ETV Bharat / science-and-technology

రెడ్​మీ నుంచి సరికొత్త స్మార్ట్​ ఫోన్లు​.. ఫీచర్లు ఇవే.. - రెడ్​మి నోట్ 11 ప్రో ప్రత్యేకతలు

రెడ్​మీ సిరీస్​లో నోట్-11, నోట్​11 ప్రో, నోట్​ 11 ప్రోమ్యాక్స్​ మోడల్​ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది షియోమీ. ఈ సందర్భంగా కొత్త ఫోన్ల ఫీచర్లు మీ కోసం..

Redmi new phones
రెడ్​మి కొత్త మొబైల్స్
author img

By

Published : Oct 29, 2021, 11:50 AM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ.. రెడ్​మీ సిరీస్​లో మరో మూడు ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్​మీ నోట్​-11, నోట్​-11 ప్రో, నోట్​ 11ప్రోమ్యాక్స్​ ఫోన్లను ఓ ఆన్​లైన్​ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు చైనాలోనే అందుబాటులోకి తెచ్చింది.

రెడ్​మీ నోట్​-11 5జీ ధర

చైనా మార్కెట్లో రెడ్​మీ నోట్​ 11 మోడల్‌ను 4జీబీ ర్యామ్​-128 స్టోరేజ్​, 6జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌- 256 జీబీ స్టోరేజ్‌ ఇలా 4 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు వరుసగా 1,199 యువాన్లు(రూ.14,000), 1,299 యువాన్లు (రూ.16,400), 1,499 యువాన్లు (రూ.18,700), 1,699 యువాన్లుగా (రూ.21,100) నిర్ణయించింది. ఈ మోడల్ ఫోన్లు స్టైలిష్ డిజైన్​లో.. షాలో డ్రీమ్​ గెలాక్సీ, బ్లాక్​ రీల్మ్​, మిడ్​నైట్​ గ్రే వంటి మూడు రంగుల్లో లభించనున్నాయి.

ప్రత్యేకతలు

  • 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌​డీ డిస్​ప్లే
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌
  • వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్​​ సపోర్ట్‌

రెడ్​మీ నోట్​ 11 ప్రో ధర..

ఈ ఫోన్​ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ ర్యామ్​-128 స్టోరేజ్​, 8జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌- 256 జీబీ స్టోరేజ్‌ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది.వీటి ధరలు వరుసగా 1,599 యువాన్లు(రూ.18,700), 1,899 యువాన్లు (రూ.23,300), 2,099 యువాన్లుగా (రూ.24,500) నిర్ణయించింది.

రెడ్​మీ నోట్​ 11 ప్రోమ్యాక్స్​ ధర..

ఈ మోడల్​ కూడా​ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్​-128 స్టోరేజ్​, 8జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌- 256 జీబీ స్టోరేజ్‌ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలను వరుసగా 1,899 యువాన్లు(రూ.22,200), 2,099 యువాన్లు (రూ.24,500), 2,299 యువాన్లుగా (రూ.26,900) నిర్ణయించింది.

రెడ్​మీ నోట్​ 11 ప్రో, నోట్​ 11 ప్రోమ్యాక్స్​ ఫీచర్లు

ఈ రెండు ఫోన్లను బ్యాటరీ, ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ మినహా.. దాదాపు ఒకే విధమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది షియోమీ. రెండు ప్రో మోడల్‌లు మిస్టీ ఫారెస్ట్, మిస్టీరియస్ బ్లాక్, షాలో డ్రీమ్ గెలాక్సీ, టైమ్ క్యూట్ పర్పుల్ రంగుల్లో లభించనున్నాయి.

రెడ్​మీ నోట్​-11 ప్రో ఫీచర్లు

  • 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌​డీ అమోల్డ్​ డిస్​ప్లే​
  • 120 హెర్జ్​ రిఫ్రెష్ రేట్​
  • ఆక్టా-కోర్​ మీడియాటెక్‌ డైమెన్సిటీ 920ఎస్​ఓసీ ప్రాసెసర్‌
  • వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరాతో కలిపి నాలుగు కెమెరాలు
  • 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్‌

రెడ్​మీ నోట్​-11 ప్రో మ్యాక్స్​ ఫీచర్లు

  • 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్‌

ఈ ఫోన్లు​ చైనా మార్కెట్​లో నవంబరు 1 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది స్పష్టత లేదు.

ఇదీ చూడండి: 'మెటావర్స్'... జిందగీ మొత్తం ఇక వర్చువల్ దునియాలోనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.