WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ సందేశాలను మరింత ఆకర్షణీయంగా పంపించేందుకుగాను.. స్టిక్కర్స్, అవతార్స్, జిఫ్ పిక్‌లను పునఃరూపకల్పన (రీడిజైన్) చేస్తోంది.
WhatsApp Beta Update iOS : వాబీటాఇన్ఫో ప్రకారం, వాట్సాప్ తీసుకువస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు కీబోర్డ్ ద్వారా న్యూ స్టిక్కర్స్, జిఫ్ ఫైల్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అప్డేట్ కేవలం ఐఓఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందుకోసం యాపిల్ స్టోర్‌లోకి వెళ్లి, ఐఓఎస్ 23.13.78 వెర్షన్ వాట్సాప్‌ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ అప్డేట్లో కొత్తదనం ఏంటి?
WhatsApp New Update : ఈ కొత్త అప్డేట్ వల్ల వాట్సాప్ యూజర్లు అన్లిమిటెడ్ స్టిక్కర్స్, జిఫ్ ఫైల్స్‌ను వినియోగించుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ న్యూ అప్డేట్లో జిఫ్, స్టిక్కర్, అవతార్ సెక్షన్లను రీలొకేట్ చేయడం జరిగింది. అలాగే ట్యాబ్స్ విషయంలోనూ మార్పులు చేశారు. దీని వల్ల యూజర్లు మరింత సులువుగా నావిగేట్ చేయగలుగుతారు. అవతార్ కేటగిరీని కూడా బాగా ఇంప్రూవ్ చేశారు. దీని వల్ల చాలా పెద్ద సంఖ్యలో అవతార్ స్టిక్కర్లు, పిక్చర్లను యూజర్లు వినియోగించుకోవచ్చు.
వాట్సాప్ వెబ్ అప్డేట్స్
Web WhatsApp update : త్వరలో వాట్సాప్ వెబ్‌లో.. ఫోన్ నంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాలు అన్నీ అనుసంధానం చేసుకునే విధంగా అప్డేట్ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది బీటా టెస్టర్లు దీనిని వాడుతున్నారు. ప్రధానంగా ఆండ్రాయిడ్ 2.23.14.18 వెర్షన్లో ఈ వాట్సాప్ ఫీజర్ అందుబాటులోకి వచ్చింది.
వాట్సాప్ నయా ఫీచర్స్
Latest WhatsApp Features 2023 : వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం నయా ఫీచర్లు తెస్తూనే ఉంది. వాట్సాప్‌లో హెచ్డీ క్వాలీటీ ఫొటోలు, వీడియోలు పంపించే విధంగా సరికొత్త ఫీచర్లు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అదే విధంగా వాట్సాప్‌లోనే ఫోటో ఎడిటింగ్ ఫీచర్, చాట్ డిలీట్, చాట్ ఎడిట్ ఫీచర్లు తీసుకురానుంది.
వాట్సాప్ స్కామ్స్ పెరిగిపోతున్నాయ్.. జాగ్రత్త!
WhatsApp Scams 2023 : నేటి యువత దైనందిన జీవితంలో వాట్సాప్ ఒక భాగమైపోయింది. కానీ ఇదే సమయంలో దీనిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. స్కామ్ మెసేజ్‌లు, వీడియోలు పంపిస్తూ, యూజర్ల డేటాను చోరీ చేస్తున్నారు. అలాగే లాటరీ వచ్చిందని, బహుమతులు వచ్చాయని నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు. క్యూఆర్ కోడ్, క్రిప్టో స్కామ్‌లకు కూడా తెగబడుతున్నారు. కనుక వాట్సాప్ వినియోగదారులు కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.