ETV Bharat / science-and-technology

ల్యాప్​టాప్​ కొంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి

ఉద్యోగులు, విద్యార్థులు, టీచర్లు.. ఇలా అందరూ ల్యాప్​టాప్​లను వాడుతున్నారు. కరోనా వల్ల ఇంటి నుంచే అన్ని పనులు చేయాల్సి రావటమే దీనికి కారణం. అయితే ఇప్పటికీ చాలా మంది ల్యాప్​టాప్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. కానీ కొనేముందు ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో వారికి తెలియట్లేదు. ఇందుకోసం ఈ స్టోరీ చూసేయండి.

laptop
లాప్​టాప్​
author img

By

Published : Jul 10, 2021, 4:40 PM IST

ల్యాప్​టాప్.. ప్రస్తుత కాలంలో దీని ఉపయోగం పెరిగింది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు, విద్యార్థులు ఆన్​లైన్ క్లాసులు వినేందుకు... ఇలా చాలా అవసరాలను కంప్యూటర్ అవసరం ఉంటోంది. ల్యాప్​టాప్​కు ఉన్న అనుకూలతల దృష్ట్యా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.

రూ.15వేల నుంచి లక్షల రూపాయాల వరకు ల్యాప్​టాప్​లు మార్కెట్​లో అందుబాటులో ఉంటున్నాయి. ఫీచర్లు, హార్డ్​వేర్​ను బట్టి వీటి ధరల్లో మార్పు ఉంటుంది. బడ్జెట్​తో పాటు ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని ల్యాప్​టాప్​ను ఎంచుకోవాలి. సాంకేతికంగా కూడా వీటిని కొనుగోలు చేసే సమయంలో పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

వీడియో ఎడిటింగ్, గేమ్స్ లాంటి హై ఎండ్ ఉపయోగం నుంచి మొదలుకొని.. నెట్ బ్రౌజింగ్ లాంటి చిన్న చిన్న కార్యకలాపాలను ల్యాప్​టాప్​లో నిర్వహించాల్సి ఉంటుంది. హై ఎండ్ ఉపయోగం ఉన్న వారు మంచి దానిని తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో చిన్న చిన్న పనులు కోసం అయితే తక్కువ స్థాయిలో తీసుకున్నా సరిపోతుంది.

ప్రాసెసర్

ల్యాప్​టాప్​ ముఖ్యమైన భాగాల్లో ప్రాసెసర్ అనేది చాలా కీలకం. ఇది ఎంత ఎక్కువ స్పీడ్ ఉండే అంత మంచిది. మంచి ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్​ను సమర్థంగా నిర్వహిస్తుంది. ఇంటెల్, ఏఎండీలు కంప్యూటర్ ప్రాసెసర్లను తయారు చేస్తున్న ప్రధాన కంపెనీలు. ఇంటెల్​లో ఐ3, ఐ5, ఐ7 ప్రాసెసర్లు ఉన్నాయి. వీటిలో జనరేషన్ మారుతుంటుంది. ప్రస్తుతం 11వ జనరేషన్ ప్రాసెసర్లను ఇంటెల్ విడుదల చేసింది. ఏఎండీ లో కూడా పలు రకాల ప్రాసెసర్లు ఉన్నాయి. ఇంటెల్ ప్రాసెసర్లను తీసుకుంటే ఐ7 హెవీ టాస్క్​లను హ్యాండిల్ చేయగలదు. అదే సమయంలో ఐ3 తక్కువ టాస్క్​లను హ్యాండిల్ చేయగలదు.

మెమోరీ

రోజు వారీ ఉపయోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మంచి మెమోరీ సరిపడేంత ఉండాలి. ఒకప్పుడు హెచ్​డీడీ(హార్డ్ డిస్క్ డ్రైవ్) మెమోరీలు మాత్రమే ల్యాప్​టాప్​లలో వచ్చేవి. ఇప్పుడు ఎస్ఎస్​డీ(సాలిడ్ స్టేట్ డ్రైవ్)లు వస్తున్నాయి. హెచ్​డీడీ అనేది డిస్క్ ఆధారిత టెక్నాలజీ. ఎస్​ఎస్​డీలో పోల్చితే రీడ్, రైట్​స్పీడ్​లు తక్కువగా ఉంటాయి. ఎస్ఎస్​డీ అనేది మెమోరీ కార్డ్​ను పోలి ఉంటుంది. ఇందులో రీడ్, రైట్​స్పీడ్ లు ఎక్కువగా ఉంటాయి. హెచ్​డీడీ కంటే ఎస్ఎస్​డీని ఎంచుకోవటం ఉత్తమం. ఎస్ఎస్​డీలో సాంకేతికలపరంగా తేడా ఉంది. వీటిని గమనించి ల్యాప్​టాప్​ను ఎంచుకోవాలి.

ర్యామ్

మల్టీ టాస్కింగ్ కోసం ఇది చాలా ముఖ్యమైనది. ర్యామ్ తక్కువగా ఉన్నట్లయితే ఒకే సారి ఎక్కువ అప్లికేషన్లను ఉపయోగించే వీలు ఉండదు. వీడియో ప్రాసెసింగ్ లాంటి వాటి కోసం ల్యాప్​టాప్ వాడుతున్న వారు అయితే తప్పకుండా ఎక్కువ ర్యామ్ తీసుకోవాలి. చిన్న చిన్న అవసరాల కోసం తీసుకునే వారు అయితే తక్కువగా ఉన్నది అయినా సరిపోతుంది. అన్నీ స్థాయిల్లో ల్యాప్​టాప్​లు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువగా 8 జీబీ, 16 జీబీ ర్యామ్ ఉన్నవే విక్రయం అవుతున్నాయి.

బ్యాటరీ

ల్యాప్​టాప్ పోర్టబుల్​గా ఉంటుంది. ఎక్కడైనా దీనిని ఉపయోగించుకోవచ్చు కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ముఖ్యం. కొంతకాలం కిందట ఇవి ఒక్క పూర్తి ఛార్జితో నాలుగు, ఐదు గంటలు పనిచేసేవి. అయితే ఇప్పుడు 9 గంటల వరకు నడిచే ల్యాప్​టాప్​లు మార్కెట్​లో ఉన్నాయి. పర్ ఫార్మెన్స్​తో పాటు బ్యాటరీ లైఫ్​ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఓఎస్

లాప్​టాప్​లు దీని ఆధారంగానే పనిచేస్తాయి. ఇవి ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటాయి. మ్యాక్ ఓఎస్ ధర ఎక్కువగా ఉంటుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న దాని ధర కొంచెం తక్కువగా ఉంటుంది. ఓపెన్ సోర్స్ ద్వారా లభించే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాప్​టాప్​ల ధర తక్కువగా ఉంటుంది. విండోస్ తీసుకుంటే అందులో 10, 8, 7 అనే రకాలు ఉన్నాయి. లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్​ను ఎంచుకోవటం ఉత్తమం.

స్క్రీన్​ సైజు

ల్యాప్​టాప్​ సైజు అనేది సాధారణంగా దాని స్ర్కీన్ సైజు మీద ఆధారపడి ఉంటుంది. ఫుల్ హెచ్​డీ, హెచ్​డీ... ఇలా పలు రకాల రెజల్యూషన్​లతో, స్ర్కీన్లతో ఉన్న ల్యాప్​టాప్​లు మార్కెట్​లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కువగా 14 ఇంచుల్లో ఉండే దానిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వాటి కంటే చిన్న సైజులో కూడా అందుబాటులో ఉన్నాయి. స్ర్కీన్​సైజు తగ్గుతున్న కొద్ది ధర కొంచెం పెరుగుతుంది. వీటింతో పాటే టచ్​ స్ర్కీన్ ల్యాప్​టాప్​లు మార్కెట్​లో హల్​చల్​ చేస్తున్నాయి. వీటినే ట్యాబ్​గా మార్చుకునే వెసులుబాటు ఉంది. వీటినే 2 ఇన్ 1 లు అంటారు.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్ అనేది అన్ని రకాల అవసరాలకు తప్పనిసరి కాకపోవచ్చు. వీడియో ఎడిటింగ్, గేమింగ్ తదితర హైఎండ్ అవసరాల కోసం డెడికేటెడ్ గ్రాఫిక్​కార్డ్ అవసరం. సాధారణ కార్యకలాపాల కోసం గ్రాఫిక్స్ అంతగా అవసరం ఉండకపోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇతర అంశాలు..

యూఎస్​బీ, హెచ్​డీఎంఐ, టైప్​సీ... ఇలా తదితర పోర్ట్​లు ల్యాప్​టాప్​కు ఉంటాయి. వీటి సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే ల్యాప్​టాప్​ను సౌకర్యంగా చేసేందుకు పోర్ట్​ల సంఖ్య గతంతో పోల్చితే కంపెనీలు ఇప్పుడు బాగా తగ్గించాయి.

ఇదీ చూడండి: షియోమీ నుంచి అదిరే ల్యాప్​టాప్​లు, కొత్త ఫోన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.