ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో పొరపాటున మెసేజ్ డిలీట్ చేశారా? అయినా నో ప్రాబ్లం! - మెసేజ్​ యువర్​ సెల్ప్ ఫీచర్​

వాట్సాప్​ వినియోగదారులకు ఓ గుడ్​ న్యూస్​ను వినిపించింది ఆ సంస్థ. సోమవారం యాప్​లో కొత్తగా 'యాక్సిడెంటల్ డిలీట్' ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇది యాప్​ యూజర్లకు కొత్త రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని మెటా సంస్థ తెలిపింది.

యాక్సిడెంటల్​ డిలీట్​ ఫీచర్​
Accidental delete feature
author img

By

Published : Dec 19, 2022, 5:39 PM IST

వాట్సాప్ సోమవారం కొత్తగా 'యాక్సిడెంటల్ డిలీట్' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వాట్సాప్​ యూజర్లకు కొత్త రక్షణ పొరగా నిలవనుంది. సాధారణంగా ఒక వ్యక్తికి పంపాల్సిన మెసేజ్​ను పొరపాటున మరొక స్నేహితుడికి పంపిస్తుంటాము. తర్వాత తేరుకొని వెంటనే డిలీట్​ చేద్దామని 'డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్'కు బదులు 'డిలీట్​ ఫర్​ మీ'పై క్లిక్​ చేస్తాము. అప్పుడు ఆ సందేశం మన చాట్​ నుంచి మాత్రమే డిలీట్​ అయ్యి అవతలి వారి చాట్​లో అలానే ఉంటుంది. దీంతో కొన్నిసార్లు సన్నిహితుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా వాట్సాప్​ తెచ్చిన ఈ నయా ఫ్యూచర్​తో ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చు.

ఈ సమస్యను పరిష్కరించడానికి తెచ్చిన యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్​తో.. మనం పంపించి 'డిలీట్​ ఫర్​ మీ' చేసిన మెసేజ్​ను తిరిగి పొందడానికి ఐదు సెకన్ల సమయం లభిస్తుంది. ఈ విండో ఓపెన్​ అవ్వగానే 'డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్​' ఆప్షన్​పై క్లిక్​ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ మెసేజ్​ ఇద్దరి చాట్​ నుంచి తొలగిపోతుంది.

ఐఫోన్​, ఆండ్రాయిడ్​ ఫోన్లలో అందుబాటులోకి..
యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. గత నెలలో వాట్సాప్​ కొత్తగా 'మెసేజ్ యువర్ సెల్ఫ్' ఫీచర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది మనకు మనం నోటిఫికేషన్స్, రిమైండర్స్​, అప్​డేట్స్ పంపించుకోవడానికి వీలుగా తెచ్చిన వన్​ టు వన్​ చాట్​ ఫీచర్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.