ETV Bharat / science-and-technology

దేశంలో ఆన్​లైన్​ వీడియో వీక్షకుల సంఖ్య ఎంతంటే? - గూగుల్​ తాజా సర్వేలు

భారతదేశంలో రోజుకు ప్రతి ముగ్గురిలో ఓ వ్యక్తి గంటకుపైగా ఆన్​లైన్​ వీడియోలను చూస్తున్నారని గూగుల్​ నివేదిక తెలిపింది. ఈ విభాగంలో హిందీ వీక్షకుల సంఖ్య అధికంగా ఉండగా.. తెలుగు వారు మూడో స్థానంలో ఉన్నారు. గూగుల్​ సర్వే ఇంకా ఏం చెబుతోందంటే...?

Google survey reports
దేశంలో ఆన్​లైన్​ వీడియో వీక్షకుల సంఖ్య ఎంతంటే?
author img

By

Published : Jun 5, 2020, 4:40 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

దేశంలో సగటున ప్రతి ముగ్గురిలో ఒకరు గంటకు పైగా ఆన్​లైన్​ వీడియోలను వీక్షిస్తున్నారని గూగుల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఇందులో హిందీ భాషలో అధికంగా 54 శాతం మంది వీక్షించగా.. ఇంగ్లీష్​లో 16 శాతం మంది చూశారు. తెలుగు(7 శాతం) మూడో స్థానంలో నిలవగా.. కన్నడ(6 శాతం), తమిళం(5 శాతం), బెంగాలీ(3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఈ ఏడాది దేశంలో ఆన్​లైన్​ వీడియోలను వీక్షించేవారి సంఖ్య సుమారు 50 కోట్ల మందికి చేరనుందని సర్వేలో వెల్లడించింది గూగుల్​. అయితే వీరిలో గ్రామీణ ప్రాంతాల వారు 37 శాతం ఉన్నారని సర్వే పేర్కొంది.

  • దేశంలో సగటున రోజుకు 67 నిమిషాల పాటు ఆన్​లైన్​ వీడియోలకు సమయాన్ని కేటాయిస్తున్నారు వీక్షకులు. కొత్తగా ఇంటర్నెట్ సేవలను వినియోగించే వారు కూడా సగటున 56 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారు.
  • ఇంటి నుంచి 79 శాతం మంది వీడియోలను వీక్షిస్తుండగా.. ప్రయాణాలు, ఇతర పనుల్లో ఉంటూనే 21 శాతం మంది చూస్తున్నారు.

'అండర్​స్టాండింగ్​ ఇండియాస్​ ఆన్​లైన్​ వీడియో వీవర్​(భారత్​లో ఆన్​లైన్​ వీడియోలను వీక్షించే వారి సంఖ్య)' పేరిట 6,500 మందిపై సర్వే చేపట్టింది గూగుల్​. ఇందులో 15 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు 73 శాతం మంది ఉన్నారు.

ఆన్​లైన్​ ద్వారా వీడియోలను వీక్షించడంలో '4పీ'లు ప్రేరణగా నిలుస్తున్నాయి.

  1. ప్లెజర్​(వినోదం) - 56 శాతం
  2. పవర్​(శక్తి) - 20 శాతం
  3. పర్పస్​(అవసరం) - 14 శాతం
  4. పీపుల్​(ప్రజలు) - 11 శాతం

అయితే 43 శాతం మంది నేర్చుకోవడం కోసమే ఆన్​లైన్​లో వీడియోలను వీక్షిస్తున్నారని సర్వేలో పేర్కొంది గూగుల్​.

ఇదీ చదవండి: 'బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోతాయి'

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.