Siddharth tweet: స్టార్ షటర్ల్ సైనా నెహ్వాల్‌కు హీరో సిద్ధార్థ్ క్షమాపణ చెప్పారు. ట్వీట్ ద్వారా కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఓ లేఖను ట్వీట్ చేశారు. అది కేవలం ఓ జోక్ మాత్రమేనని, మనసును బాధపెట్టిఉంటే తనను క్షమించాలని రాసుకొచ్చారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని అన్నారు.
-
Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022Dear @NSaina pic.twitter.com/plkqxVKVxY
— Siddharth (@Actor_Siddharth) January 11, 2022
హీరో సిద్ధార్థ్ తనకు క్షమాపణ చెప్పడంపై స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్పందించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి ట్వీట్లు చేయడం సరికాదని స్పష్టం చేసింది. అయినా తాను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది.
"నా ట్వీట్‌పై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఎందుకు వైరల్ అయ్యాయో తెలియలేదు. సిద్ధార్థ్ ట్వీట్ ట్రెండ్ కావడం ఆశ్చర్యంగా అనిపించింది. అతను క్షమాపణలు చెప్పినందుకు సంతోషం" అని సైనా ట్విట్టర్లో రాసుకొచ్చింది.
అసలు ఏం జరిగింది?
ఇటీవల పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రధాని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన హీరో సిద్ధార్థ్.. అసభ్యకర రీతిలో సైనాపై కామెంట్ చేశారు. అది కాస్త పెద్ద దుమారమైంది.
సిద్ధార్థ్ ట్వీట్‌పై సైనా కుటుంబ సభ్యులతో పాటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థ్ ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ పలు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి చెత్త కామెంట్స్ చేసి, సారీ చెబితే సరిపోతుందా అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా పలు హిట్ సినిమాలతో అలరించిన సిద్ధార్థ్.. గతేడాది 'మహాసముద్రం' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.
ఇవీ చదవండి: