ETV Bharat / science-and-technology

భూమి మీద జీవం ఎక్కడి నుంచి వచ్చింది..? గుట్టు తేల్చిన జపాన్ శాస్త్రవేత్తలు! - origin of life

జపాన్​ శాస్త్రవేత్తలు విశ్వానికి సంబంధించి కీలక గుట్టు విప్పారు. సమస్త జీవరాశికి పునాదుల్లాంటి మూలకాల మూలలపై స్పష్టత సాధించారు.

The seeds of life are from the universe
జీవానికి బీజాలు విశ్వం నుంచే
author img

By

Published : Apr 30, 2022, 9:30 AM IST

Origin of life: భూమి మీద జీవం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మానవాళికి అంతుచిక్కని ప్రశ్న! సమస్త జీవరాశికి పునాదుల్లాంటి మూలకాల మూలలపై అస్పష్టత ఉంది. జపాన్‌ శాస్త్రవేత్తలు దాని గుట్టు విప్పారు. ఆ ప్రాథమిక పదార్థాలు విశ్వం నుంచే వచ్చాయనడానికి గట్టి ఆధారాలు సేకరించారు. కర్బనం పుష్కలంగా ఉన్న గ్రహశకలాల నుంచి ఉల్కల రూపంలో వచ్చి ఉండొచ్చని సూత్రీకరించారు.

ఏమిటీ డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ?: జీవుల్లో రైబో న్యూక్లిక్‌ ఆమ్లం (ఆర్‌ఎన్‌ఏ), డీఆక్సీరైబో న్యూక్లిక్‌ ఆమ్లం (డీఎన్‌ఏ) ఉంటాయి. వాటిలో అడినిన్‌ (ఎ), గ్వానిన్‌ (జి), సైటోసిన్‌ (సి), థయామిన్‌ (టి), యురాసిల్‌ (యు) న్యూక్లియోబేస్‌లు ఉన్నాయి.

  • డీఎన్‌ఏలో ఎ, జి, సి, టి జతలు, ఆర్‌ఎన్‌ఏలో ఎ, జి, సి, యు జతలు ఉంటాయి. ఇవి షుగర్లు, ఫాస్ఫేట్లతో కలిసి జన్యు సంకేతాన్ని ఏర్పరుస్తాయి.
  • ఈ న్యూక్లియోబేస్‌ల తీరుతెన్నులను బట్టి వాటిని ప్యూరిన్‌ (అడినిన్‌, గ్వానిన్‌), పైరిమైడిన్‌ (సైటోసిన్‌, థయామిన్‌, యురాసిల్‌) అనే రెండు వర్గాలుగా విభజించారు. ఈ న్యూక్లియోబేస్‌లు మూలజతల్లా ఏర్పడుతూ నిచ్చెన ఆకృతిని తలపిస్తాయి.
  • జీవానికి పునాదులైన న్యూక్లియోబేస్‌లు విశ్వం నుంచి వచ్చాయా? తొలినాటి పుడమిపై నెలకొన్న సంక్లిష్ట రసాయన పరిస్థితుల్లో అవి రూపొందాయా అన్నదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అడినిన్‌, గ్వానిన్‌, యురాసిల్‌లు ఇప్పటికే ఉల్కల్లో వెలుగుచూశాయి. సైటోసిన్‌, థయామిన్‌ల ఆచూకీ ఇప్పటివరకూ వెలుగు చూడలేదు. దీంతో ఈ అంశంపై అస్పష్టత నెలకొంది.

గుట్టువిప్పిన ఆధునిక పరిజ్ఞానం: జపాన్‌లోని హక్కాయిడో విశ్వవిద్యాలయానికి చెందిన యాషుహిరో ఒబా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం.. ద్రవీకృత ఉల్క ధూళిలో స్వల్ప పరిమాణంలో ఉండే భిన్న రసాయనాలను జాగ్రత్తగా సేకరించే అధునాతన విధానాన్ని అభివృద్ధి చేసింది.

  • 'మర్చిసన్‌ ఉల్క' అనే అంతరిక్ష శిల నమూనాపై ఈ కొత్త విధానాన్ని ప్రయోగించినప్పుడు.. ఇన్నేళ్లు ఆచూకీ దొరకని సైటోసిన్‌, థయామిన్‌లు కనిపించాయి. దీంతో జీవానికి అవసరమైన ఐదు ప్రాథమిక న్యూక్లియో బేస్‌లు ఉల్కల్లో కనిపించినట్లయింది.
  • టాగిష్‌ లేక్‌, లేక్‌ ముర్రే అనే ఉల్కలపైనా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ప్రతి శిలలోనూ ఈ ఐదు న్యూక్లియోబేస్‌లు ఉన్నాయని తేల్చారు. అవి రూపొందే ప్రక్రియను వేగవంతం చేసే ఇమిడాజోల్‌ అనే మూలకాన్నీ గుర్తించారు.
  • భూమిపై పడిన అంతరిక్ష శిలల నుంచి సేకరించిన నమూనాలు కాకుండా విశ్వంలోని గ్రహశకలాల వద్దకు నేరుగా వ్యోమనౌకలను పంపి, రప్పించిన శాంపిళ్లను విశ్లేషిస్తే దీనిపై స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జపాన్‌కు చెందిన హయబుసా-2 స్పేస్‌క్రాఫ్ట్‌.. రియుగు అనే గ్రహశకలం నుంచి తెచ్చిన శాంపిళ్లలోని న్యూక్లియో బేస్‌లను విశ్లేషించడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

శాస్త్రవేత్తలు పరిశోధించిన ఉల్కలు

1. మర్చిసన్‌ (ఆస్ట్రేలియా)

2. టాగిష్‌ లేక్‌ (కెనడా)

3. లేక్‌ ముర్రే (అమెరికా)

సూర్యుడి పుట్టుక సమయంలోనే: న్యూక్లియోబేస్‌లు సూర్యుడు ఏర్పడే క్రమంలో విశ్వంలో జరిగిన ఫొటోకెమికల్‌ చర్యల వల్ల ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత సౌర కుటుంబం రూపు దిద్దుకునే క్రమంలో అవి గ్రహ శకలాల్లోకి చేరి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. అనంతర కాలంలో ఈ ఖగోళశిలలు ఉల్కల రూపంలో భూమిని ఢీ కొట్టాయని, వాటిద్వారా ఆ మూలకాలు పుడమిని చేరాయని చెబుతున్నారు. వాటి ద్వారా జీవం ఆవిర్భవించి ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: అంతరిక్షంలో అద్భుతం.. 1000 ఏళ్ల తర్వాత ఒకే వరుసలోకి 4 గ్రహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.