మనం సాధారణంగా ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేయాలంటే టెక్స్ట్టో పాటు ఫోటోలు లేదా వీడియోలను జత చేస్తాం. ఇతర యాప్స్‌లో ఫొటోలు, వీడియోలు ఒకే పోస్ట్‌కు జత చేయచ్చు. కానీ ట్విట్టర్లో ఆ ఆప్షన్ అందుబాటులో లేదు. ఫొటో, వీడియో, జిఫ్ ఇమేజ్ ఇలా అనేక రకాల మీడియా ఉన్నప్పటికీ వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఒక పోస్ట్‌లో అప్లోడ్ చేసే అవకాశం ఉండేది. ఒకే సారి ఫొటోతో పాటు వీడియో జత చేయాలంటే పెద్ద సమస్య అనే చెప్పాలి.
ఇప్పుడా సమస్య లేదంటోంది ట్విట్టర్ యాజమాన్యం. ఇకపై మూడు ఫార్మాట్లను ఒకే పోస్ట్‌కు జత చేయగలిగేలా ఓ అప్డేట్ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లోనూ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇంతకు ముందు, వివిధ మీడియా ఫార్మాట్లను ట్వీట్లో ఉపయోగించాలంటే వాటిని వేర్వేరు ట్వీట్లలో లేదా థ్రెడ్‌లో కంపోజ్ చేయాల్సి ఉండేది. ఇప్పుడా అవసరం లేదని సంస్థ తెలిపింది.
ట్వీట్ కంపోజర్‌ను ఓపెన్ చేసి ఫొటోలు, మీమ్‌లు, జిఫ్ ఇమేజ్, వీడియో లాంటి నాలుగు రకాల మీడియాలను ఒకే సారి అప్లోడ్ చేయొచ్చని తెలిపింది ట్విట్టర్. అంతే కాకుండా ట్వీట్‌ను కంపోజ్ చేస్తున్నప్పుడు వారు తమ మీడియా లే అవుట్‌ను కూడా మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆంగ్లంలో ట్విట్టర్‌ను ఉపయోగించే ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే ఇప్పుడు ఈ ఫీచర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
మీడియా ట్వీట్‌ను కంపోజ్ చేయడం ఎలా ??
- ట్విట్టర్‌లోని హోమ్ పేజ్‌కు వెళ్లాలి.
- అక్కడ వాట్స్ హ్యాపెనింగ్ అనే ట్వీట్ కంపోజింగ్ బాక్స్ కనిపిస్తుంది.
- బాక్స్‌లో ఫొటో, పోల్ ఎమోజీ ఐకాన్లు కనిపిస్తాయి.
- వాటిలో ఇమేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని మిగతా మీడియాను యాడ్ చేయాలి. అంతే మల్టిపుల్ మీడియా ట్వీట్ ఇక సృష్టించేయచ్చు ఈజీగా.
ఇదీ చదవండి: జియో ల్యాప్‌టాప్ రిలీజ్.. ధర రూ.20వేలు లోపే!
ఎవరైనా అడిగితే ఓటీపీ చెప్పేస్తున్నారా?.. అయితే జాగ్రత్త పడాల్సిందే!!