ETV Bharat / science-and-technology

మరో అదిరిపోయే ఫీచర్​- ఇక మరింత ఈజీగా గూగుల్​పేలో చెల్లింపులు!

GPay QR code shortcut : డిజిటల్‌ పేమెంట్లను మరింత సులభతరం చేసేలా గూగుల్‌ పే కొత్త అప్టేడ్‌ తీసుకువచ్చింది. గూగుల్‌ పే యాప్‌లో ఉండే క్యూఆర్‌ కోడ్‌ను ఇప్పుడు ఫోన్‌ స్క్రీన్‌పై కనిపించేలా షార్ట్‌ కట్‌ అభివృద్ధి చేసింది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

GPay QR code shortcut
GPay QR code shortcut
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 11:20 AM IST

GPay QR code shortcut : సాంకేతిక విప్లవంలో భాగంగా మనం ఇప్పుడు నగదును కాకుండా డిజిటల్ విధానంలో ఎలాంటి చెల్లింపులైనా చేసేస్తున్నాము. డిజిటల్ పేమెంట్ల కోసం మనకు అనేక యాప్​లు అందుబాటులో ఉన్నా చాలా మంది గూగుల్​పేని విశ్వసిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లలో సరికొత్త అనుభవాన్ని అందించడానికి తాజాగా గూగుల్​పే సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో పేమెంట్‌ విధానం మరింత సులభతరం కానుంది. తద్వారా చెల్లింపుల సమయంలో విలువైన సమయం ఆదా కావడం సహా చాలా అసౌకర్యాలను అధిగమించేలా ఆప్డేట్‌ చేసింది.

పేమెంట్​ చేసేటప్పుడు యాప్‌ను ఓపెన్ చేయడం, స్కానర్‌ ఆన్‌ చేయడం, పేమెంట్‌ చేయడం వంటి పనులను ఒక్క క్లిక్‌తో పూర్తి చేసేలా ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. మొబైల్​ హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్‌గా క్యూఆర్‌ కోడ్‌ ఉండేలా ఫీచర్‌ను తీర్చిదిద్దింది. దీనివల్ల ఒకే క్లిక్‌తో యూపీఐ చెల్లింపులు ఈజీగా చేసుకోవచ్చు. అన్ని స్మార్ట్‌ ఫోన్లలో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ను జోడించడం చాలా సరళమైన ప్రక్రియగా మార్చింది గూగుల్ పే.

ఇలా హోం స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌!

  • గూగుల్​పే షార్ట్‌కట్‌ను మీ ఫోన్‌లో ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్​స్టాల్​ చేసి ఉంటే అప్డేట్‌ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌ హోం హోమ్ స్క్రీన్​పై ఉన్న గూగుల్​పే లోగోను లాంగ్ ప్రెస్‌ చేయాలి. ఆ తర్వాత ఓ షార్ట్​కట్​ మెనూ ఓపెన్ అవుతుంది.
  • అందులో 'Scan Any QR' అనే ఆప్షన్​ ఉంటుంది. దాన్ని కూడా లాంగ్​ ప్రెస్​ చేయాలి. వెంటనే స్కానర్ మీ హోం స్క్రీన్​పై ప్రత్యక్షమవుతుంది.
  • ఈ షార్ట్‌కట్, కెమెరా పర్మిషన్‌ అడుగుతుంది. అది ఓకే చేశాక మీరు పేమెంట్​​ చేయాలనుకున్నప్పుడు క్యూఆర్​ కోడ్‌లను స్కాన్‌ చేస్తుంది. థర్డ్‌ పార్టీ చెల్లింపుల కోసం యూపీఐ క్యూఆర్‌ కోడ్‌లను ఈ షార్ట్ కట్ అనుమతిస్తుంది.

మీకు రావాల్సిన డబ్బు కోసం కూడా హోం స్క్రీన్​పై ఉన్న QR కోడ్ లోగోపై క్లిక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ G-PAY ఖాతాకు లింక్ చేసిన మీ వ్యక్తిగత క్యూఆర్‌ కోడ్‌ను వేగంగా తెరవచ్చు. అదేవిధంగా రూపే కార్డులు ఉన్న వినియోగదారులు కూడా ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చు. డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా చేసేవారు, రోజుకు కనీసం ఐదుకన్నా ఎక్కువ చెల్లింపులు చేసేవారికి గూగుల్​పే షార్ట్‌ కట్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

అదనంగా ప్రతి చెల్లింపునకు పిన్‌ అడగడం ద్వారా ఈ ఫీచర్ దుర్వినియోగం కాకుండా గూగుల్​పే చర్యలు చేపట్టింది. దీని ద్వారా యూపీఐ చెల్లింపులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డు లావాదేవీలు చేసుకోవచ్చు. గూగుల్​పే డిజిటల్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు జోడించడం వల్ల యూపీఐ చెల్లింపులను అంగీకరించని చోట ఎన్‌ఎఫ్‌సీ (Near Field Communication) చెల్లింపులను సులభతరం చేస్తుంది.

గూగుల్ పే యూజర్లకు ఫ్రీగా రూ.88వేలు.. వెంటనే వాడుకుంటే ఓకే.. లేదంటే..!

గూగుల్​ పే షాక్​! మొబైల్​ రీచార్జ్​ చేస్తే ఎక్స్​ట్రా కట్టాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.