ETV Bharat / sitara

'సార్పట్ట' హీరో ఆర్యపై చీటింగ్ కేసు! - cheating case against Arya

కథానాయకుడిగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరో ఆర్యపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి, డబ్బులు తీసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

German woman files a cheating case against Arya
ఆర్య
author img

By

Published : Jul 30, 2021, 8:51 AM IST

'సార్పట్ట' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్య.. ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఈ మధ్యే అతడి భార్య సాయేషా సైగల్​.. ఆడపిల్లకు జన్మనివ్వడం వల్ల ఆర్య ఆనందం రెట్టింపు అయింది. ఈ సమయంలో అతడిపై జర్మనీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది.

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య.. రూ.70 లక్షలు తీసుకున్నాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్​లైన్​లో ఫిర్యాదు చేసింది. తామిద్దరి వాట్సాప్​ చాట్​ను కూడా సమర్పించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా నిషేధం విధించాలని ఆమె కోరింది.

arya sarpatta
సార్పట్టలో ఆర్య

ఈ కేసు విచారణ గురువారం జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు కేసు వాయిదా వేస్తున్నట్లు తీర్పు చెప్పారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.

నాని 'భలే భలే మగాడివోయ్'కు తమిళ రీమేక్​ 'గజినికాంత్'. ఈ సినిమా షూటింగ్​ సందర్భంగా కలిసిన ఆర్య, సాయేషా.. ప్రేమలో పడి, 2019లో పెళ్లిచేసుకున్నారు. ఇటీవల వీరికి ఆడబిడ్డ పుట్టింది.

arya sayesha
ఆర్య-సాయేషా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.