ETV Bharat / sitara

విడాకుల అనంతరం తీర్థయాత్రలో సమంత - samantha pilgrimage

హీరోయిన్ (Samantha Latest News) సమంత.. స్నేహితులతో కలిసి ప్రస్తుతం తీర్థయాత్రలో ఉంది. శుక్రవారం, కేదార్​నాథ్ ఆలయ దర్శనం చేసుకుంది.

samantha latest news
samantha
author img

By

Published : Oct 23, 2021, 6:07 AM IST

Updated : Oct 23, 2021, 6:40 AM IST

స్నేహితులతో కలిసి తీర్థయాత్రలో ఉన్న హీరోయిన్ సమంత(Samantha Latest News).. శుక్రవారం హెలీకాప్టర్​లో కేదార్​నాథ్ చేరుకుంది. అనంతరం బద్రీనాథ్​ ధామ్​ను దర్శించుకుంది.

విడాకుల అనంతరం సమంత (Samantha Akkineni News) చేపట్టిన తీర్థయాత్ర ఇది. ఆమె తన ఆరుగురు స్నేహితులతో గురువారమే ఉత్తరాఖండ్​ వెళ్లింది. ఆరోజు గంగోత్రిని దర్శించుకుని, రాత్రికి హర్షిల్​లోని హోటల్​లో ఉన్నారు. శుక్రవారం కేదార్, బద్రీలను సందర్శించారు. సాయంత్రానికి దేహ్రాదూన్​ వెళ్లిపోయారు.

ఇటీవలే విడిపోయిన చై-సామ్..

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత.. ఇటీవలే తమ బంధానికి ముగింపు (Chaysam Divorce) పలికారు. భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పదేళ్లుగా తమ స్నేహం కొనసాగినందుకు అదృష్టవంతులమని పేర్కొన్నారు. ఆ స్నేహమే తమ వివాహ బంధానికి కీలకంగా నిలిచిందని అన్నారు.

అయితే విడిపోడానికి సరైన కారణాన్ని వెల్లడించని చైతూ-సామ్.. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ వ్యక్తిగత స్వేచ్ఛకు అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్​లో తమ స్నేహ బంధం కొనసాగుతుందని తెలిపారు.

ఇదీ చూడండి: Samantha Defamation Suit updates: సమంత పరువు నష్టం పిటిషన్‌పై కోర్టులో ఇవాళ ఏం జరిగిందంటే..

Last Updated : Oct 23, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.