ETV Bharat / science-and-technology

వంట నూనెతో ఆకాశంలో ఎగిరే విమానం.. సరికొత్త చరిత్ర - బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ లేటెస్ట్ న్యూస్

విమానాలు పెట్రోల్​తో నడుస్తాయని అందరికీ తెలుసు. అయితే మరింత శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్​ను విమానాలలో వినియోగిస్తారు. దీన్నే మనం విమాన ఇంధనమని అంటాం. అయితే బ్రిటన్ ఎయిర్​ఫోర్స్​లో మాత్రం వంట వంట నూనెతో విమానం ఆకాశంలో ఎగురుతుందట. మరి దాని గురించి తెలుసుకుందామా..

An airplane flying in the sky with cooking oil in Britain's Royal Air Force
విమానం
author img

By

Published : Dec 8, 2022, 9:38 AM IST

విమానాలు ఎలా నడుస్తాయి? పెట్రోల్‌తో. అదీ మరింత శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో. దీన్ని విమాన ఇంధనమనీ అంటారు. మరి వంట నూనెతో ఆకాశంలోకి ఎగిరితే? బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఆర్‌ఏఎఫ్‌) ఇలాంటి ఘనతే సాధించింది. సైనిక రవాణా విమానాన్ని నూరుశాతం సుస్థిర విమాన ఇంధనం (ఎస్‌ఏఎఫ్‌) సాయంతోనే నడిపించి కొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ప్రయాణించిన విమానాల్లో ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది! సైనిక, పౌర విమాన సేవలకు ఎస్‌ఏఎఫ్‌ను వాడుకోవటానికిది మార్గం సుగమం చేసింది. సరికొత్త చర్చకు దారితీసింది.

విమాన ఇంధనంలో చాలా శక్తి ఉంటుంది. దీని మూలంగానే విమాన ప్రయాణాలు సాధ్యమవుతున్నాయి. చాలా త్వరగా, దూర ప్రాంతాలకు ప్రయాణాలు సాగించటానికి దీనికి మించిన సాధనం మరోటి లేదు. దీంతో చిక్కేంటంటే- కర్బన ఉద్గారాలు వెలువడటం. ఒక కిలో ఇంధనంతో 3.16 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ వాతావరణంలో కలుస్తుంది. అందుకే విమాన ఇంధనానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించటం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సుస్థిర విమాన ఇంధనం.. సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయెల్‌ (ఎస్‌ఏఎఫ్‌) ఆలోచన పుట్టుకొచ్చింది. ఎన్నో పెట్రోలు కంపెనీలు దీన్ని తయారు చేయటంపై దృష్టి సారించాయి. 2050 కల్లా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించటం దీని ఉద్దేశం.

సుస్థిర విమాన ఇంధనమంటే?
పెట్రోలు, డీజిల్‌ వంటివన్నీ శిలాజ ఇంధనాలు. వీటిని భూగర్భంలోంచి తవ్వి తీస్తారు. సుస్థిర విమాన ఇంధనం అలాంటిది కాదు. బయో ఇంధనం. వాడగా మిగిలిన వంటనూనెలు, ఆహార వ్యర్థాల వంటివాటితో తయారు చేస్తారు. ఇది శిలాజ విమాన ఇంధనం కన్నా తక్కువ కార్బన్‌ను విడుదల చేస్తుంది. విమాన ఇంధనంతో పోలిస్తే కర్బన ఉద్గారాల చట్రాన్ని సుమారు 80% వరకు తగ్గిస్తుంది. అదెలాగో ఉదాహరణతో చూద్దాం. మొక్కలు పెరుగుతున్నప్పుడు గాల్లోంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి కదా. ఆహార, అటవీ వ్యర్థాలన్నీ మొక్కలు, చెట్ల నుంచి వచ్చినవే. వీటి నుంచి తయారైన ఇంధనాన్ని విమానాల్లో వాడుకుంటున్నప్పుడు కార్బన్‌ డయాక్సైడ్‌ తిరిగి వాతావరణంలోకి విడుదలవుతుంది. ఒకవైపు తగ్గటం, మరోవైపు పెరగటం.. దాదాపు రెండూ సమానంగానే ఉంటాయి. మరి తేడా ఏంటి? వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారుచేయటం వల్ల వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌, మిథేన్‌ కలవటం తగ్గుతుంది. విలువైన వనరులను తిరిగి వినియోగించుకోవటానికి వీలవుతుంది. ఇదే స్వచ్ఛ ఇంధనమనే పేరు తెచ్చిపెడుతోంది. భవిష్యత్‌ బయో ఇంధనం, అధునాతన ఇంధనమనీ పిలుచుకుంటున్నారు.

