ETV Bharat / science-and-technology

ఆ స్టార్టప్​లతో.. ఏ పరీక్షకైనా ఇంట్లోనే చదువుకోవచ్చు! - online education in telugu states

కరోనా వల్ల స్కూళ్లకీ, కాలేజీలకీ, పలు కోచింగ్‌ కేంద్రాలకీ దూరమైన విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలతోనే సరిపెట్టుకుంటున్నారు. మరి అలాంటి విద్యార్థులకోసం ట్యూషన్లూ, పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణా, కాలేజీలకి సంబంధించిన సమాచారం వంటివి అందిస్తున్నాయి కొన్ని స్టార్టప్‌లు. ఎప్పుడంటే అప్పుడు విద్యార్థులకు అందుబాటులో ఉండి సందేహాలూ తీర్చుతున్నాయి.

ఆ స్టార్టప్​లతో.. ఏ పరీక్షకైనా ఇంట్లోనే చదువుకోవచ్చు!

author img

By

Published : Nov 2, 2020, 12:34 AM IST

Updated : Feb 16, 2021, 7:52 PM IST

కాలేజీల గురించి చెబుతారు...

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులకు పంపడానికి ఏ కాలేజీ బాగుంటుందీ, ఏ కోర్సు చేస్తే మంచిదీ... విదేశాల్లో అయితే ఏ యూనివర్సిటీకి పంపాలీ అని ఆలోచిస్తుంటారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం గురించి ఎవర్ని అడగాలో తెలియదు. అలాంటి తల్లిదండ్రులూ, పిల్లలకోసమే ‘కాలేజీ దునియా’ స్టార్టప్‌ను ప్రారంభించాడు సాహిల్‌ చలనా. దాని ద్వారా దేశవిదేశాల్లోని కాలేజీలూ, యూనివర్సిటీలూ, అవి అందించే కోర్సులూ, ప్రవేశపరీక్షలూ, స్కాలర్‌షిప్పులూ, ఫీజులూ, హాస్టల్‌, అడ్మిషన్‌ వివరాల వంటి వాటిగురించి సమాచారం అందిస్తున్నాడు. గుడ్‌గావ్‌కి చెందిన సాహిల్‌ 2014లో ఈస్టార్టప్‌ను ప్రారంభించాడు. దాదాపు 30 వేల విద్యాసంస్థలకు సంబంధించిన సమాచారం తమ కాలేజీదునియా వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు. క్యాట్‌, గేట్‌, నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు, వాటి మోడల్‌పేపర్లు, ఫలితాల సమాచారం కూడా ఇందులో తెలుసుకోవచ్చు. విదేశాల విషయానికొస్తే... కెనడా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్వీడన్‌, న్యూజిలాండ్‌, మలేసియా, సింగపూర్‌ వంటి చోట్ల ఉచిత కోర్సులు, వసతి గురించి ఈ సైట్‌లో ఉన్నాయి. అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకునేవారికి ఈ స్టార్టప్‌ వీసా, కాలేజీల దరఖాస్తుకు సంబంధించి కూడా సాయపడుతుంది. ఒకరకంగా ఈ స్టార్టప్‌ ఉన్నత చదువులు చదువుకోవాలనుకునేవారి కోసమే పనిచేసే సెర్చ్‌ ఇంజిన్‌లా అన్నమాట!

పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తుంది...

