Google Message App Latest Features : గూగుల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటుంది. అందులో భాగంగా గూగుల్ మెసేజెస్ యాప్‌లో.. త్వరలో రెండు సరికొత్త ఫీచర్లను తీసుకురానుంది. అవి:
- ఫొటోమోజీ
- ఎడిట్ సెంట్ టెక్ట్స్ (Edit Sent Texts)
ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రెండు నయా ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Google Message Photomoji Feature : సాధారణంగా యూజర్లు తమ ఫీలింగ్స్‌ను, రియాక్షన్స్‌ను తెలియజేయడానికి ఎమోజీలను వాడుతుంటారు. కానీ వాటిని కస్టమైజ్ చేయడం కాస్త కష్టమనే చెప్పాలి. అందుకే గూగుల్ 'ఫొటోమోజీ' అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా స్వయంగా మీరే.. మీ ఎమోజీని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే.. మీరు మీ సొంత ఫొటోలను ఉపయోగించి, మీకు నచ్చిన ఆబ్జెక్ట్స్‌ను వాటికి జత చేసి ఫొటోమోజీ తయారు చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చిన వ్యక్తులకు పంపించుకోవచ్చు.
మీరు ఈ నయా ఫీచర్ ద్వారా ఒకసారికి ఏకంగా 30 వరకు ఫొటోమోజీలను తయారు చేసుకోవచ్చు. వాటిని ఎవరికైనా పంపించుకోవచ్చు. అంతేకాదు మీకు నచ్చనివాటిని మార్చుకోవచ్చు. అవసరం లేని ఫొటోమోజీలను డిలీట్ చేసుకోవచ్చు కూడా. అయితే ఈ ఫొటోమోజీ ఫీచర్ అనేది కేవలం RCS చాట్స్‌లో మాత్రమే పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
ఫొటోమోజీని ఫీచర్‌ను వాడడం ఎలా?
How To Create Photomoji :
మెథడ్ 1 :
- ముందుగా మీరు Google Message యాప్‌ను ఓపెన్ చేయాలి.
- మీరు ఎవరితో అయితే చాట్ చేయాలని అనుకుంటున్నారో.. ఆ చాట్ బాక్స్‌ను ఓపెన్ చేయాలి.
- Emoji ఐకాన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఎమోజీలు సహా "+" ఐకాన్ కనిపిస్తుంది.
- మీరు "+" ఐకాన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు Create అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- క్రియేట్‌పై క్లిక్ చేసి మీరు స్వయంగా ఫొటో తీసుకోవచ్చు. లేదా మీ గ్యాలరీలోని ఫొటోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
- ఇలా తీసుకున్న ఫొటోను మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫొటోను మీరు క్రాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆబ్జెక్ట్స్‌ను దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత ఆ ఫొటోమోజీని సేవ్ చేసుకోవాలి.
- ఇలా క్రియేట్ చేసుకున్న ఫొటోమోజీని మీ టెక్ట్స్ మెసేజ్ ద్వారా ఎవరికైనా పంపించుకోవచ్చు.
మెథడ్ 2 :
- ముందుగా మీరు రియాక్షన్ బార్ ఓపెన్ చేయాలి.
- మీకు వచ్చిన మెసేజ్‌పై లాంగ్-ప్రెస్ చేయాలి.
- వెంటనే మీకు ఎమేజీ బార్ కనిపిస్తుంది. దానిని స్క్రోల్ చేస్తే కింద "+" ఐకాన్ కనిపిస్తుంది.
- మీరు "+" ఐకాన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీకు Create అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- క్రియేట్‌పై క్లిక్ చేసి మీరు స్వయంగా ఫొటో తీసుకోవచ్చు. లేదా మీ గ్యాలరీలోని ఫొటోను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
- ఇలా తీసుకున్న ఫొటోను మీకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫొటోను మీరు క్రాప్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఆబ్జెక్ట్స్‌ను దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత ఆ ఫొటోమోజీని సేవ్ చేసుకోవాలి.
- ఇలా క్రియేట్ చేసుకున్న ఫొటోమోజీని మీ టెక్ట్స్ మెసేజ్ ద్వారా ఎవరికైనా పంపించుకోవచ్చు.
రిసిపెంట్స్ వ్యూ
మీరు పంపించిన ఫొటోమోజీ.. అవతలి వ్యక్తికి వెళ్లినవెంటనే.. సదరు వ్యక్తికి మీ మెసేజ్‌తోపాటు చిన్న ఇమేజ్ అటాచ్మెంట్ కూడా కనిపిస్తుంది. ఆ చిన్న ఇమేజ్ను ట్యాప్ చేస్తే.. ఫుల్ ఫొటో సహా ఎమోజీ ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ విధంగా మీ హావభావాలను ఫొటో ఎమోజీ ఫీచర్ ద్వారా తెలియజేయవచ్చు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Google Message Edit Sent Message Feature : గూగుల్ మెసేజెస్ త్వరలో 'ఎడిట్ సెంట్ టెక్ట్స్' ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, మీరు ఇప్పటికే పంపించిన సందేశాన్ని కూడా ఎడిట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వెర్షన్లో మాత్రమే ఉంది. వాట్సాప్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కనుక గూగుల్ మెసేజెస్ యాప్‌లోనూ ఈ ఫీచర్‌ను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి గ్యారెంటీ లేదు.
డైలీ లిమిట్ లేని డేటా కావాలా? బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!
వాట్సాప్‌లో మేజిక్ వాయిస్ మెసేజ్ ఫీచర్- ఒక్కసారి వినగానే మాయం- ఇలా పంపాలి!