ETV Bharat / science-and-technology

Laptop Buying Mistakes : కొత్త ల్యాప్​టాప్​ కొనాలా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి! - general mistakes laptop buying

Laptop Buying Mistakes in Telugu : మీరు కొత్త ల్యాప్​టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ల్యాప్‎టాప్ కొనే ముందు కొన్ని కీలకమైన అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. లేదంటే తరువాత చాలా బాధపడాల్సి ఉంటుంది. అందుకే కొత్త ల్యాప్​టాప్​ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు, చేయకూడని తప్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Laptop Buying tips
Laptop Buying Mistakes
author img

By

Published : Aug 22, 2023, 12:11 PM IST

Laptop Buying Mistakes : ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ ల్యాప్‎టాప్, పర్సనల్ కంప్యూటర్ తప్పనిసరి అవసరంగా మారాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ల్యాప్​టాప్​లు చాలా బాగుంటాయి. అందుకే ఎక్కువమంది లాప్​టాప్ కొనేందుకే మొగ్గు చూపుతూ ఉంటారు. మీరు కూడా ల్యాప్​టాప్​ కొందామని అనుకుంటున్నారా? అయితే ల్యాప్‎టాప్ కొనేటప్పుడు ఎక్కువ మంది తరచుగా చేసే తప్పులు ఏమిటో ముందుగా తెలుసుకోండి.

ల్యాప్‎టాప్ కొనాలని అనుకునేవారు కొన్ని కీలకమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వెచ్చించే ధరకు తగిన, మనం కోరుకున్న ఫీచర్స్ కలిగిన ల్యాప్‎టాప్ సొంతం చేసుకోవచ్చు. లేదంటే, కొన్న తర్వాత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు.. ఎవరికైనా సరే చాలా ఆతృతగా ఉంటుంది. దానికి తోడు మార్కెట్లో ఉన్న రకరకాల లాప్​టాప్​లు వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సమయంలో ఎలాంటి గాబరా పడకూడదు. అందుబాటులో ఉన్న వాటిలో.. మనకు అవసరమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్​ ఉన్న ల్యాప్​టాప్​ను ఎంచుకోవాలి. ఇందు కోసం 8 కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేెంటో ఇప్పుడు చూద్దాం

1. చాలా చిన్నది... చాలా పెద్దది
Laptop Screen Size Importance : ల్యాప్‎టాప్ అనేది మనం సులువుగా క్యారీ చేసేందుకు అనువుగా ఉండాలి. పెద్ద స్క్రీన్ కలిగిన ల్యాప్‎టాప్ తీసుకుంటే, మన కంటికి మంచి ఎక్స్​పీరియన్స్ కలుగుతుంది. కానీ మనతో పాటు తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరీ చిన్న ల్యాప్‎టాప్ తీసుకుంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది. అలాగే టైపింగ్ చేసేందుకు కీబోర్డ్ అనువుగా అనిపించదు. అందుకే పోర్టబుల్​ ల్యాప్‎టాప్ తీసుకుంటే బెటర్.

2. ప్రింటర్స్, మైక్స్
ల్యాప్‎టాప్ తీసుకునేటప్పుడు ఎక్స్​టర్నల్​ డివైజెస్​ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరు కొనుక్కునే ల్యాప్‎టాప్‎కు సూట్ అయ్యే.. ప్రింటర్స్, మైక్స్, ఛార్జర్స్, యూఎస్​బీ కేబుల్స్​ను ఎంచుకోవాలి. ల్యాప్‎టాప్​లో ఉన్న కంటెంట్​ను ప్రజెంటేషన్ రూపంలో చూపించాల్సి వచ్చినప్పుడు.. ఏయే డివైజెస్​ అవసరమో ముందే గుర్తించాలి. వీటన్నింటిని కూడా అందుబాటులో పెట్టుకోవాలి. మంచి స్పీకర్స్, మైక్రోఫోన్స్ సెట్ చేసుకోవాలి. అప్పుడే ప్రజెంటేషన్​ ఇచ్చేటప్పుడు ఎలాంటి అంతరాయాలు ఏర్పడవు.

