ETV Bharat / priya

వేపుళ్లలో రుచి పెరగాలంటే ఆ 'నిమ్మ' పడాల్సిందే! - బంగాల్ వంటలు

ముదురాకుపచ్చ రంగులో ఉండి, తొక్క దళసరిగా ఉండే నిమ్మకాయ బంగాల్​లో మాత్రమే లభిస్తుంది. దీని సువాసనే వేరు. 'గంధొరాజ్‌' అని పిలుచుకునే దీనిని మటన్‌, చికెన్‌, చేపల కూరలు, వేపుళ్లలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు బంగాల్ వాసులు.

నిమ్మ
lemon
author img

By

Published : Jul 23, 2021, 12:30 PM IST

కూరలు లేదా పచ్చళ్లు పుల్లగా ఉండాలంటే సాధారణంగా మనం చింతపండు లేదా నిమ్మరసం వాడతాం. కానీ బంగాలీలు మాత్రం ఈ రెండూ వేయరు. కాస్త 'గంధొరాజ్‌ లెబు' రసం వంటకాల్లో వాడతారు. దీన్నే 'రంగాపుర్‌ లైమ్‌' అనికూడా అంటారు. ఈ నిమ్మకాయ ముదురాకుపచ్చ రంగులో ఉండి, తొక్క దళసరిగా ఉంటుంది. బంగాల్​లో మాత్రమే పండే ఈ నిమ్మకాయ సువాసనే వేరు. అంతచక్కని సువాసన వస్తుంది కాబట్టే దీనికి 'గంధరాజ్‌' అనీ వాడుక భాషలో 'గంధొరాజ్‌' అనే పేరు వచ్చింది.

lemon
గంధొరాజ్‌ సువాసనలతో వేపుడు

పెరట్లో ఈ చెట్టొకటి ఉంటే చాలనుకుంటారు బంగాలీలు. ఇది సాధారణ నిమ్మకాయలా గుండ్రంగా కాకుండా కోలగా ఉంటుంది. అందుకే దీన్ని నిలువుగానే కోస్తారు. 'చేపలు, మాంసాహార వంటకాలు అందుబాటులో లేనప్పుడు.. వేడివేడి దంపుడు బియ్యం అన్నంలో కాస్త పెసరపప్పు కలిపి, రెండు చుక్కల గంధొరాజ్‌ రసం పిండుకుని, బంగాళాదుంపల వేపుడు నంజుకుంటే చాలు.. స్వర్గానికి అడుగు దూరంలో ఉన్నట్టే ఉంటుంది' అంటారు భోజన ప్రియులు.

lemon
రంగాపూర్ నిమ్మకాయలు

మటన్‌, చికెన్‌, చేపల కూరలు, వేపుళ్ల రుచి అమాంతం పెరిగిపోవాలంటే వాటిల్లో కాస్త గంధొరాజ్‌ రసం పడాల్సిందేనంటారు అక్కడి పాకశాస్త్ర నిపుణులు. ఈ కాయ వెదజల్లే సువాసనలు ఎక్కడున్నవాళ్లనైనా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు లాక్కొచ్చేస్తాయంటారు దీని రుచి తెలిసినవాళ్లు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.