ETV Bharat / science-and-technology

వాట్సాప్​ సరికొత్త అప్డేట్.. మీకు నచ్చినవారికే కనిపిస్తాయ్! - వాట్సాప్ అప్డేట్ 2022

WhatsApp new updates: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. సరికొత్త అప్డేట్​తో ముందుకొచ్చింది. యూజర్లకు మరింత ప్రైవసీ కల్పించేలా కొత్త ఆప్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించి వాట్సాప్ డీపీని సైతం దాచేయొచ్చు.

WHATSAPP UPDATE PRIVACY DP
WHATSAPP UPDATE PRIVACY DP
author img

By

Published : Jun 18, 2022, 4:56 PM IST

WhatsApp DP hide update: మెసేజింగ్ యాప్​లలో అగ్రస్థానంలో దూసుకెళ్తున్న వాట్సాప్.. సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్, లాస్ట్ సీన్, స్టేటస్ అప్డేట్లను కొన్ని కాంటాక్టులకు మాత్రమే కనిపించేలా నూతన ఫీచర్​ను ప్రవేశపెట్టింది. ఇదివరకు ప్రొఫైల్ ఫొటో.. కాంటాక్ట్స్​లో ఉన్న అందరికీ కనిపించేది. లేదా ఎవరికీ కనిపించకుండా ఉంచే ఫీచర్ ఉండేది. ఇప్పుడు వీటికి అదనంగా.. 'మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్' అనే ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా వాట్సాప్ డీపీని అవసరమైనవారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.

WhatsApp privacy update: ఈ కొత్త అప్డేట్లు యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించనున్నాయి. తమ ఖాతాపై నియంత్రణ మరింత సులభం కానుంది. కొత్త అప్డేట్ ద్వారా లభించిన ఫీచర్​తో.. వాట్సాప్ ప్రైవసీ కంట్రోల్​లో మొత్తం నాలుగు ఆప్షన్స్ కనిపించనున్నాయి.

అవేంటంటే...

  • ఎవ్రీవన్: ఈ ఆప్షన్ సెట్ చేసుకుంటే వాట్సాప్ డీపీ, లాస్ట్ సీన్, ఎబౌట్, స్టేటస్ అప్డేట్స్ వాట్సాప్ యూజర్స్ అందరికీ కనిపిస్తాయి. మీ కాంటాక్టులో లేని వ్యక్తులు సైతం డీపీ, లాస్ట్ సీన్, ఎబౌట్​ను చూడొచ్చు.
  • మై కాంటాక్ట్స్: కాంటాక్టుల్లో సేవ్ చేసుకున్న నెంబర్లకు మాత్రమే అప్డేట్స్ వెళ్తాయి. ప్రొఫైల్ ఫొటో, అబౌట్, లాస్ట్ సీన్ సైతం కాంటాక్ట్ నెంబర్లకే కనిపిస్తుంది.
  • మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్: ఇది కొత్తగా జోడించిన ఆప్షన్. స్టేటస్​ అప్డేట్స్​లో ఈ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇప్పుడు దీన్ని వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో, ఎబౌట్​కు సైతం వర్తించేలా అప్డేట్ తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ ద్వారా నచ్చిన కాంటాక్టులకు మాత్రమే అప్డేట్స్ కనిపించేలా చేయవచ్చు.
  • నోబడీ: లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటో, ఎబౌట్, స్టేటస్ అనేవి ఎవరికీ కనిపించవు.

ఇవే కాదు, ఇంకా ఎన్నో అప్డేట్స్​పై వాట్సాప్ కసరత్తులు చేస్తోంది. డిలీట్ చేసిన మెసేజ్​ను తిరిగి పొందేందుకు 'అన్ డూ' ఆప్షన్​ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ అప్డేట్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. దీంతోపాటు త్వరలో.. మెసేజ్‌ 'ఎడిట్‌' బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మనం వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌లో ఏవైనా పొరబాట్లు ఉంటే దాన్ని డిలీట్‌ చేయడం తప్పితే మరో అవకాశం లేదు. అలా కాకుండా.. మెసేజ్‌ పంపిన తర్వాత కూడా ఆ సందేశాన్ని మార్చుకునే సదుపాయాన్ని ఈ 'ఎడిట్‌' ఆప్షన్‌ కల్పించనుంది. దీని గురించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఇదీ చదవండి: వాట్సాప్​లో 'Hi' చెబితే చాలు.. క్షణాల్లో లోన్​ వచ్చేస్తుంది.. ఎలా అంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.