ETV Bharat / science-and-technology

విశ్వరూపం.. మహాద్భుతం.. ఆకట్టుకుంటున్న వెబ్​ టెలిస్కోప్​ చిత్రాలు - జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్

విశ్వం గుట్టుమట్లను విప్పడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ప్రయోగించిన జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) తొలిసారి తన 'నేత్రాల'ను తెరిచింది. విశ్వానికి అద్భుత చిత్రాలను అందించింది. కనీవినీ ఎరుగని సుదూర ప్రాంతాల్లోని నక్షత్ర మండలాల (గెలాక్సీ)ను అత్యంత స్పష్టంగా ఆవిష్కరించింది. దీంతో.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ టెలిస్కోపు అనేక కీలక విషయాలను వెలుగులోకి తీసుకురానుందన్న భరోసా ఏర్పడింది.

జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్
జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్
author img

By

Published : Jul 13, 2022, 7:34 AM IST

1380 కోట్ల సంవత్సరాల కిందట ఒక మహా విస్ఫోటం (బిగ్‌ బ్యాంగ్‌) ద్వారా విశ్వం ఏర్పడింది. ఆ వెంటనే జరిగిన పరిణామాలపై ఖగోళ శాస్త్రవేత్తల్లో అమితాసక్తి నెలకొంది. సరిగ్గా ఈ అవసరం కోసం జేడబ్ల్యూఎస్‌టీని నాసా రూపొందించింది. ఇది క్లిక్‌మనిపించిన తొలి చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "విశ్వంలో కెమెరా కళ్లకు చిక్కిన అత్యంత పురాతన కాంతి ఇదే. ఆ వెలుగు రేఖల వయసు 1300 కోట్ల ఏళ్లు" అని పేర్కొన్నారు.

ఆ గెలాక్సీల నుంచి కాంతి మనల్ని చేరడానికి వందల కోట్ల ఏళ్లు పట్టింది. దీన్నిబట్టి మనం కాలంలో వెనక్కి వెళ్లి చూస్తున్నట్లే. ఆ సమయంలో విశ్వం వయసు 100 కోట్ల ఏళ్ల కన్నా తక్కువే. విశ్వం విస్తరిస్తున్నందువల్ల అక్కడి నుంచి వస్తున్న కాంతి.. మనల్ని చేరే సరికి సాగిపోతుంది. తద్వారా అది పరారుణ తరంగ దైర్ఘ్యంలోకి మారిపోయింది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపును ఈ కాంతిని పసిగట్టేలా తీర్చిదిద్దారు. విశ్వంలోని ధూళిని కూడా చీల్చుకుంటూ విశ్వాన్ని పరిశీలించడానికి ఇది వీలు కల్పిస్తుంది. జేడబ్ల్యూఎస్‌టీ తీసిన తొలి చిత్రంలో తెలుపు, పసుపు, నారింజ వర్ణాల్లో వందలాది గెలాక్సీలు కనిపించాయి. ఎస్‌ఎంఏసీఎస్‌ 0723 అనే గెలాక్సీ క్లస్టర్‌లో ఈ భాగం ఉంది. జేడబ్ల్యూఎస్‌టీలోని ‘నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా’ దీన్ని క్లిక్‌మనిపించింది.

JAMES WEBB TELESCOPE
జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ చిత్రం
JAMES WEBB TELESCOPE
జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ చిత్రం
JAMES WEBB TELESCOPE
జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ చిత్రం
james webb telescope
జేమ్స్​ వెబ్​ టెలిస్కోప్​ చిత్రం

మరో నాలుగు: అనంతరం నాసా జేడబ్ల్యూఎస్‌టీ తీసిన మరో నాలుగు చిత్రాలను విడుదల చేసింది. వాటి వివరాలివీ..

  • భూమికి 2,500 కాంతి సంవత్సరాల దూరంలోని 'సదరన్‌ రింగ్‌ నెబ్యులా' చిత్రాన్ని అందించింది. ఇందులో.. అంతమవుతున్న ఒక నక్షత్రం చుట్టూ మేఘంలా విస్తరిస్తున్న వాయువులను చూడొచ్చు.
  • 2.9 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఐదు గెలాక్సీల ఫొటో కనువిందు చేస్తోంది. ఈ నక్షత్ర మండలాలు పరస్పరం చాలా దగ్గరగా ఉన్నాయి. అల్లిబిల్లిలా సాగే వీటి కదలికలు.. నృత్యప్రదర్శనను తలపిస్తున్నాయి. వీటిని ‘స్టీఫెన్స్‌ క్వింటెట్‌’గా పేర్కొంటున్నారు. 225 ఏళ్ల కిందట మానవులకు ఇవి తొలిసారి కనిపించాయి.
  • మనకు 7,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న కారినా నెబ్యులా ఫొటోనూ పంపింది. ఇది విశ్వంలో అత్యంత దేదీప్యమానంగా ఉన్న తారా జనన ప్రదేశం.
  • నీలం రంగులో ఉన్న వాస్ప్‌-96బి అనే ఒక భారీ గ్రహాన్ని జేడబ్ల్యూఎస్‌టీ క్లిక్‌మనిపించింది. ఇది శనిగ్రహం పరిమాణంలో ఉంటుంది. భూమికి 1,150 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని వాతావరణాన్ని కూడా జేడబ్ల్యూఎస్‌టీ క్షుణ్నంగా విశ్లేషించింది. ఇందులో నీటి జాడ ఉన్నట్లు వెల్లడైంది. అయితే అక్కడ జీవం మనుగడకు ఆస్కారం లేదు. అలాంటి పరిస్థితులు కలిగిన మరిన్ని గ్రహాలను ఈ టెలిస్కోపు పసిగడుతుందన్న భరోసా తాజా చిత్రంతో ఏర్పడింది.

16 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి..
వెయ్యి కోట్ల డాలర్ల వ్యయంతో జేడబ్ల్యూఎస్‌టీ ప్రాజెక్టును చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో ఈ టెలిస్కోపును ప్రయోగించారు. భూమికి 16 లక్షల కిలోమీటర్ల దూరంలోని ప్రదేశానికి ఇది చేరుకుంది. సూర్యకాంతి నుంచి రక్షణకు ఈ టెలిస్కోపులో టెన్నిస్‌ కోర్టు పరిమాణంలో ఒక తెరను ఏర్పాటు చేశారు. పాతబడిపోతున్న హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపునకు ప్రత్యామ్నాయంగా జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఈ ప్రాజెక్టులో ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలకూ భాగస్వామ్యం ఉంది.

ఇదీ చూడండి : ట్విస్ట్ ఇచ్చిన ఉద్ధవ్.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదికే జై.. ఇదీ అసలు కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.