ETV Bharat / science-and-technology

షావోమి సరికొత్త ఫోన్​.. జియోతో కలిసి 5జీ ట్రయల్స్.. ధర తక్కువే!

Redmi K50i: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి.. మరో కొత్త ఫోన్​ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ను రిలయన్స్ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించింది.

author img

By

Published : Jul 18, 2022, 11:58 AM IST

Redmi K50i
Redmi K50i

Redmi K50i: షావోమి కంపెనీ వచ్చే జులై 20న ఒక కొత్త రెడ్‌మీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ 12 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని బ్యాండ్‌లను రిలయన్స్‌ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించింది. 12 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్‌ కూడా ఇదే. 4కే స్ట్రీమింగ్‌, క్లౌడ్‌ గేమింగ్ వంటి టెస్ట్‌లను ఈ ఫోన్‌ పాసయినట్లు రెడ్‌మీ సంస్థ తెలిపింది. దీంతో యూజర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా గేమ్‌లను ఆడుకోవడంతోపాటు, 8కే క్వాలిటీ వీడియోలను కూడా బఫరింగ్ లేకుండా చూడగలరు.

రెడ్‌మీ కే50ఐ ఫీచర్లు: మిడ్‌ రేంజ్‌ శ్రేణిలో రెడ్‌మీ ఈ ఫోన్‌ను తీసుకొస్తుంది. చాలా కాలంగా రెడ్‌మీ కంపెనీ 'K' సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రెడ్‌మీ కే50ఐ కోసం టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోన్‌లో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ఫుల్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరాలున్నాయి. వీడియో కాలింగ్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/256 జీబీ వేరియంట్లో తీసుకురానుంది. రెడ్‌మీ కే50ఐ ధర రూ. 21 వేల నుంచి రూ. 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇవీ చదవండి: ఫేస్​బుక్​ యూజర్లకు గుడ్​ న్యూస్.. ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్..

ఆ యాప్‌ వాడితే ఇబ్బందులే.. యూజర్లకు వాట్సాప్‌ వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.