ETV Bharat / science-and-technology

Smishing Scams : మెసేజ్​తో బురిడీ కొట్టించే కొత్త​రకం స్కామ్​.. క్లిక్​ చేస్తే మీ డేటా మటాష్​! - స్మిషింగ్​ ఎస్​ఎంఎస్​ తెలుగులో

Smishing Scams : 'మీ బ్యాంకు ఖాతాను మూసేశాం, తిరిగి తెరిచేందుకు మీ వివరాలను తెలియజేయండి'. 'మీ ఐటీఆర్​ ఫైలింగ్​లో లోపాలున్నాయి.. వాటిని సరిచేసేందుకు పర్సనల్​ డీటైల్స్​ ఇవ్వండి'. లేదంటే 'ఆదాయపు పన్ను శాఖ భారీ మొత్తంలో మీకు జరిమానా విధిస్తుంది'.. లాంటి సందేశాలు తరచుగా మీ మొబైల్​కు వస్తున్నాయా? అయితే అవి కచ్చితంగా 'స్మిషింగ్​ స్కామ్' సందేశాలని నిర్ధరణ చేసుకోండి. ఇంతకీ స్మిషింగ్​ స్కామ్ అంటే ఏమిటి? దీంతో సైబరాసురులు ఎలా మోసం చేస్తారు? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు గురించి తెలుసుకుందాం.

What Is Smishing Scams Full Details In Telugu
What Is Smishing Attacks
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 6:22 PM IST

Smishing Scams : సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. రోజూ ఎక్కడో ఒక చోటా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌరులకు మెరుగైన సైబర్ భద్రతను అందించడమే లక్ష్యంగా ఇప్పటికే బాధితుల కోసం వెబ్​సైట్​లు, హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాధారణంగా సైబర్​ మోసాలు.. SMS, ఈ-మెయిల్స్​, కాల్స్​ ద్వారా జరుగుతుంటాయి. అయితే ఈ-మెయిల్స్​ ద్వారా వచ్చే ఫేక్​ సందేశాలను మనం సులువుగా పసిగట్టవచ్చు. ఎందుకంటే వాటిలో అక్షర దోషాలతో పాటు అన్వయ దోషాలను సులువుగా గుర్తుపట్టవచ్చు. అంతేకాకుండా స్పామ్​ మెయిల్స్​లోని సమాచారం అసమగ్రంగా ఉంటుంది.

తెలివి మీరుతున్నారు!
సైబర్​ నేరగాళ్లు ఇప్పుడు మరింత తెలివిమీరుతున్నారు. ఎస్​ఎంఎస్​ల ద్వారా సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. అందుకే సైబర్​ ఫిషింగ్(మోసాలకు) పాల్పడుతున్న కేటుగాళ్లు అనుసరిస్తున్న 'స్మిషింగ్​ స్కామ్​'( Smishing Attacks ) విధానం గురించి కేంద్ర టెలికాం శాఖ ఇటీవలే పలు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇంతకీ స్మిషింగ్​ స్కామ్​ అంటే ఏమిటి? దీని బారి నుంచి బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.

స్మిషింగ్​ అంటే ఇది!
Smishing Meaning In Telugu : స్మిషింగ్​ అనేది ఒక రకమైన ఫిషింగ్​. అంటే ఈ స్కామ్​లో కేవలం మొబైల్​ వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంటారు సైబర్​ కేటుగాళ్లు. వీళ్లు బాధితుల డివైజ్​లకు అనవసరపు లేదా అనుమానస్పద సందేశాలను పంపిస్తారు. పొరపాటున వీటిని క్లిక్​ చేస్తే.. మన పర్సనల్​ డేటా మొత్తం సైబర్​ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ రకమైన చీటింగ్​లో మన వ్యక్తిగత వివరాలైన క్రెడిట్​ కార్డ్​ నంబర్​ సహా బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సైబర్​ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఉంది. ( Smishing Scams )

లింక్స్​పై నో క్లిక్స్​!
సాధారణంగా బ్యాంకులు సహా ఇతర ప్రభుత్వ సంస్థలు ఆర్థిక లావాదేవీలు, ఇతర వెరిఫికేషన్​లకు సంబంధించి మనకు ఎలాంటి లింకులను ఎస్​ఎంఎస్​ రూపంలో పంపించవు. అందుకే అనుమానాస్పద లింకులను క్లిక్​ చేయవద్దంటూ ఈ మధ్య మనకి అలర్ట్​లను కూడా పంపుతున్నారు. అందువల్ల గుర్తుతెలియని నంబర్లు లేదా వెబ్​సైట్​ల నుంచి ఏవైనా అనుమానస్పద ఎస్​ఎంఎస్​లు, లింకుల వస్తే వాటిని క్లిక్​ చేయకుండా ఉండటం మేలు.

వెంటనే స్పందించకండి!
మీకు ఏదైనా నంబర్​ నుంచి 'మీరు వెంటనే స్పందించండి' అంటూ భయాందోళనలకు గురిచేసే సందేశాల వస్తే.. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. అలాంటి వాటిని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ సంస్థలూ పంపవు. అలాగే బ్యాంకులు లేదా ఇతర సంస్థలకు సంబంధించిన సమస్యలను సదరు శాఖ కార్యాలయానికి నేరుగా వెళ్లి పరిష్కరించుకోవాల్సిందిగా తమ కస్టమర్స్​ను కోరుతాయి. 'You Must Act Immediately' లేదా 'React Immediately' అంటూ తరచూ వచ్చే మెసేజెస్​ పట్ల అలర్ట్​గా ఉండండి.

పర్సనల్​ డేటాను షేర్​ చేయొద్దు!
బ్యాంకులు, టెలికాం సంస్థలు, కస్టమర్ సర్వీస్​ సెంటర్లు సహా ఇతర సంస్థలు తమ వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని అడగవు. అంటే మీ క్రెడిట్​ లేదా డెబిట్​ కార్డు వివరాలు, ఓటీపీలు, బ్యాంక్​ అకౌంట్​ నంబర్​, పిన్స్​ తదితర వివరాలను చెప్పమని ఏ బ్యాంకూ అడగదు. అలా అడిగారంటే అది కచ్చితంగా మిమ్మల్ని బురిడీ కొట్టించేదే అని నిర్ధరించుకోండి. అలాంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పర్సనల్​ డేటాను షేర్​ చేయకండి.

డివైజ్​ను రెగ్యులర్​గా అప్డేట్​ చేయండి!
కొంతకాలంగా మార్కెట్​లోకి వస్తున్న అన్ని స్మార్ట్​ఫోన్​లు అనుమానస్పదంగా ఉండే లింకులు, నంబర్లు లేదా వెబ్​సైట్​లను బ్లాక్​ చేసే ఫీచర్స్​ను కలిగి ఉంటున్నాయి. గనుక మీ మొబైల్​ డివైజ్​ను తరచూగా అప్డేట్​ చేస్తూ ఉండండి.

గుర్తుతెలియని మెసేజ్​లకు స్పందించకండి!
ప్రస్తుతం వస్తున్న సందేశాలు, కాల్స్, లింక్స్​​ అన్నీ గుర్తుతెలియని నంబర్లు లేదా వెబ్​సైట్​ల నుంచి వస్తున్నవే. అలా వచ్చే ఫేక్​ సందేశాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా సరే.. వాటికి స్పందించకుండా ఉంటే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.