3. క్వాలిటీ చెకింగ్
Laptop Quality Check : ల్యాప్‎టాప్​లో హై క్వాలిటీ డిస్‎ప్లే చాలా ముఖ్యమైంది. ఇది ఓవరాల్ యూజర్ ఎక్స్‎పీరియన్స్​ను ప్రభావితం చేస్తుంది. అందుకోసం స్క్రీన్ రిజల్యూషన్, సైజ్, ప్యానల్ టైప్, రిఫ్రెష్ రేట్, కలర్ అక్యురసీ, గ్రాఫిక్స్ కార్డ్​, ప్రాసెసర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

4. ముందే టెస్ట్ చేసుకోవాలి
Laptop Configuration Check : మీరు కొనాలనుకునే ల్యాప్‎టాప్ మోడల్ గురించి ముందే తెలుసుకోవాలి. ఇందుకోసం ఆన్​లైన్​లో రివ్యూస్ చదవాలి. స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలి. కొనేముందు ల్యాప్‎టాప్ ఫంక్షన్ ఎలా ఉందో కూడా టెస్ట్ చేయాలి. టైపింగ్, క్యారీయింగ్​తో పాటు, కీబోర్డ్ కంఫర్ట్, టచ్ ప్యాడ్ ఎక్స్‎పీరియన్స్, బ్యాటరీ లైఫ్ అవసరాలకు తగిన విధంగా ఉన్నాయా? లేదా? చూసుకోవాలి.

5. బ్యాటరీ సైజును ఇగ్నోర్ చేయవద్దు!
Laptop Battery Health Check : ల్యాప్‎టాప్ బ్యాటరీ సైజ్ చాలా ముఖ్యం. ఒక్కోసారి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేని సందర్భం రావచ్చు. అలాంటప్పుడు బ్యాటరీ పైనే ఆధారపడాల్సి వస్తుంది. కనుక బ్యాటరీ సైజ్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. బ్యాటరీని ఒకసారి ఫుల్​ఛార్జ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి. ఇందుకోసం ల్యాప్​టాప్ కొనే ముందు కచ్చితంగా యూజర్ల రివ్యూస్​ చదవాలి.

6. కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలి
Laptop Latest Generation : ల్యాప్‎టాప్​లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్​తో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. మనం వెచ్చించే డబ్బుతో పాత ఫీచర్స్ కలిగిన ల్యాప్‎టాప్ కొనుగోలు చేయడానికి బదులు.. అదే రేటుకు సరికొత్త ఫీచర్స్ కలిగిన ల్యాప్‎టాప్ ఏదైనా అందుబాటులో ఉందో చూసుకోవాలి. ఆ రోజుకు ఉన్న కొత్త టెక్నాలజీ ల్యాప్‎టాప్ కొనుక్కుంటే కొంతకాలం పాటు వాడుకోవచ్చు. లేదంటే కొత్త స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కోసం త్వరగానే మరొకటి కొనుక్కోవాల్సి వస్తుంది.

7. జిమ్మిక్కులతో మోసపోవద్దు!
Laptop Advertising : చాలా మంది మార్కెటింగ్ జిమ్మిక్కులతో, అనవసర ఫీచర్స్​కు ఆకర్షితులై మోసపోతుంటారు. కంపెనీలు తమ ప్రకటనల్లో చాలా ఫీచర్స్ గురించి చెబుతుంటాయి. కానీ అవన్నీ వాస్తవంలో ఉండకపోవచ్చు లేదా పనిచేయకపోవచ్చు. మార్కెట్​లోని ల్యాప్​టాప్స్​ చూడగానే నచ్చుతాయి. కానీ నిజంగా అందులో ఏవి మనకు అవసరమో, ఏవి అవసరం లేదో ఆలోచించాలి. మనం వాడని ఫీచర్స్ కోసం ఎక్కువ రేట్ కలిగిన ల్యాప్‎టాప్ కొనాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ స్పీడ్, ర్యామ్, స్టోరేజ్ స్పేస్, గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ లాంటి కీలక అంశాలను మాత్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

8. రివ్యూస్ చదవడంలో జాగ్రత్తలు
Laptop Reviews : ఎవరైనా తాము కొనాలనుకున్న ల్యాప్‎టాప్ గురించి రివ్యూస్ చదివే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీకి సంబంధించి నమ్మకమైన యూట్యూబ్ ఛానల్స్​లో రివ్యూ చూడడం బెటర్. అంతేకాకుండా, సేమ్ మోడల్ ల్యాప్‎టాప్ వాడుతున్న స్నేహితులను అడిగి తెలుసుకోవడం కూడా చాలా ఉత్తమం. నచ్చిన, మెచ్చిన ల్యాప్‎టాప్ కొనేముందు పైన పేర్కొన్న 8 జాగ్రత్తలు తీసుకుంటే.. కొన్న తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆన్​లైన్​లో, అలాగే ప్రత్యక్షంగా ఫ్రెండ్స్ ద్వారా రీసెర్చ్ చేసి, చాలా ఆలోచించి ల్యాప్‎టాప్ కొనుక్కుంటే బెటర్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.