ETV Bharat / science-and-technology

విసిగించే స్పామ్ కాల్స్​, మెసేజ్​లకు ఇక చెక్.. నేటి నుంచే కొత్త రూల్స్!

మొబైల్​ వినియోగదారులను స్పామ్ కాల్స్​, మోసపూరిత కాల్స్​ నుంచి రక్షణ కల్పించేందుకు ట్రాయ్​ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీంతో ఇక మొబైల్​కు ఎటువంటి ఫేక్​ కాల్స్ గానీ ఇతరు విసుగు పుట్టించే కాల్స్​ గానీ రావు. మే 1నే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

ai-based-spam-filter-trai-implements-ai-spam-filters-in-india-to-combat-unwanted-calls-and-message
ఏఐ స్పామ్ ఫిల్టర్
author img

By

Published : May 1, 2023, 4:38 PM IST

స్పామ్ కాల్స్​తో విసిగిపోతున్నారా? పదే పదే అనవసరమైన ​మెసేజ్​లతో చిరాకు పడుతున్నారా? అయితే మీ సమస్యకు పరిష్కారం దొరికింది. వాటి నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం కొత్త నిబంధలను తీసుకువచ్చింది. మే 1నే వీటిని అమల్లోకి తెచ్చింది. అనవసరమైన​ కాల్స్​ను అరికట్టేందుకు ఏఐ స్పామ్​ ఫిల్టర్స్​ను ప్రవేశపెట్టాలని టెలికాం ఆపరేటర్లకు.. ట్రాయ్​ కీలక ఆదేశాలు జారీ చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని టెలికాం కంపెనీలు తమ కాల్, ఎస్​ఎమ్​ఎస్​ సేవల్లో ఏఐ స్పామ్ ఫిల్టర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. ట్రాయ్​ విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలను దేశంలోని ఎయిర్​టెల్​, జియో, వొడాఫోన్​ ఐడియా, బీఎస్​ఎన్ఎల్​ వంటి సంస్థలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ టెలికాం సంస్థలు ప్రవేశపెట్టే ఏఐ స్పామ్​ ఫిల్టర్స్​.. ఫేక్​ కాల్స్​ను, మెసేజ్​లను గుర్తిస్తాయి. ప్రమోషనల్​ కాల్స్​, మెసేజ్​లను కూడా పసిగడతాయి. అనంతరం వాటిని బ్లాక్​ చేస్తాయి. వినియోగదారులను వేధింపుల నుంచి, మోసపూరిత కాల్స్​ను నుంచి రక్షణ కల్పించడమే ఈ ఏఐ ఫిల్టర్ల ప్రధాన కర్తవ్యం.

ట్రాయ్​ తెచ్చిన ఈ కొత్త నిబంధనలను దిగ్గజ టెలికాం సంస్థలైన ఏయిర్​టెల్​, జియో అంగీకరించాయి. ఇదే విషయంపై ఎయిర్​టెల్​​ అధికారికంగా ప్రకటన చేసింది. జియో త్వరలోనే తన సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. ట్రాయ్ సూచనల మేరకు.. మరో ఫీచర్​ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. కాలర్ ఐడీ ఫీచర్​ ద్వారా వినియోగదారుల మొబైల్​ స్క్రీన్​పై.. కాలర్​ ఫోటో, పేరు కనిపిస్తాయి. ప్రైవసీ కారణాల రీత్యా టెలికాం సంస్థలు ఈ కాలర్​ ఐడీ ఫీచర్​కు ఒప్పుకోకపోవచ్చు. దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. అయితే.. ఏఐ స్పామ్​ ఫిల్టర్స్​ నిర్ణయం మాత్రం మే 1నే అమలులోకి వచ్చింది.

మీ మొబైల్​లో​ శాశ్వతంగా స్పామ్ కాల్స్​ను బ్లాక్​ చేసే.. డు నాట్​ డిస్టర్బ్​ సర్వీస్​ యాక్టివేట్ చేయాలంటే ఇలా చేయండి..

  1. మీ మొబైల్​ ఎస్​ఎమ్​ఎస్​ యాప్​ ఓపెన్​ చేసి START అని టైప్​ చేయండి
  2. దాన్ని 1909 నంబర్​కు మెసేజ్​ చేయండి.
  3. కొన్ని కోడ్​ కలిగిన కేటగిరీలతో మీకు ఒక్క లిస్ట్ వస్తుంది. ఈ కేటగిరీలలో బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, విద్య, ఆరోగ్యం మొదలైనవి ఉంటాయి.
  4. ఏ కేటగిరీని బ్లాక్​ చేయాలని అనుకుంటున్నారో.. ఆ కోడ్​ ఎంటర్​ చేసి రిప్లై ఇవ్వండి.
  5. అనంతరం మీ సర్వీస్​ ప్రొవైడర్​ నుంచి ఓ ధృవీకరణ మెసేజ్ వస్తుంది. 24 గంటల లోపు డు నాట్​ డిస్టర్బ్​ సర్వీస్​ యాక్టివేట్​ అవుతుంది. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.