Best OTT Plans In India 2023 : ఓటీటీ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ తమ యూజర్ల కోసం అద్భుతమైన ప్రీమియం ప్లాన్స్ అందిస్తున్నాయి. వాటిలో కొన్ని బెస్ట్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Prime Plans : ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ 4 రకాల ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లను అందిస్తోంది. అవి:
- మంత్లీ ప్రైమ్ ప్లాన్ (1 నెల) - రూ.299
- క్వార్టర్లీ ప్రైమ్ ప్లాన్ (3 నెలలు) - రూ.599
- యాన్యువల్ ప్రైమ్ ప్లాన్ (12 నెలలు) - రూ.1499
- యాన్యువల్ ప్రైమ్ లైట్ ప్లాన్ (12 నెలలు) - రూ.799
Amazon Prime Lite Membership Plan Price : అమెజాన్ తాజాగా ప్రైమ్ లైట్ మెంబర్షిప్ ప్లాన్ ధరను ఏకంగా రూ.200 వరకు తగ్గించింది. దీనితో రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు కేవలం రూ.799కే లభిస్తోంది.
Amazon Prime Lite Benefits : అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ ఉన్న వారికి పలు బెనిఫిట్స్ లభిస్తాయి. అవి:
- యూజర్లకు టు-డే డెలివరీ, షెడ్యూల్డ్ డెలివరీ, సేమ్-డే డెలివరీ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి.
- నో-కాస్ట్ ఈఎంఐ, మార్నింగ్ డెలివరీ (ఒక ఐటెమ్‌కు రూ.175 ఛార్జీ), 6 నెలల వరకు ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- అన్లిమిటెడ్ హెచ్డీ మూవీస్, అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్, టీవీ షోలు చూడవచ్చు.
- అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కూడా పొందవచ్చు.
Amazon Prime Lite Limitations : అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్షిప్ తీసుకున్నవారికి, ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ ఉండదు. అలాగే వీడియో హెచ్డీ క్వాలిటీకి మాత్రమే పరిమితం అయ్యుంటుంది. గతంలో రెండు డివైజ్‌ల్లో ప్రైమ్ లైట్ వాడుకోవడానికి ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ఒక డివైజ్‌కి మాత్రమే దానిని పరిమితం చేశారు.
సాధారణ ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్లతో పోల్చితే, ప్రైమ్ లైట్ ప్లాన్‌లో డిస్కౌంటెండ్ మార్నింగ్ డెలివరీ (ఐటెమ్‌పై రూ.50), అన్లిమిటెడ్ ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ఉండవు.
Netflix Plans : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ 4 రకాల ప్లాన్లను అందిస్తోంది. అవి :
- Netflix Mobile Plan : దీని నెలవారీ చందా రూ.149. ఈ ప్లాన్ తీసుకున్నవారు 480p రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్స్‌లో వీడియోలను చూడవచ్చు.
- Netflix Basic Plan : దీని నెలవారీ చందా రూ.199. ఈ ప్లాన్ తీసుకున్నవారు 720p రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో వీడియోలను చూడవచ్చు.
- Netflix Standard Plan : దీని నెలవారీ చందా రూ.499. ఈ ప్లాన్ తీసుకున్నవారు 1080p రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో నెట్‌ఫ్లిక్స్ వీడియో కంటెంట్‌ను చూడవచ్చు.
- Netflix Premium Plan : ఈ ప్రీమియం ప్లాన్ నెలవారీ చందా రూ.649. ఈ ప్లాన్ తీసుకున్నవారు 4K+HDR రిజల్యూషన్‌తో ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్, టీవీల్లో నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం కంటెంట్‌ను చూడవచ్చు.
Disney Hotstar Plans : డిస్నీ-హాట్‌స్టార్ రెండు రకాల ప్లాన్లను అందిస్తోంది. అవి:
- సూపర్ ప్లాన్ : దీని సంవత్సర చందా రూ.899. దీనిలో 1080p ఫుల్ హెచ్డీ క్వాలిటీతో వీడియోలు చూడవచ్చు.
