ETV Bharat / science-and-technology

సంధికి అమిత్​ షా యత్నం- సరిహద్దు వివాదం ముగిసేనా? - జోరామ్ తంగా

అసోం-మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తకరం వాతావరణం నెలకొన్న వేళ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలకు సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ మేరకు వారితో ఆయన ఫోన్​లో సంభాషించారు. కాగా, అంతకుముందే అసోం సీఎంపై ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకుంటామని మిజోరం తెలిపింది.

Assam-Mizoram Border Clash
అసోం-మిజోరాం సరిహద్దు వివాదం
author img

By

Published : Aug 1, 2021, 2:45 PM IST

Updated : Aug 3, 2021, 10:37 PM IST

అసోం-మిజోరాం సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మిజోరం సీఎం జోరామ్ తంగా, ఆసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఆదివారం ఫోన్​లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా . వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

ఫోన్ సంభాషణ అనంతరమే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు జోరామ్ తంగా. ఈ సమయంలో పరిస్థితులు చేయిదాటకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టొద్దని మిజోరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సీఎంపై ఎఫ్​ఐఆర్​ ఉపసంహరణ..

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై దాఖలు చేసిన ఎఫ్​ఐఆర్​ను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మిజోరం ప్రభుత్వం అదివారం తెలిపింది. నిజానికి ఎఫ్​ఐఆర్​లో హిమంత పేరును ప్రస్తావించేందుకు మిజోరం ముఖ్యమంత్రి జోరామ్​ తంగా ఆమోదించలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్​మావియా చువాంగో వెల్లడించారు. దానిపై పరిశీలించాలని సీఎం సూచించినట్లు చెప్పారు. హిమంతకు వ్యతిరేతికంగా తగిన ఆధారాలు లేకపోతే పోలీసులతో చర్చించి, ఆయన పేరును ఎఫ్​ఐఆర్​ నుంచి తొలగిస్తామని సీఎస్ తెలిపారు.

ఎందుకు ఎఫ్​ఐఆర్​?

అసోం-మిజోరం సరిహద్దుల్లో జులై 26న జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అసోం పోలీసులు మరణించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత, ఆరుగురు అధికారులు సహా మరో 200 మంది వ్యక్తులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

అయితే సీఎంతో పాటు ఎఫ్​ఐఆర్​లో ప్రస్తావించిన వారి పేర్ల తొలగింపుపై మిజోరం సీఎస్ చువాంగో స్పష్టతనివ్వలేదు.

తటస్థ సంస్థకు అప్పగించాలి..

మిజోరంలో తనపై కేసు నమోదైనట్లు వచ్చిన వార్తలపై బిశ్వ శర్మ స్పందించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని శనివారం ప్రకటించారు.

"నాపై ఎఫ్​ఐర్​ఆర్​ నమోదు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందంటే సంతోషమే. ఏ పోలీసు స్టేషన్​లో అయినా విచారణకు నేను సిద్ధమే. కానీ మా అధికారులను దర్యాప్తు చేయడానికి అంగీకరించను. సరిహద్దు వివాద పరిష్కారానికి మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం."

-హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

అదే సమయంలో రాజ్యాంగపరంగా అసోం భూభాగంలో జరిగిన ఘర్షణపై విచారణను తటస్థ సంస్థకు ఎందుకు అప్పజెప్పడం లేదని ట్విట్టర్‌ వేదికగా హిమంత ప్రశ్నించారు.

ఉద్రిక్తంగానే సరిహద్దులు..

అస్సాం-మిజోరం సరిహద్దులో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతం శనివారం నివురుగప్పిన నిప్పులా కనిపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రంలోకి వాహనాలు రావడం లేదు: మిజోరం

జులై 26 నుంచి అసోం నుంచి ఒక్క ట్రక్కు కూడా రాష్ట్రంలోకి రాలేదని మిజోరం అధికారులు పునరుద్ఘాటించారు. మిజోరం జీవనాడి అయిన 306వ నంబరు జాతీయ రహదారిపై అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో దిగ్బంధాలు కొనసాగుతున్నాయని పునరుద్ఘాటించారు. అసోం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది.

ఇదీ చూడండి: అసోం-నాగాలాండ్​ మధ్య ఫలించిన శాంతి చర్చలు

Last Updated : Aug 3, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.