బంటీ ఔర్ బబ్లీ 2'(saif ali khan bunty aur babli 2), రణ్‌బీర్ కపూర్ 'షంషేరా'(shamshera movie trailer), అక్షయ్‌కుమార్ 'పృథ్వీరాజ్'(prithviraj akshay kumar movie trailer ), రణ్వీర్ సింగ్ 'జయేష్‌భాయ్ జోర్దార్'(ranveer singh jayeshbhai) విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు అన్నింటినీ కలిపి రూ.400కోట్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఆసక్తి కనబరిచిందని యశ్‌రాజ్ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. ఆదిత్యతో చర్చలు కూడా జరిపిందని కానీ ఆయన ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. థియేటర్లలోనే విడుదల చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. అలానే ఆయా సినిమా విడుదల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.
'పృథ్వీరాజ్'(akshay kumar prithviraj movie poster).. ఈ సినిమాకు 'మొహల్లా ఆసీ' ఫేమ్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బంటీ ఔర్ బబ్లీ 2'(bunty aur babli 2 saif ali khan).. ఈ చిత్రానికి వరుణ్ వి. శర్మ దర్శకత్వం వహించగా.. సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'జయేష్‌భాయ్ జోర్దార్'(jayeshbhai jordaar film).. నూతన దర్శకుడు దివ్యాంగ్ టక్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కామెడీ నేపథ్యంలో రూపొందిందీ సినిమా. రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్, వాణీకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'షంషేరా'(shamshera movie story). పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని కరణ్ మల్హోత్రా తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: Maro Prasthanam Review: 'మరో ప్రస్థానం'తో తనీశ్ మెప్పించారా?