ETV Bharat / sitara

మూడేళ్ల పాటు ఒకే థియేటర్​లో ఆడిన సినిమా అది!

ఇప్పుడు థియేటర్​లో ఏదైనా సినిమా 100 రోజులు ఆడితే చాలా గొప్ప. అలాంటిది గతంలో ఓ చిత్రం మూడేళ్ల పాటు ఆడింది. ఒకే థియేటర్​లో రోజుకు మూడు ఆటల చొప్పున మూడు సంవత్సరాలు ప్రదర్శితమైంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని కథేంటి?

a indian movie shows three years in a theatre
థియేటర్
author img

By

Published : Aug 18, 2021, 10:55 AM IST

'పుండరీకుడు' అనే పేరుగల వ్యక్తి సర్వ వ్యసనాలు గలవాడు. తర్వాత అతను భక్తుడిగా మారి మోక్షం పొందాడు. ఇది జరిగిన కథో, కల్పనో తెలియదు గాని, ఆ పాత్రతో 'హరిదాస్‌' అనే తమిళ చిత్రం 1944లో విడుదలై విజయాలమీద విజయాలు సాధించింది. త్యాగరాజ భాగవతార్‌ ముఖ్యనటుడు. దక్షిణ దేశంలో 'హరిదాస్‌' ఒకే థియేటర్లో ఏకబిగిన మూడు సంవత్సరాలు ఆడింది.. ఆశ్చర్యంగాలేదూ? రోజుకు మూడు ఆటలు చొప్పున. ఈ సినిమా మన తెలుగుదేశంలోనూ ప్రదర్శితమై, జనాకర్షణకీ ధనాకర్షణకీ మారుపేరుగా నిలబడింది. ఇందులో త్యాగరాజ భాగవతార్‌ పాడిన 'కృష్ణాముకుందా మురారే' పాట సుప్రసిద్ధమైంది.

ఇదే కథను ఎన్‌.టి.రామారావు తీసుకొని 'పాండురంగ మహత్యం' పేరుతో నిర్మించి 1957లో విడుదల చేశారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం. ఎన్‌.టి.ఆర్, అంజలిదేవి ముఖ్యపాత్రధారులు. విశేషం ఏమిటంటే 'హరిదాస్‌'లోని అదే పాటని అదే వరుసతో 'పాండురంగ మహాత్యం'లో ఉపయోగించారు. చిత్రీకరణలో తేడాలున్నాయి. పాట నిడివి ఎక్కువ నిమిషాలున్నా ప్రేక్షకులు ఆనందించారు. ఈ పాట పాడిన ఘంటసాలకు మరింత పేరొచ్చింది. కానీ, ఈ సినిమాలో టైటిల్స్‌లో ఆయన పేరు లేదు! అయితేనేం సినిమా హిట్టు.

ntr
ఎన్టీఆర్ పాండురంగ మహత్యం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.