ETV Bharat / opinion

Rajasthan Congress Vs BJP : కాంగ్రెస్​పై యువత, మహిళల అసంతృప్తి.. BJPకి లాభం చేకూర్చేనా? మేవాడ్ ఎవరి పక్షం? - రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు

Rajasthan Congress Vs BJP : రాజప్రాసాదాలకు కేంద్రమైన రాజస్థాన్‌లో ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. ఐదేళ్లలో చేసిన పనులే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్‌... ప్రభుత్వ వైఫల్యాలే తమ విజయానికి సోపానమని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇరుపార్టీలు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... క్షేత్రస్థాయి పరిస్థితులపై లోలోపల కలవరం చెందుతున్నాయి. మహిళలపై నేరాలు, పరీక్ష పేపర్ల లీక్‌ వంటి ప్రధానాంశాలు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

RAJASTHAN BJP VS CONGRESS
RAJASTHAN BJP VS CONGRESS
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 8:51 PM IST

Rajasthan Congress Vs BJP : రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌.. అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌ వైఫల్యాల ద్వారా పగ్గాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నాయి. 2018 ఎన్నికల్లో ( Rajasthan Election 2023 ) 200 స్థానాల శాసనసభలో వంద సీట్లతో హస్తం పార్టీ అధికారం చేపట్టింది. వసుంధరరాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమిపాలైంది. అంతకుముందు 2013ఎన్నికల్లో కమలం పార్టీ 163స్థానాల్లో విజయం సాధించి భారీ మెజార్టీతో వసుంధరరాజె సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

కీలకాంశాలు ఇవే...
ఈసారి రాజస్థాన్‌ ఎన్నికల్లో మహిళలపై నేరాలు, పరీక్ష పేపర్ల లీక్‌... కీలకాంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు, యువత కాంగ్రెస్‌ పాలనపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రతికూల పరిస్థితులను ఏ మేరకు అధిగమిస్తుందనే అంశంపై హస్తం పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను కమలం పార్టీ ఎంతవరకు తమకు అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి.

గహ్లోత్, వసుంధర.. ఇద్దరికీ ఒకే సమస్య!
రాజస్థాన్‌లో బీజేపీ తరఫున బలమైన నాయకురాలిగా వసుంధర రాజె గుర్తింపుపొందారు. అయితే ఈసారి ఆమెను పక్కనపెట్టాలని కమలనాథులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే కాంగ్రెస్‌ తరఫున 72ఏళ్ల అశోక్‌ గహ్లోత్‌... రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు పోటీపడుతున్నారు. అయితే ఈ ఇరువురు నేతలు కూడా తమ తమ పార్టీల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 46ఏళ్ల సచిన్‌ పైలెట్‌... గహ్లోత్‌కు పక్కలో బళ్లెంలా మారారు. 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయటమే కాకుండా ఇటీవలే బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని దీక్ష చేపట్టారు. అలాగే వసుంధర రాజెకు 52ఏళ్ల దియాకుమారి పోటీదారుగా కనిపిస్తున్నారు. రాజె స్థానాన్ని ఆమెతో భర్తీ చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పేపర్ లీక్​ల సమస్య
రాజస్థాన్‌లో పరీక్షల పేపర్ల లీక్‌ సర్వసాధారణంగా మారిందనే ఆరోపణలు హస్తం పార్టీకి కొంత దెబ్బగా చెప్పాలి. గత ఐదేళ్ల కాలంలో 14 పేపర్‌ లీక్‌ ఘటనలు జరిగి... కోటి మందికిపైగా యువతపై ప్రభావం పడినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న 49 లక్షల మంది యువత... నిర్ణయాత్మకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.

Rajasthan Elections 2023 : రాజస్థాన్​లో సెంటిమెంట్​ రిపీట్​ అవుతుందా? లేక కాంగ్రెస్​కే జై కొడతారా?

'మహిళలపై నేరాలు అధికం'
రాజస్థాన్‌లో మహిళలపై నేరాలు మరో ప్రధాన సమస్యగా, పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. కాంగ్రెస్‌ హయాంలో మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులే 33వేలు ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. గత 54 నెలల్లో మహిళలపై 10లక్షలకుపైగా నేరాలు జరిగినట్లు ఆ పార్టీ నాయకురాలు వసుంధర రాజె ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2.51కోట్ల మంది మహిళా ఓటర్లు... కాంగ్రెస్‌ భవితవ్యాన్ని తేల్చే అవకాశం ఉంది.

మేవాడ్​ను గెలిచేదెవరో?
రాజ్‌పుత్‌ల ప్రాబల్యమున్న మేవాడ్​లో ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారమనే నానుడి రాజస్థాన్‌ రాజకీయాల్లో ప్రచారంలో ఉంది. అయితే 2018 ఎన్నికల్లో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మేవాడ్ రీజియన్‌లో కాంగ్రెస్‌ హవా కొనసాగకపోయినా... వంద సీట్లతో ఆ పార్టీ అధికారం చేపట్టింది. దక్షిణ రాజస్థాన్‌లోని ఏడుజిల్లాల పరిధిలో మేవాడ్ ప్రాంతం విస్తరించి ఉంది. అక్కడ 28 స్థానాలు ఉండగా... గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 15, కాంగ్రెస్‌ 10 నియోజకవర్గాల్లో గెలుపొందాయి. మేవార్‌లో కాంగ్రెస్‌ సత్తా చాటకపోయినా.. బీజేపీ అధికారం దక్కించుకోలేక పోయింది. ఈసారి మేవాడ్ ప్రాంతం... కాంగ్రెస్‌, బీజేపీల్లో ఏ పార్టీకి జై కొడుతుందో చూడాలి.

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

JP Nadda Amit Shah Rajasthan Election : రాజస్థాన్​పై బీజేపీ హైకమాండ్​ ఫోకస్​.. రాత్రంతా షా, నడ్డా చర్చలు.. ఎన్నికల వ్యూహం రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.