ETV Bharat / sitara

అందం కోసం దాని మాటే వింటా: అదితీరావ్​ - అదితీ రావ్​ హైదరీ చర్మ సౌందర్యం

షూటింగ్​లు లేనప్పుడు, ఏ మాత్రం తీరిక దొరికినా ఫేస్​ప్యాక్​ను ముఖంపై రాసుకుంటానని హీరోయిన్ అదితీ రావ్ హైదరీ చెబుతోంది. చర్మం చెప్పిన మాట వింటానని, తినే ఆహారంలోనూ చర్మానికి మేలు చేసే వాటినే ఎంచుకుంటానని పేర్కొంది.

Aditi Rao Hydari skin tone secrets
అందం కోసం దాని మాటే వింటా: అదితీరావ్​
author img

By

Published : Aug 20, 2021, 8:39 AM IST

ఇంట్లో ఉన్నప్పుడు చర్మం చెప్పిన మాటే వింటానంటోంది అందాల తార అదితీరావ్‌ హైదరీ. షూటింగ్‌లు లేకపోయినా, ఏమాత్రం తీరిక దొరికినా.. వంటింట్లో ఉండాల్సిన సరకులన్నీ నా మొహంమీదే ఉంటాయని చెబుతోంది. చర్మానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే ఎక్కువగా ఎంపిక చేసుకుంటానని వెల్లడించింది.

"బొప్పాయి, ఓట్స్‌, సెనగపిండి, పాలు, అలొవెరా.. కాలానుగుణంగా వీటిల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడం, వాటితో ప్యాక్స్‌ వేసుకోవడం నాకిష్టం. బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్క్రీన్‌ తప్పనిసరి. అది లేకుండా అడుగు బయటపెట్టను. ఇక ఎవరైనా మనసుకు నచ్చిన ఆహారం తింటారు. నేనుమాత్రం చర్మానికి మేలు చేసే ఆహారం తింటాను. యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీయాసిడ్లు పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీలు, చెర్రీలతోపాటు గుడ్లు, చేపలకు ప్రాధాన్యం ఇస్తా. రాత్రిళ్లు లేటుగా తినడం అంటే నాకిష్టం ఉండదు. అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. త్వరగా తినేస్తాను. కార్బోహైడ్రేట్స్‌ కన్నా.. కాయగూరలనే ఎక్కువ తింటాను" అంటోంది అదితి.

ఇదీ చూడండి.. స్విమ్మింగ్​ పూల్​లో కాజల్.. బీచ్​లో ఆండ్రియా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.