ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన వీడియో వెబ్సైట్లలో యూట్యూబ్ ఒకటి. ఇప్పటివరకు చాలా పాపులర్ అయిన సైట్. మిలియన్ల సంఖ్యలో నెటిజన్లు యూట్యూబ్‌ను వినియోగిస్తున్నారు. వీడియోలు క్రియేట్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి యూట్యూబ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మరి కొంత మందికి సెకండ్ ఇన్కమ్ సోర్స్‌గా కూడా యూట్యూబ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏ వీడియో కావలన్నా లభిస్తుంది. అయితే ఇలాంటి వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్ ఒక్కటే లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో యూట్యూబ్‌కి టాప్ ప్రత్యమ్నాయాలు ఇవే..
1. వీమియో(Vimeo)
రెగ్యులర్‌గా యూట్యూబ్ వీడియోలు చూసే అలవాటు ఉంటే మీరు కచ్చితంగా దాని ప్రత్యామ్నాయం వీమియో వీడియో సైట్‌ను చూడాల్సిందే. హై డెపినిషన్ వీడియోలను సపోర్ట్ చేసిన మొట్టమొదటి వీడియో సైట్ ఇదే. ఇందులో టీవీ సిరీస్‌లు, 360 డిగ్రీ వీడియోలు కూడా చూడొచ్చు. సులభమైన యూజర్ ఇంటర్ఫేస్తో ఉన్న ఈ సైట్‌ను సులువుగా బ్రౌజ్ చేయొచ్చు. వీమియో వీడియోలను కేటగిరీ, ఛానళ్లుగా విభజించింది. దీంతో మనకు కావాల్సిన వీడియోను వెతకడం కూడా తేలికే. మీకు ఏం చూడాల్సిన అత్యుత్తమ వీడియోలను వీమియో స్టాఫ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. అది మీరు సరైన వీడియోను ఎంపిక చేసుకోవడంలో సహాయ పడుతుంది.

2. వీడియోస్హబ్(VideosHub)
ఈ వీడియోస్హబ్ సైట్లో వీడియోలు షార్ట్ ఫామ్‌లో ఉంటాయి. వివిధ వస్తుల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వాటి గురించి క్విక్ రివ్యూస్ ఇచ్చే వీడియోల కోసం మనం వెతుకుతాం. అలాంటి వీడియోలే ఇందులో ఉంటాయి. సింపుల్, యూజర్ ఫ్రెండ్లీగా ఉండటమే ఈ సైట్ ప్రత్యేకత. దీన్ని బ్రౌజ్ చేయడం కూడా చాలా సులభం. ఎక్కువ మంది వీక్షించిన వీడియోలు హోమ్ పెజీలో ఉంటాయి. ఇంకా లోతుగా వెతకాలంటే ఎడమ పక్కన ఉన్న ప్యానెల్ వీడియో కేటగిరిలో లిస్టు ఉంటుంది. అందులో సెలెక్ట్ చేసుకుని వీడియోలు చూడొచ్చు.

3. డైలీ మోషన్(Dailymotion)
యూట్యూబ్ లాంటి వీడియో వెబ్సైట్లలో డైలీ మోషన్ ఒకటి. ఈ సైట్.. యూట్యూబ్ ప్రారంభించిన నెల తర్వాత మార్చి 2005లో మొదలయ్యింది. యూట్యూబ్‌కు ఈ కంపెనీ గట్టి పోటీ ఇస్తోంది. సీఎస్ఐ మ్యాగజైన్ లెక్కల ప్రకారం ఈ సైట్‌ను నెలకు 300 మిలియన్ల యూజర్లు విజిట్ చేస్తున్నారు. ఈ సైట్లో ఇప్పటివరకు కొన్ని మిలియన్ల వీడియోలు అప్లోడ్ అయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ హోమ్ పేజీలో వీడియోస్, న్యూస్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, మ్యూసిక్ లాంటి కేటగిరిలో ఉంటాయి. ఈ సైట్లో అకౌంట్ క్రియోట్ చేసుకుంటే పర్సనలైజ్డ్ వీడియోలు వస్తాయి.
4. ఉట్రియాన్(Utreon)
ఉట్రియాన్.. 2019లో వీడియో సైట్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో యూట్యూబ్‌లో ఉన్నంత నియమ నిబంధనలు ఉండవు. ఇది అందరికీ ఉచితం కాదు. మీరు వీడియో ప్రొడ్యూసర్ అయితే మళ్లీ మీ ట్యూబ్ వీడియోలను ఉట్రియాన్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కాలవాలనుకుంటే.. యూట్యూబ్ వీడియోలు అన్నీ ఉట్రియాన్ ప్రొఫైల్లోకి వచ్చేస్తాయి.

