ETV Bharat / science-and-technology

రూ.15వేలకే ల్యాప్​టాప్​ - 'క్లౌడ్'​తో రిలయన్స్ జియో మేజిక్ - మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే? - రిలయన్స్ జియో క్లౌడ్ ల్యాప్​టాప్​

Jio Cloud Laptop In Telugu : దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. అతి తక్కువ బడ్జెట్లో క్లౌడ్​ ల్యాప్​టాప్​ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఒకే ల్యాప్​టాప్​ను చాలా మంది యూజర్లు వాడుకోవడానికి వీలవుతుంది. అయితే ఇందుకోసం యూజర్లు ప్రత్యేకంగా సబ్​స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీని పూర్తి వివరాలు మనమూ తెలుసుకుందామా?

Jio Working on a Rs 15000 Cloud Laptop
jio cloud laptop
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 5:00 PM IST

Jio Cloud Laptop : నేటి టెక్ యుగంలో పర్సనల్ కంప్యూటర్​ (PC) అనేది నిత్యావసరంగా మారిపోయింది. అందుకే పీసీలకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉంటోంది. అయితే ఈ పీసీ మార్కెట్​కు సవాల్ విసురుతూ.. దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 'క్లౌడ్​ ల్యాప్​టాప్​'ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

డమ్మీ మాత్రమే!
రిలయన్స్ జియో ఇటీవలే జియోబుక్ పేరుతో ఒక లో-కాస్ట్​ ల్యాప్​టాప్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ధర కేవలం రూ.14,499. వాస్తవానికి ఇది కేవలం బేసిక్ కంప్యూటింగ్​కు మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ వర్క్​కు ఇది ఏ మాత్రం ఉపయోగపడదు. అందుకే రిలయన్స్ జియో దీనికి 'క్లౌడ్' సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.

అంతా 'క్లౌడ్' లోనే..
జియో తీసుకురానున్న ఈ క్లౌడ్​ ల్యాప్​టాప్ అనేది ఒక డంబ్​ టెర్నినల్ మాత్రమే అని గుర్తించుకోవాలి. అయితే దీని ప్రాసెసింగ్, స్టోరేజ్ అంతా జియో క్లౌడ్​లోనే జరుగుతుంది. అందువల్ల కంప్యూటర్​లో చాలా ఖరీదైన సూపర్​ ప్రాసెసర్​, స్టోరేజ్ డివైజ్​లు ఉండాల్సిన అవసరం ఉండదు. కనుక ల్యాప్​టాప్​ ధర చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం జియో కంపెనీ హెచ్​పీ క్రోమ్​బుక్​లో క్లౌడ్​ కంప్యూటింగ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

తక్కువ ధరకే ల్యాప్​టాప్​!
రిలయన్స్ జియో అతి తక్కువ ధరకే ల్యాప్​టాప్​ అందించాలనే లక్ష్యంతో ఈ క్లౌడ్ ల్యాప్​టాప్​ కాన్సెప్ట్​ను తీసుకువస్తోంది. అయితే ఈ సర్వీస్ వాడుకోవాలంటే.. యూజర్లు కచ్చితంగా జియో క్లౌడ్​ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ జియో క్లౌడ్ ల్యాప్​టాప్​ వల్ల విద్యాసంస్థలకు ఆర్థికంగా బాగా కలిసిరానుంది. ఎలా అంటే.. విద్యా సంస్థలు తమ విద్యార్థుల కోసం భారీ స్థాయిలో హార్డ్​వేర్స్​ను కొనుగోలు చేస్తూ ఉంటాయి. దీని వల్ల వాటిపై చాలా ఆర్థిక భారం పడుతుంది. ఒకసారి జియో క్లౌడ్​ ల్యాప్​టాప్ అందుబాటులోకి వస్తే.. ఈ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఎంటర్​ప్రైజెస్​కు కూడా జియో క్లౌడ్ ల్యాప్​టాప్స్ బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.

భారీ నెట్​వర్క్​
రిలయన్స్ జియో దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా మొబైల్​ నెట్​వర్క్ ఉంది. అందువల్ల ఫైబర్​ ద్వారా చాలా మంచి ఇంటర్నెట్​ కనెక్టివిటీ అందించగలిగే సామర్థ్యం జియోకు ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. అయితే జియో కంపెనీ ఈ క్లౌడ్ ల్యాప్​టాప్​ను ఎప్పుడు మార్కెట్​లోకి తెస్తుందో ఇంకా వెల్లడించలేదు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ తన 45వ ఏజీఎంలోనే క్లౌడ్ పీసీ గురించి ప్రకటించింది. పైగా టెల్కో సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందించిన అనుభవం కూడా రిలయన్స్​కు ఉంది.

జియో వెబ్​క్యామ్​తో ఇకపై నేరుగా టీవీ నుంచే వీడియో కాల్స్​!

ఓవర్ స్పీడింగ్ చలాన్ నుంచి తప్పించుకోవాలా? గూగుల్ మ్యాప్స్​లోని ఈ ఫీచర్ వాడండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.