వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని 11 ఆండ్రాయిడ్ యాప్‌లపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది గూగుల్. కొన్ని యాప్‌లు తమ వినియోగదారుల గోప్యత, భద్రతకు భంగం కలిగిస్తుంటాయి. అవి వారి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండానే దొంగిలించి.. వాటిని ఇతరులతో పంచుకోవడం చేస్తూ ఉంటాయి. అలాంటి యాప్‌లను గుర్తించి వాటిని బ్యాన్ చేస్తుంది గూగుల్. అయితే తాజాగా అలాంటి మరో 11 యాప్స్‌పై నిషేధం విధించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించింది. వీటిలో సబ్స్క్రిప్షన్ ట్రోజన్ అనే మాల్వేర్ ఉందని పలువురు భద్రతా నిపుణులు కనుక్కున్నారు. వీటిని వినియోగదారులు సైతం తమ ఫోన్ నుంచి తొలగించాలని హెచ్చరిస్తున్నారు.
వీటిని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులోని బగ్ మన ఫోన్లోకి వస్తుంది. ఆ తర్వాత మనకు తెలియకుండానే ఖరీదైన నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను కోసం ఆటోమెటిక్‌గా సైన్ అప్ చేస్తుంది. అయితే వినియోగదారులు ఇలాంటి వాటిని కనుక్కోలేరు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ యాప్‌లను ఇప్పటివరకు 6,15,000 కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని భావిస్తున్నారు. ఇవి ప్రమాదమని తెలిసిన వెంటనే వాటిని తొలగించారు. కానీ ఇప్పటికే వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, అలానే ఉంచిన వారు మాత్రం ప్రమాదంలో ఉన్నారు. మరి ఆ యాప్స్ ఏంటో తెలుసుకోండి..
- Beauty Camera Plus
- Beauty Photo Camera
- Beauty Slimming Photo Editor
- Fingertip Graffiti
- GIF Camera Editor
- HD 4K Wallpaper
- Impressionism Pro Camera
- Microclip Video Editor
- Night Mode Camera Pro
- Photo Camera Editor
- Photo Effect Editor
మీరు కూడా మీ డివైజ్‌లో ఈ యాప్స్ ఏవైనా ఉంటే.. వెంటనే వాటిని తొలగించండి. దీంతో పాటు మీ అనుమతి లేకుండా.. మీకు తెలియకుండా ఏవైనా సబ్స్క్రిప్షన్ జరిగిందా? అందుకు మీ ఖాతా నుంచి చెల్లింపులు జరిగాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ట్రోజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలువురు వినియోగదారులు ప్రభావితమయ్యారు. థాయిలాండ్, పోలండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లో అధికశాతం మంది బాధితులు ఉన్నారు.
ఈ అంశంపై భద్రతా నిపుణుడు కాలినిన్ మాట్లాడుతూ.. "మా దగ్గరున్న డేటా ప్రకారం ఇది గతేడాది నుంచే ఉంది. ఈ 11 యాప్స్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి. అంతేకాకుండా 6,20,000 డివైజ్‌లలో వీటిని ఇన్స్టాల్ చేసుకున్నారు. అయితే.. ప్రస్తుతం వాటిని ప్లే స్టోర్ నుంచి తీసేశారు." అని చెప్పారు.
ఇవీ చదవండి : 5G వల్ల మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుందా?.. ఈ సింపుల్ టిప్‌తో అంతా సెట్!
గూగుల్ డ్రైవ్ నిండిపోయిందా? ఈ 5 క్లౌడ్ బ్యాకప్ టూల్స్ ట్రై చేయండి!