చాలామంది విద్యార్థులు ఇళ్ల దగ్గరే ఉంటూ గవర్నమెంట్‌ ఉద్యోగాలకు సిద్ధమవుతుంటారు. అలాంటి వాళ్లకి ‘టెక్ట్స్‌బుక్‌’ ఆప్‌ వల్ల మేలు అంతా ఇంతా కాదు. ఆరేళ్ల క్రితం కొందరు స్నేహితులతో కలిసి బిహార్‌కు చెందిన అశ్‌తోష్‌ కుమార్‌ దీన్ని స్థాపించాడు. ఈ ఆప్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలూ, ఇంటర్వ్యూ వివరాలనూ, అందుకు సంబంధించిన శిక్షణను అందిస్తోంది అశ్‌తోష్‌ బృందం. ఇంతకీ అశుతోష్‌కి ఆలోచన ఎలా వచ్చిందంటే... పేద కుటుంబంలో పుట్టి పెరిగిన అతను ఐఐటీ బాంబేలో సీటు సంపాదించడానికి ఎంతో కష్టపడ్డాడు. పరీక్షలకు సంబంధించిన సిలబస్‌, మోడల్‌ పేపర్స్‌ వంటివి సాధించడానికీ ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందుల్లోంచే టెక్ట్స్​బుక్‌ ఆప్‌ రూపకల్పన ఆలోచన వచ్చింది. అందుకు తనతోపాటు కలిసి చదువుకున్న స్నేహితులు మనోజ్‌, ప్రవీణ్‌, నరేంద్రలు కూడా తోడవ్వడంతో ముంబయి కేంద్రంగా దీన్ని ప్రారంభించాడు. మొదట్లో ఆఫ్‌లైన్‌ పాఠాలు అందుబాటులో ఉంచారు. క్రమంగా ఆన్‌లైన్‌లోనూ విద్యార్థులకు పలు కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. రైల్వే, స్టీల్‌పాంట్‌, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి పలు సంస్థలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పోటీ పరీక్షల వివరాలూ, వాటి మోడల్‌, పేపర్లూ, మాక్‌ టెస్ట్‌ డొమైన్‌లూ ఇందులో ఉంటాయి. 200 రకాల రికార్డెడ్‌ కోర్సులు వీడియోల రూపంలో ఉన్నాయి. సందేహాలు వస్తే వెంటనే నిపుణులను వీడియో కాల్‌ ద్వారా సంప్రదించి వాటిని నివృత్తి చేసుకోవచ్చు.

పాఠాలన్నీ ఆప్‌లోనే..

చిన్న చిన్న పిల్లలకు కూడా స్కూల్‌ అయ్యాక ట్యూషన్లు చెప్పించడం మనం చూస్తుంటాం. కొన్ని చోట్ల స్కూళ్ల ఫీజుల కంటే ఆ ట్యూషన్ల ఫీజులే ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో మధ్యతరగతి తల్లిదండ్రులకు పిల్లల చదువు చాలానే భారమవుతోంది. అది గమనించిన ఇరవై మూడేళ్ల ఆకాంక్ష చతుర్వేది రెండేళ్ల క్రితం ‘ఎడ్యురా’ పేరుతో స్టార్టప్‌ను స్థాపించి... విద్యార్థులకోసం ఓ ఆప్‌ను రూపొందించింది. అందులో ఆరు నుంచి ఇంటర్‌ వరకూ చదివే విద్యార్థులకు 2డీ/3డీ యానిమేషన్‌తో ఆఫ్‌లైన్‌లో పాఠ్యాంశాలు ఉంటాయి. సందేహాలు వచ్చినప్పుడు టీచర్లను ఆన్‌లైన్‌లో సంప్రదించొచ్చు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లతోపాటు, తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్‌, చత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల స్టేట్‌ సిలబస్‌ పాఠాలు ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉన్నాయి. ఈ పాఠ్యాంశాలతోపాటు పోటీపరీక్షల వివరాలూ, మోడల్‌పేపర్లూ, మాక్‌టెస్ట్‌లూ, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంచింది ఆకాంక్ష. వినోదానికి సంబంధించిన జీ5 ఆప్‌ ఆ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టడంతోపాటు చందాదారులకు కొంత కాలం ఉచితంగా సబ్‌స్క్రిప్షన్‌ కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఆప్‌ను పదికోట్ల మంది వినియోగదారులు చూస్తున్నారు. మరో యాభై వేల మంది నేరుగా ఎడ్యురా ఆప్‌లో లాగిన్‌ అయి ఉన్నారు. అందులో వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి ప్రకటనలు కూడా ఇబ్బంది పెట్టవు. తరగతీ, కోరుకున్న కోర్సును బట్టి సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీ ఉంటుంది.

Last Updated : Feb 16, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.