5. ది ఇంటర్నెంట్ అర్కైవ్స్(The Internet Archive)
ది ఇంటర్నెంట్ అర్కైవ్స్ అనేది వెబ్ ఆధారితి ఉచిత లైబ్రరీ. ఇందులో పుస్తకాలు, సంగీతం, సాఫ్ట్వేర్, సినిమా లాంటివన్నిటినీ ఉచితంగా బ్రౌజ్ చేసుకోవచ్చు. మనం సాధారణ లైబ్రరీలో ఎలాగైతే పరిశోధన చేస్తామో.. ఇందులో కూడా అలాగే చేయొచ్చు. ఇందులో పాత కంటెంట్‌తోపాటు టీవీ సిరీస్‌లు, పాత న్యూస్ రిపోర్టులు, సినిమాలు లాంటి విస్తృతమైన కంటెంట్ ఉంటుంది. ఇలాంటి సమాచారం ఏ ఇతర సైట్లలో దొరకదు. అన్ని వీడియో సైట్లలాగే ఇందులో కూడా యూజర్లు కంటెంట్ అప్లోచ్ చేయొచ్చు.

6. క్రాకల్(Crackle)
క్రాకల్ ఒక వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం. ఇందులో వెబ్ షోలు, టీవీ సిరీస్‌లు, సినిమాలు చూడొచ్చు.

7. ట్విచ్(Twitch)
ట్విచ్.. అమెజాన్‌కు చెందిన కంపెనీ. డిమాండ్ సేజ్ అనే సేల్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రకారం వీడియో స్ట్రీమింగ్కు ఇది బెస్ట్ ప్లాట్‌ఫామ్. ఇందులో 140 మిలియన్ల యూజర్లు ఉన్నారు. దేని మీదైనా ఇందులో మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ఇందులో గేమింగ్ మోస్ట్ పాపులర్ స్ట్రీమిగ్ కేటగిరీ. ఈ ట్విచ్.. పలు టాప్ సింగర్ల లైవ్ కాన్సెర్ట్లను కూడా బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇందులో ఉచిత, సబ్స్క్రిప్షన్ ఆధారంగా స్ట్రీమింగ్ ఛానల్స్ ఉంటాయి.

8. ఓపెన్ వీడియో ప్రాజెక్ట్ మెను(open video project menu)
ఓపెన్ వీడియో ప్రాజెక్ట్ మెను.. ఈ ప్లాట్‌ఫామ్‌ను నార్త్ కరోలినా యూనివర్సిటీలోని ఓ లాబొరేటరీలో అభివృద్ధి చేశారు. ఇది పరిశోధనలు, మల్టీమీడియా, డిజిటల్ లైబ్రరీల లాంటి రంగాల్లో పని చేసే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో చాలా వరకు ఎడ్యుకేషన్‌కు సంబంధించిన వీడియోలే ఉంటాయి. హిస్టారికల్ వీడియో కంటెంట్ మీద పరిశోధన చేసేవాళ్లకు.. ఈ సైట్ ఉపయోగకరంగా ఉంటుంది.
9. 9గ్యాగ్ టీవీ (9gag tv)
9గ్యాగ్ టీవీ వీడియో సైట్లో ఫన్నీ ఫొటోలు, జీఐఎఫ్, గేమింగ్ వీడియోలు, మీమ్స్ లాంటివి అన్నీ ఉంటాయి. ఈ సైట్లో వీడియో కంపైలేషన్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇలాంటివి చాలా వీడియోలు ఇందులో ఉంటాయి.

10. టెడ్ టాక్స్ (ted talks)
టెడ్ టాక్స్.. చాలా మందికి తెలిసిన పాపులర్ సైట్లలో ఒకటి. ఇందులో 3,500ల నిపుణులు.. సాంకేతికం, వ్యాపారం, డిజైన్, సైన్స్, ప్రపంచ సమస్యలు మొదలైన విషయాలపై ఉపన్యాసాలు ఉంటాయి. ఈ సైట్ ప్రతి వారం 5 నుంచి 7 కొత్త వీడియోలను అప్లోడ్ చేస్తుంది. ఇందులో కొన్ని ఫన్నీగా, మరి కొన్ని ఎమోషనల్‌గా ఉంటాయి. ఇందులో 6 నిమిషాలకన్నా తక్కువ నిడివి ఉన్న వీడియోలక రెడ్ సర్కిల్ మార్కు ఉంటుంది. దీంతో మన సమయం సేవ్ అవుతుంది.

11. డీ ట్యూబ్(DTube)
డీ ట్యూబ్ చాలా ప్రత్యేకమైన వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్. ఇది యూట్యూబ్లా పనిచేస్తుంది. యూట్యూబ్‌లో ప్రతి వీడియోకు ఎన్ని వీక్షణలు వచ్చాయో లెక్క ఉంటుంది. కానీ ఇందులో ఆ వీడియోకు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు వచ్చాయో అనే లెక్క ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. మనం సంపాదించిన డబ్బులను స్టీమ్(STEEM) అనే క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకోవచ్చు. వాటిని క్రిప్టో ఎక్స్చేంజ్ల ద్వారా నగదుగా మార్చుకోవచ్చు.

12. ఫేస్బుక్ వాచ్(facebook watch)
ఫేస్బుక్.. దాదాపు మనందరికీ తెలిసిన సోషల్ మీడియా సైట్. ఇందులో మొదట వీడియో ఆప్షన్ లేదు. ఆ తర్వాత వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను యాడ్ చేశారు. అదే ఫేస్బుక్ వాచ్. ఇందులో చాలా వరకు గుర్తింపు పొందిన ఛానళ్ల వీడియోలు ఉంటాయి. హై డెఫినిషన్ వీడియో కంటెంట్ ఉంటుంది.
