ETV Bharat / priya

కార్తికమాసం స్పెషల్​ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి! - ఉసిరి గోధుమ రవ్వ పులిహోర

Karthika Masam Special Usiri Godhuma Rava Pulihora: కార్తిక మాసాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. నాన్​వెజ్​ బంద్​ చేయడంతోపాటు ఎన్నో నియమాలు పాటిస్తారు. పూజలు, ఉపవాసాలు నిష్టతో చేస్తారు. అయితే.. ఈ సమయంలో స్వామివారికి ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో నైవేద్యం పెట్టడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

Usiri_Godhuma_Rava_Pulihora
Usiri_Godhuma_Rava_Pulihora
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 3:55 PM IST

Karthika Masam Special Usiri Godhuma Rava Pulihora : హిందూ పురాణాల్లో కార్తిక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఈ మాసం మొత్తం.. నిత్యపూజలతో గడుపుతారు. ఆలయాలన్నీ దీపాల కాంతితో కళకళలాడుతుంటాయి. శివనామస్మరణతో మార్మోగుతుంటాయి. కొందరు భక్తులు ఉపవాసాలు చేస్తుంటే.. మరికొందరు అయ్యప్ప దీక్ష చేపడతారు. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకు, వ్రతాలకూ విశేషమైన ఫలితం ఉంటుందని భక్తులు భావిస్తారు. అంతేకాకుండా.. ఈ మాసంలో చాలా మంది నాన్​వెజ్​ తినరు. ఈ నేపథ్యంలో.. స్వామి వారికి నైవేద్యంగా పెట్టడంతోపాటు భక్తులకు ఎనర్జీ కోసం.. ఉసిరి గోధుమరవ్వ పులిహోర చాలా మంచిది. ఉపవాసం ఉండేవారికి మంచి ఎనర్జీ ఇస్తుంది. మరి ఈ పులిహోరకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు చూద్దాం.

How to Make Kaddu Ki Kheer Recipe in Telugu: కద్దూ కీ ఖీర్.. టేస్ట్ చేస్తే.. జిందగీ ఖుష్ అనాల్సిందే!

కావలసిన పదార్థాలు:

  • గోధుమ రవ్వ: 1 కప్పు
  • మంచి నీరు-రెండు కప్పులు
  • ఉసిరికాయలు-4
  • పచ్చిమిర్చి: 6-8
  • వేరుశెనగలు(పల్లీలు): గుప్పెడు
  • పసుపు: 1/4 టీ​ స్పూన్​
  • పచ్చిశెనగపప్పు: 1 tsp
  • ఆవాలు: 1/4 tsp
  • జీలకర్ర: 1/4 tsp
  • మినపప్పు:1/4 tsp
  • ఎండుమిర్చి: 3-4
  • ఇంగువ: చిటికెడు
  • కరివేపాకు: రెండు రెమ్మలు
  • నూనె: సరిపడా
  • ఉప్పు: రుచికి తగినంత

తయారు చేసే విధానం:

  • ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి.. లోపల గింజ తీసేయాలి. తర్వాత 5 పచ్చిమిర్చి కాయలు కూడా తీసుకోవాలి. ఈ రెండిటినీ మిక్సీలో వేసి.. కచ్చాపచ్చగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద ఓ గిన్నె పెట్టి.. అందులో రెండు కప్పుల నీరు పోయాలి. నీరు బాగా మరిగే సమయంలో ఓ కప్పు గోధుమ రవ్వ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి.. ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె కాగిన తర్వాత పల్లీలు వేసి.. దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి అందులో తాళింపునకు సిద్ధం చేసుకొన్న పదార్థాలు (పచ్చిశెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ) ఒక దానికి తర్వాత ఒకటి వేసి దోరగా వేయించుకోవాలి.
  • తాళింపు వేగిన తర్వాత అందులో మిగిలిన పచ్చిమిర్చి వేసి.. మరో రెండు నిమిషాలు వేయించాలి.
  • ఆ తర్వాత వేయించి పెట్టుకొన్న వేరుశనగపప్పు, పసుపు, వేసి ఒక నిమిషం వేయించుకోవాలి.
  • ఇప్పుడు అందులో.. ముందుగా గ్రైండ్​ చేసుకున్న ఉసిరికాయ, పచ్చిమిర్చి పేస్ట్​ను వేసి.. ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేవరకు.
  • అనంతరం.. ఆ పోపులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న గోధుమ రవ్వను కూడా వేసి అన్నీ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. అంతే.. గోధుమ రవ్వ పులిహోర రెడీ. దీన్ని ఏదైనా ఊరగాయతో లేదో పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

రాఖీ స్పెషల్​ స్వీట్.. ఇంట్లో మీరే సింపుల్​గా చేసేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.