వినాయక చవితి సందర్భంగా చేసుకునే వంటకాలు ఎంతో రుచికరంగా, పోషకాలతో ఉంటాయి. తీపి ఇష్టంగా తినేవాళ్లు పాయసం (payasam) చేసుకుంటారు. పాయసాన్ని కొబ్బరిపాలతో చేసి చూడండి.. ఆహా ఆ రుచిని మరచిపోలేరు. అలా చేసేదాన్నే కొబ్బరిపాల ఆరిది (coconut kheer) లేదా పాయసం అంటారు. దానిని ఎలా తయారు చేయాలంటే..
కావాల్సిన పదార్థాలు..
బియ్యం పిండి, కొబ్బరి పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇలాచి పొడి
తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండి, కొబ్బరి పాలు వేసి.. వేడి నీళ్లు పోసుకొని పిండి తడుపుకొని తాళికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసి.. కాస్త వేయించుకున్న తరువాత తగిన్ని నీళ్లు పోసి బెల్లం వేసి మరిగించుకోవాలి.
అందులో ముందుగా మనం చేసి పెట్టుకొన్న తాళికలు కూడా వేసుకొని కాస్త ఉడికిన తరువాత కొబ్బరి పాలు పోసి స్టౌవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి పొడి కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరిపాల పాయసం రెడీ అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: బొజ్జ గణపయ్య మెచ్చే నైవేద్యాలు.. మీరూ ట్రై చేయండి!