ETV Bharat / science-and-technology

Mute Feature on Twitter: మ్యూట్​ ఫీచర్​​తో ఆ ట్వీట్లకు చెక్! - how to turn off comments in twitter

ట్విట్టర్​లో మనం ఏదైనా పోస్ట్​ పెడితే.. కొందరు అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. అటువంటి ట్వీట్లకు మ్యూట్ ఆప్షన్‌ను(mute option in twitter) ఉపయోగించి చెక్​ పెట్టవచ్చు. దీని సాయంతో యూజర్స్‌ సదరు ఖాతాదారులను బ్లాక్‌, అన్‌ఫాలో చేయకుండా వాటి ట్వీట్లను టైమ్‌లైన్‌ నుంచి తొలగించవచ్చు. మరి ఈ ఆప్షన్​ను ఎలా ఉపయోగించాలంటే..?

Mute Feature on Twitter
ట్విట్టర్​లో మ్యూట్ ఫీచర్ల్
author img

By

Published : Nov 29, 2021, 11:22 AM IST

వాట్సాప్‌లో విసుగుపుట్టించే నోటిఫికేషన్లకు చెక్ పెట్టేందుకు సదరు యూజర్‌ లేదా గ్రూప్‌ను మ్యూట్ చేస్తాం. అలానే ట్విట్టర్‌లో కూడా మన ట్వీట్లకు కొద్దిమంది యూజర్స్‌ అదేపనిగా ఇబ్బందికర కామెంట్లు పెడుతుంటారు. అలాంటి ట్వీట్లను మన టైమ్‌లైన్‌ నుంచి తొలగించేందుకు ట్విట్టర్‌ కీలక సూచన చేసింది. ఇందుకోసం ట్విట్టర్‌లో ఉన్న మ్యూట్ ఆప్షన్‌(mute option in twitter) ఉపయోగించాలని ట్విట్టర్‌ సూచించింది. దీని సాయంతో యూజర్స్‌ సదరు ఖాతాదారులను బ్లాక్‌, అన్‌ఫాలో చేయకుండా వాటి ట్వీట్లను టైమ్‌లైన్‌ నుంచి తొలగించవచ్చని తెలిపింది. మరి ఈ మ్యూట్ ఫీచర్‌ను(twitter mute option) ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ట్వీట్‌ నుంచి మ్యూట్

మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న ట్వీట్‌కు కుడివైపున మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అందులో మీకు మ్యూట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు ఖాతాదారుడి ట్వీట్లు మీ టైమ్‌లైన్‌పై కనిపించవు.

ప్రొపైల్‌ నుంచి మ్యూట్

మీరు మ్యూట్ చేయాలనుకుంటున్న యూజర్‌ ప్రొఫైల్ ఓపెన్ చేయాలి. అందులో మోర్‌ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మ్యూట్ అప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు సదరు యూజర్‌ను మ్యూట్ చేసినట్లు పాప్‌-అప్‌ మెసేజ్‌ కనిపిస్తుంది.

మరి అన్‌మ్యూట్ ఎలా(How to unmute on twitter)?

  • ఒకవేళ మీరు మ్యూట్ చేసిన యూజర్‌ను అన్‌మ్యూట్(unmute on twitter) చేయాలనుకుంటే సదరు యూజర్‌ ప్రొఫైల్‌ ఓపెన్‌ చేసి మోర్‌పై క్లిక్ చేస్తే అందులో అన్‌మ్యూట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు యూజర్‌ అన్‌మ్యూట్ అవుతారు.
  • అలానే మీరు ఒకరికన్నా ఎక్కువ మంది యూజర్స్‌ను మ్యూట్ చేశారనుకుందాం. వారిలో కొందరిని మీరు అన్‌మ్యూట్ చేద్దామనుకుంటున్నారు. ఇందుకోసం మీ ప్రొఫైల్‌ ఓపెన్ చేసి అందులో సెట్టింట్స్‌ అండ్‌ ప్రైవసీపై క్లిక్ చేయాలి.
  • తర్వాత ప్రైవసీ అండ్ సేఫ్టీ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులో మ్యూట్ అండ్‌ బ్లాక్ అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీరు మ్యూటెడ్ అకౌంట్స్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు మ్యూట్ చేసిన ఖాతా జాబితా కనిపిస్తుంది. అందులోంచి మీరు ఎవరిని అన్‌మ్యూట్ చేయాలకుంటున్నారో వారి ఖాతాపై క్లిక్ చేస్తే సదరు ఖాతా అన్‌మ్యూట్ అవుతుంది.

ఈ ఫీచర్‌తో మీరు మ్యూట్ చేసిన వ్యక్తుల ట్వీట్లు మీ టైమ్‌లైన్‌పై కనిపించవు. గతంలో అయితే ఇలాంటి యూజర్స్‌ను బ్లాక్ లేదా అన్‌ఫాలో చేయడం మినహా ఇతర ఆప్షన్ ఉండేదికాదు. దీంతో మీరు ఏదైనా ఖాతాను బ్లాక్ లేదా అన్‌ఫాలో చేసినా వారికి తెలిసిపోయేది. కానీ మ్యూట్ ఫీచర్‌తో(mute option) సదరు ఖాతాదారులు మిమ్మల్ని అనుసరిస్తున్నప్పటికీ మీరు వారిని మ్యూట్ చేసినట్లు తెలియదని ట్విట్టర్‌ పేర్కొంది.

ఇదీ చూడండి: నంబర్ సేవ్​ చేయకుండా వాట్సాప్​లో మెసేజ్​ చేయండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.