Google Search Grammar Check Feature : గూగుల్ తన యూజర్ల కోసం సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఇకపై గూగుల్ సెర్చ్బార్లోనే నేరుగా గ్రామర్ చెక్ చేసుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఏఐ టెక్నాలజీతో తీసుకువచ్చిన ఈ నయా ఫీచర్ ద్వారా.. ఒక పదం లేదా పదబంధం లేదా వాక్యం.. వ్యాకరణ రీత్యా సరిగ్గా ఉందా? లేదా? అనేది సరిచూసుకోవచ్చు. అందువల్ల గ్రామర్ చెకింగ్ కోసం థర్డ్ పార్టీ యాప్‌లు వాడాల్సిన అవసరం ఏర్పడదు. ప్రస్తుతం ఈ ఫీచర్.. ఇంగ్లిష్ భాషకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మిగతా భాషలకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది.
గ్రామర్ ఇలా చెక్ చేయండి!
Google Search as a Grammar Checker : ఈ గ్రామర్ చెక్ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా గూగుల్ సెర్చ్ బాక్స్‌లో.. పదం లేదా పదబంధం లేదా వాక్యాన్ని టైప్ చేయాలి. తరువాత గ్రామర్ చెక్ లేదా చెక్ గ్రామర్ లేదా గ్రామర్ చెక్కర్ అని టైప్ చేయాలి. అంతే.. మీరు టైప్ చేసిన పదం వ్యాకరణం రీత్యా సరిగ్గా ఉందో? లేదో? తెలియజేస్తుంది.
వాస్తవానికి కొన్ని సార్లు గ్రామర్ చెక్ అనే ఫ్రేజ్‌ను కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. కానీ దీనిని ఉపయోగిస్తే.. గ్రామర్ చెక్ అనే టూల్ కచ్చితంగా పాప్-అప్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన పదం లేదా వాక్యం సరిగ్గా ఉంటే.. గూగుల్ గ్రీన్ చెక్ మార్క్‌ను చూపిస్తుంది. ఒక వేళ తప్పుగా ఉంటే రెడ్ చెక్ మార్క్‌ను చూపిస్తుంది.
కరెక్ట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది!
Google grammar checker : ఒక వేళ మీరు ఎంటర్ చేసిన పదం లేదా వాక్యం తప్పుగా ఉంటే.. దానికి వ్యాకరణ రీత్యా కరెక్ట్ పదాన్ని లేదా వాక్యాన్ని కూడా గూగుల్ చూపిస్తుంది. ఈ తాజా గూగుల్ ఫీచర్‌ను మీరు డెస్క్‌టాప్‌లోనూ, మొబైల్ ఫోన్లోనూ వినియోగించవచ్చు.