వేటి నుంచి తయారుచేస్తారు?
సుస్థిర విమాన ఇంధనాన్ని రకరకాల పదార్థాలు, వ్యర్థాలతో తయారుచేస్తారు.

* గృహ, కార్యాలయ వ్యర్థాలు: ఆహార వ్యర్థాలు.. పాత దుస్తులు, పత్రికలు, బాటిళ్లు,.. పారేసిన బాటిళ్లు, ఫర్నిచర్‌.. ఇలాంటివన్నీ ఇంధన తయారీకి ఉపయోగపడేవే.

* సెల్యులోజ్‌ వ్యర్థాలు: వాడగా మిగిలిన కలప, వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు.

* వాడిన నూనెలు: వేపుళ్ల వంటివి వండిన తర్వాత మిగిలి పోయిన నూనెలు, కొవ్వు పదార్థాలూ ఉపయోగపడతాయి.

* క్యామెలీనా: ఇదొక పంట. ఇందులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సాధారణంగా గోధుమ, ఇతర తృణధాన్యాలతో కలిపి పండిస్తుంటారు.

* జట్రోపా: దీని విత్తనాల్లో తినటానికి ఉపయోగపడని కొవ్వు నూనె ఉంటుంది. దీన్నుంచి ఇంధనాన్ని తయారుచేయొచ్చు.

* నాచు (ఆల్గే): కలుషిత నీరు, ఉప్పు నీరు, ఎడారులు, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో దీన్ని పెంచొచ్చు. ఇది కార్బన్‌ డయాక్సైడ్‌ను ఆహారంగా తీసుకుంటుంది. విద్యుదుత్పత్తి కేంద్రాల వంటి చోట్ల వాతావరణంలోంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహించటానికి దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఆల్గేను సుస్థిర ఇంధన తయారీకి వాడుకోవటం మీదా దృష్టి సారించారు.

సురక్షితమేనా?
రసాయనిక, భౌతిక గుణాల పరంగా సుస్థిర, సంప్రదాయ విమాన ఇంధనాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అంటే వీటిని కలిపినా నష్టమేమీ ఉండదన్న మాట. చక్కగా వాడుకోవచ్చు. ప్రస్తుతం వినియోగిస్తున్న విమానాలను సాంకేతికంగా మార్చకుండానే ఈ ఇంధనాన్ని ఉపయోగించుకోవచ్చు. సుస్థిర విమాన ఇంధనాన్ని వాణిజ్యపరంగా విమాన ప్రయాణాలకు వాడుకోవచ్చని 2011లోనే ఆమోదం లభించింది. ఇప్పటివరకు 2.25 లక్షల కన్నా ఎక్కువ వాణిజ్య ప్రయాణాలు సాగాయి. 600 కోట్ల లీటర్ల ఎస్‌ఏఎఫ్‌ను వాడుకున్నారు. దీన్ని చాలావరకు సంప్రదాయ విమాన ఇంధనంలో కలిపి వాడుతుంటారు. కానీ తాజాగా రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పూర్తిగా.. నూరు శాతం సుస్థిర ఇంధనంతోనే విమాన ప్రయాణాన్ని సుసాధ్యం చేయటం విశేషం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.