ETV Bharat / science-and-technology

ల్యాండ్​లైన్ నంబర్​తో 'వాట్సాప్​' అకౌంట్.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా?

మొబైల్ నంబర్​తో వాట్సాప్ అకౌంట్​​ క్రియేట్ చేసుకోవడం మనందరికీ తెలుసు. అయితే ల్యాండ్​లైన్​ ఫోన్ నంబర్​తో కూడా వాట్సాప్ అకౌంట్​ను క్రియేట్ చేసుకోవచ్చు. అదెలా చేయాలో చాలా మందికి తెలియదు. కాబట్టి ల్యాండ్​లైన్​ నంబర్​తో వాట్సాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

WhatsApp account with landline number
ల్యాండ్​లైన్ నంబర్​తో వాట్సాప్​ అకౌంట్
author img

By

Published : Feb 19, 2023, 11:58 AM IST

Updated : Feb 19, 2023, 12:16 PM IST

​ప్రపంచంలో ఏ చోట ఉన్నవారితోనైనా వాట్సాప్​ ద్వారా వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే మెసేజెస్​ను పంపించుకోవచ్చు. అయితే వాట్సాప్​ను ఉపయోగించుకునేందుకు ఫోన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అయతే మొబైల్​ నంబర్​తో పాటు.. ల్యాండ్​లైన్​ నంబర్​తో కూడా వాట్సాప్ అకౌంట్​ను​ కూడా క్రియేట్​ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఉన్నా.. చాలా మందికి తెలియదు. అందుకే ల్యాండ్​లైన్ నంబర్​తో వాట్సాప్ అకౌంట్​ను ఎలా క్రియేట్ చేసుకోవాలో ఓ సారి తెలుసుకుందాం.

ల్యాండ్​లైన్ నంబర్​తో వాట్సాప్​ అకౌంట్ క్రియేట్ చేసుకునే విధానం:

  • ముందుగా పనిచేసే ల్యాండ్​లైన్ నంబర్ అవసరం.
  • తర్వాత వాట్సాప్ బిజినెస్​ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • వాట్సాప్​ను ఓపెన్​ చేసి మీ భాషను ఎంచుకుని ఎగ్రీ అండ్ కంటిన్యూపై క్లిక్​ చేయాలి.
  • మీ ల్యాండ్​ లైన్​ నంబర్​కు ముందు కంట్రీ కోడ్(+91)​ను యాడ్​చేసి నమోదు చేయాలి. అంటే మీ ల్యాండ్​లైన్ నంబర్ 040XXXXXXXX అయితే దానిని +9140XXXXXXXXగా టైప్ చేయాలి.
  • నంబర్ సరైనదో కాదో మరోసారి చూసి ఓకే బటన్​పై క్లిక్​ చేయాలి.
  • దీని తర్వాత వాట్సాప్ బిజినెస్ యాప్ మీ నంబర్​కు ఓటీపీని పంపిస్తుంది. ఒకవేళ మీ ల్యాండ్​లైన్ ఫోన్​ టెక్ట్స్​ మెసేజెస్​ను రిసీవ్ చేసుకోలేకపోతే.. డిడ్ నాట్ రిసీవ్​ కోడ్​పై క్లిక్​ చేయండి.
  • అప్పుడు రీసెండ్ మెసేజ్ లేదా రిసీవ్​ ఏ కాల్ అని రెండు ఆప్షన్స్ కన్పిస్తాయి. వాటిలో రెండో ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోండి.
  • ఆ తర్వాత ఓటీపీ గడువు సమయం ముగిసే వరకు 90 సెకన్లపాటు వెయిట్ చెయ్యండి.
  • సమయం ముగిసిన తర్వాత 'కాల్​ మీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేసి.. మీ ల్యాండ్​లైన్​ దగ్గరే ఉండండి.
  • మీకు ఫోన్​ వచ్చిన తర్వాత అందులో మీకు ఓటీపీను చెప్తారు. దానిని నమోదు చేసుకోండి.
  • ఆ ఓటీపీను వాట్సాప్​లో ఎంటర్​చేస్తే అది మీ కోడ్​ను ధ్రువీకరించి.. కొత్త బిజినెస్ వాట్సాప్​ అకౌంట్​ను సెట్​అప్​ చేసుకుని కొనసాగించుకునేందుకు మీకు అనుమతినిస్తుంది.
  • ఇలా ల్యాండ్​లైన్ నంబర్​తో క్రియేట్ చేసిన వాట్సాప్ అకౌంట్​​ను ఉపయోగించడం మేలు.
  • దీనిలో మనం కాంటాక్ట్ జాబితాను మాన్యువల్​గా యాడ్​ చేయాల్సి ఉంటుంది. ఇది ఉపయోగించటం కొంచెం కష్టంగా ఉన్నా సరే.. ఇది మనకు వ్యక్తిగత గోప్యతను కాపాడుతుంది.

Last Updated : Feb 19, 2023, 12:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.