- ప్రీమియం ప్లాన్ : దీని సంవత్సర చందా రూ.1499. అయితే రూ.299కే నెలవారీ డిస్నీ హాట్‌స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. దీనిలో 4కె క్వాలిటీతో మూవీస్, లైవ్ స్పోర్ట్స్, టీవీ షోలు చూడవచ్చు.
ఈ డిస్నీ హాట్‌స్టార్ మెంబర్షిప్ తీసుకున్నవారు, సూపర్, ప్రీమియం కంటెంట్‌ను సెల్‌ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌లో చూసుకోవచ్చు.
Aha Plans : ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం మొత్తం 5 రకాల ప్లాన్లను అందిస్తోంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- Aha Gold : ఈ ఆహా గోల్డ్ ప్లాన్ సంవత్సర చందా రూ.899. దీనిలో 4కె క్వాలిటీతో, డాల్బీ 5.1 సౌండ్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు.
- Telugu Annual Premium : ఈ ఆహా తెలుగు యాన్యువల్ ప్రీమియం ప్లాన్ సంవత్సర చందా రూ.699. దీనిలో ఫుల్ హెచ్డీ (1080p) క్వాలిటీతో కేవలం తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు.
- Telugu Quarterly Mobile : ఈ ఆహా తెలుగు క్వార్టర్లీ ప్లాన్ అనేది మొదటిసారి ఆహా ప్లాన్ తీసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మూడు నెలల ప్లాన్ ధర రూ.99 మాత్రమే. దీనిలో 720p రిజల్యూషన్‌తో తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకోవచ్చు.
- Telugu Annual : ఈ తెలుగు యాన్యువల్ ప్లాన్ సంవత్సర చందా రూ.399. దీనిలో ఫుల్ హెచ్డీ క్వాలిటీతో, స్టీరియో సౌండ్ క్వాలిటీతో తెలుగు సినిమాలు, వీడియోలు చూడవచ్చు.
- Telugu Quarterly : ఇది ఆహా ప్లాట్‌ఫాం అందిస్తున్న వాల్యూ ప్యాక్. ఈ మూడు నెలల ప్లాన్ ధర రూ.199. దీనిలోనూ ఫుల్ హెచ్డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు.
ZEE5 Plans : జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాం 3 రకాల ప్రీమియం ప్లాన్లను అందిస్తోంది. అవి :
- జీ ప్రీమియం హెచ్డీ (6 నెలల ప్లాన్) - రూ.599
- జీ ప్రీమియం హెచ్డీ (12 నెలల ప్లాన్) - రూ.899
- జీ ప్రీమియం 4కె (12 నెలల ప్లాన్) - రూ.1199
ఈ జీ ప్రీమియం ప్లాన్స్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్‌ల్లో యాడ్స్ లేకుండా మూవీస్, వెబ్‌సిరీస్, టీవీ షోస్, మ్యూజిక్ అన్నీ ఆస్వాదించవచ్చు.
Jio Cinema Premium Plan : జియో సిమ్ తీసుకున్నవారందరూ, జియో సినిమా ఓటీటీని ఉచితంగా వాడుకోవచ్చు. అయితే ప్రీమియం కంటెంట్ చూడాలంటే మాత్రం, జియో సినిమా ప్రీమియం ప్లాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని సంవత్సర చందా రూ.999 ఉంటుంది. ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు ఏ డివైజ్‌లో అయినా జియోసినిమా ప్రీమియం కంటెంట్‌ను చూడవచ్చు.
ట్రైన్ ట్రాకింగ్ & లైవ్ వ్యూ వాకింగ్ - గూగుల్ మ్యాప్స్ నయా ఫీచర్స్!
ఫోన్ నంబర్ ఉంటే చాలు - యూజర్ లొకేషన్ కనిపెట్టేయొచ్చు! గూగుల్ కాంటాక్ట్స్ నయా ఫీచర్!