ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. 2022లో కమ్యూనిటీస్, అవతార్, సెల్ఫ్ చాట్, వ్యూ వన్స్ మెసేజ్ వంటి ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా 2023లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు వాట్సాప్ సిద్ధమవుతోంది. అవేంటంటే..
డేట్‌తో మెసేజ్‌ల సెర్చింగ్..
వాట్సాప్ వినియోగదారులు చాట్ పేజీలో అవసరమైన మెసేజ్‌లను సులువుగా వెతికేందుకు వీలుగా కొత్త సెర్చ్ ఆప్షన్‌ను తీసుకురానుంది. అయితే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌లో కాకుండా ఐఓఎస్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం టెక్ట్స్‌తో సెర్చ్ చేసినట్లుగా, ఇకపై యూజర్లు డేట్‌తో సెర్చ్ చేయొచ్చు. దీంతో యూజర్లు తేదీల వారిగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్ చేసి చూడొచ్చు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లకు సెర్చ్ బార్‌పై క్లిక్ చేస్తే క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో తేదీపై టాప్ చేస్తే ఆ రోజు వచ్చిన మెసేజ్‌లు చాట్ పేజీలో కనిపిస్తాయి. అలా కిందకు స్క్రోల్ చేస్తూ తర్వాత, ముందు రోజు మెసేజ్‌లను కూడా యూజర్ చూడొచ్చు. దీనివల్ల యూజర్ ఏ రోజు ఏయే మెసేజ్‌లు పంపారనే వివరాలతో పాటు, మెసేజ్ సెర్చింగ్ సులువుగా ఉంటుంది.
వీడియో కాల్ సమయంలో..
వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేటప్పుడు వినియోగదారులు వేరే యాప్‌లను బ్రౌజ్ చేయడానికి సరికొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది. ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్పో తెలిపింది.
'వ్యూ వన్స్'.. ఆ తర్వాత కనిపించదు..
వాట్సాప్ తీసుకురాబోతున్న వ్యూ వన్స్ మెసేజ్ ఫీచర్ ద్వారా ఎవరైనా పంపించిన సందేశాన్ని కేవలం ఒక్కసారి చూసేందుకు మాత్రమే వీలుంటుంది. ఒకసారి చూశాక అది కనిపించదు. అటు పంపించేవారికి, అందుకునే వారికి సైతం ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. అంటే ఎవరైనా పంపిన మెసేజ్‌ను వేరొకరికి పంపించడానికి వీలుండందన్నమాట.
కొత్త డివైజ్‌లో..
యూజర్ ఏదైనా కొత్త డివైజ్‌లో వాట్సాప్ ఖాతాను లాగిన్ చేయాలనుకుంటే సాధారణంగా వెరిఫికేషన్ కోసం పంపే ఎస్ఎమ్ఎస్తోపాటు అదనంగా మరో వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే కొత్త డివైజ్‌లో వాట్సాప్ కోసం యూజర్ ఫోన్ నంబర్ టైప్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే స్క్రీన్ మీద పాప్-అప్ మెసేజ్ కనిపిస్తుంది.
డెస్క్టాప్పై వాట్సాప్ కాల్ హిస్టరీ..
తాజాగా డెస్క్‌టాప్ వెర్షన్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీంతో మొబైల్ యాప్‌లో మాదిరి యూజర్లు ఇకపై డెస్క్‌టాప్‌లో కూడా వాట్సాప్ కాల్ హిస్టరీని యాక్సెస్ చేయొచ్చు. ప్రస్తుతం విండోస్ 2.2246.4.0 వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకుని బీటా యూజర్లు.. ఈ ఫీచర్‌ను పరీక్షించవచ్చు. త్వరలోనే సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది.