ETV Bharat / opinion

మహమ్మారి మాటున రాక్షస దందా

కరోనా మహమ్మారి మాటున మాదకద్రవ్య, మానవ అక్రమ రవాణా ముఠాలు చెలరేగిపోతున్నాయి. భారీగా పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు, వెట్టి చాకిరీ, లైంగిక దోపిడి కూపంలో కూరుకుపోతున్న చిన్నారులు- ఈ ముఠాల దౌష్ట్యానికి నిదర్శనాలు. కొవిడ్‌ కేసులు విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా అదనంగా 16 కోట్ల మంది బాలబాలికలు వెట్టిచాకిరిలో కూరుకుపోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేరగాళ్ల ముఠాలు పేద కుటుంబాల బాలబాలికలకు ఉపాధి పేరిట ఎరవేసి వెట్టిచాకిరిలోకి, వ్యభిచారంలోకి దింపుతున్నాయి.

human trafficking covid,
మహమ్మారి మాటున రాక్షస దందా
author img

By

Published : Jul 30, 2021, 4:20 AM IST

కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన కల్లోలం మాటున రాకాసి మూకలు పండగ చేసుకుంటున్నాయి. అనివార్యంగా విధిస్తున్న లాక్‌డౌన్‌లను నిక్కచ్చిగా అమలు చేసే పనిలో పోలీసు, అధికార యంత్రాంగాలు నిమగ్నమవుతూ ఉంటే, సందట్లో సడేమియాలా మాదకద్రవ్య, మానవ అక్రమ రవాణా ముఠాలు చెలరేగిపోతున్నాయి. భారీగా పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలు, వెట్టి చాకిరీ, లైంగిక దోపిడి కూపంలో కూరుకుపోతున్న చిన్నారులు- ఈ ముఠాల దౌష్ట్యానికి నిదర్శనాలు. ఏటా జులై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినంగా జరుపుకొంటున్నారు. బాధితుల అనుభవాలే పరిష్కార మార్గాలనేది ఈ ఏడాది అంశం. మానవ అక్రమ రవాణాపై పోరాటంలో బాధితుల అనుభవాలు కీలకంగా మారతాయని, నేరనిరోధక చర్యల్లో అభాగ్యులను గుర్తించడం కాపాడటంలో వారి పాత్ర కీలకమని భావిస్తున్నారు.

లోపాయికారీ సహకారం

మాదక ద్రవ్యాల పట్టివేత వంటివన్నీ సత్వరమే అందరినీ ఆకర్షించే సంచలన వార్తలవుతున్నాయి. జనం దృష్టికి పెద్దగా రాని విషాద కథనాలు అభాగ్య బాలలవి. కొవిడ్‌ కేసులు విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా అదనంగా 16 కోట్ల మంది బాలబాలికలు వెట్టిచాకిరిలో కూరుకుపోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), ఐరాస బాలల అత్యవసర నిధి (యునిసెఫ్‌) వెల్లడించాయి. భారత్‌లో ఇలాంటి అభాగ్య బాలల సంఖ్య 80 లక్షలదాకా ఉంటుందని స్వచ్ఛంద సేవా సంస్థలు లెక్కగట్టినట్లు అమెరికా విదేశాంగ శాఖ నివేదిక జూన్‌లో వెల్లడించింది. బాలల అక్రమ రవాణాకు అధికారులు లోపాయికారీగా సహకరిస్తున్నారని, వీరు అనేక లోపాలతో బలహీనంగా కేసులు పెడుతున్నందువల్లే అక్రమ రవాణా నిందితులలో 73 శాతం శిక్షలు పడకుండానే తప్పించుకొంటున్నట్లు తెలిపింది.

కొవిడ్‌ గడ్డు కాలంలో కుటుంబాల ఆదాయాలు కోసుకుపోయినందువల్ల బాలలు వెట్టిచాకిరి పాలవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి మాదకద్రవ్య, నేర నిఘా విభాగం (యూఎన్‌ఓడీసీ) తాజా నివేదిక వెల్లడించింది. నేరగాళ్ల ముఠాలు పేద కుటుంబాల బాలబాలికలకు ఉపాధి పేరిట ఎరవేసి వెట్టిచాకిరిలోకి, వ్యభిచారంలోకి దింపుతున్నాయి. బాలలతో యాచన, నేరాలు చేయించడం, బలవంతపు బాల్య వివాహాలు ఎక్కువైపోయాయి. కొవిడ్‌ వల్ల బార్లు, క్లబ్బులు, మర్దన కేంద్రాలు మూతపడటం వల్ల.. నేరగాళ్లు తమ కార్యకలాపాలను ప్రైవేటు భవంతులు, వ్యవసాయ క్షేత్రాల్లోకి తరలించి, అంతర్జాలం సహాయంతో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా..

లాక్‌డౌన్‌ల వల్ల పిల్లలు, పెద్దలు ఎక్కువ సమయాన్ని ఆన్‌లైన్‌లో గడుపుతున్నందువల్ల అంతర్జాలం, సామాజిక మాధ్యమాల ద్వారా నేరగాళ్లు బాలలకు వల వేస్తున్నారు. మామూలు రోజుల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే ముఠాలు అభాగ్య బాలబాలికలను సరిహద్దులు దాటించి ఇతర దేశాలకు తరలిస్తాయి. కొవిడ్‌ వల్ల సరిహద్దులు మూతపడటం వల్ల వారిని నెలల తరబడి నిర్బంధ శిబిరాల్లో ఉంచి లైంగిక కార్యకలాపాలకు, గొడ్డు చాకిరికి ఉపయోగించుకొంటున్నారు. నేరగాళ్లకు చిక్కిన బాలల్లో కొందరిని అధికార సంస్థలు కాపాడినా, లాక్‌డౌన్‌ల కారణంగా వారిని కుటుంబాల వద్దకు చేర్చలేకపోతున్నాయి.

ఇలాంటి బాలలకు శారీరక, మానసిక చికిత్స, న్యాయ సహాయం, విద్య, ఉపాధి సౌకర్యాలు కల్పించడం కష్టమవుతోంది. భారత్‌లో బాలల అక్రమ రవాణాను నిరోధించడంలో పలు వైఫల్యాలు ఉన్నా, కొన్ని సానుకూలాంశాలూ కనిపిస్తున్నాయి. నేరగాళ్ల కార్యకలాపాలను అడ్డుకోవడానికి రైల్వేస్టేషన్లు, బస్సు, ట్రక్కు రవాణా కేంద్రాల్లో పోలీసులు గస్తీ కార్యకలాపాలను పెంచారు. అక్రమ రవాణా బాధితుల వాంగ్మూలాన్ని వీడియో ద్వారా నమోదు చేసి విచారించడానికి న్యాయస్థానాలు ముందుకొచ్చాయి. వెట్టిచాకిరి బాధితులను గుర్తించి, కొంత నష్టపరిహారం చెల్లించడానికి కొన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేశాయి. భారత్‌లో అక్రమ రవాణాకు గురైన వారిలో ఇలాంటి సహాయాలు పొందిన బాధితుల సంఖ్య చాలా పరిమితం.

అంతర్జాలంలో వ్యాపారం

నగరాల్లో పట్టుబడుతున్న మాదక ద్రవ్యాలకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మత్తుమందులు అంతర్జాలంలో అమ్ముడవుతున్నాయి. లాక్‌డౌన్‌లు, ఆంక్షల వల్ల నేరగాళ్లు నిగూఢ అంతర్జాలం (డార్క్‌వెబ్‌)లో క్రయవిక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. 2011-20 మధ్య పెద్దయెత్తున డార్క్‌వెబ్‌ బేరాలు జరిగిన 19 దేశాల్లో భారత్‌, చైనా ముందున్నాయని ఐరాస మాదకద్రవ్య, నేర నిఘా విభాగం నివేదిక వెల్లడించింది. ప్రపంచమంతటా డార్క్‌వెబ్‌ ద్వారా ఏటా సుమారు రూ.2,300 కోట్ల మేరకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారం జరుగుతోందని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం మాదక ద్రవ్య వ్యాపార పరిమాణంలో ఇది నీటి బొట్టంత. కొవిడ్‌ లాక్‌డౌన్‌ల వల్ల డార్క్‌వెబ్‌ బేరాలు నాలుగింతలయ్యాయి. వాడకందారులకు కొరియర్‌ సర్వీసుల ద్వారా కూడా మత్తుమందులు చేరుతున్నాయి. డార్క్‌వెబ్‌ అమ్మకాలలో గంజాయిదే అగ్రస్థానం. బహిరంగ అంతర్జాలంలో సింథటిక్‌ మత్తుమందుల ముడిసరకుల బేరాలూ ఎక్కువయ్యాయి. భారత్‌కు ప్రధానంగా అఫ్గానిస్థాన్‌ నుంచి హెరాయిన్‌, ఇతర నల్లమందు ఉత్పత్తులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. 2020 జులై వరకు కాబూల్‌ విమానాశ్రయం మూతపడటం వల్ల

విమాన కొరియర్‌ సర్వీసుల ద్వారా భారత్‌కు నల్లమందు ఉత్పత్తుల సరఫరా తగ్గింది. దీనిబదులు సముద్ర, నదీ మార్గాల ద్వారా అక్రమ రవాణా పెరిగింది. కొన్ని అంతర్జాతీయ ముఠాలు ప్రైవేటు విమానాల్లో మునుపటికన్నా ఎక్కువ మాదక ద్రవ్యాలను తరలించి అమ్ముతున్నాయి. కొవిడ్‌ కారణంగా ఆదాయాలు తగ్గడం వల్ల ఖరీదైన కొకైన్‌, హెరాయిన్‌ల కన్నా చవకగా దొరికే గంజాయికి గిరాకీ హెచ్చింది. సింథటిక్‌ మందుల వాడకమూ పెరిగింది. కొవిడ్‌ కాలంలో విందువినోదాలు, సామాజిక భేటీలు తగ్గాయి. లాక్‌డౌన్‌లో ఇంటిపట్టునే ఉండాల్సి రావడం వల్ల విసుగుదల, మానసిక ఒత్తిడి, తీరిక వేళలు ఎక్కువయ్యాయి. ఇదంతా మాదక ద్రవ్యాలకు గిరాకీని పెంచింది. దాన్ని తీర్చడానికి నేరగాళ్ల ముఠాలు కొత్త సాంకేతికతలను ఉపయోగిస్తున్నాయి. పాత పద్ధతులను మార్చుకుంటూ కొత్త మార్గాల్లో అక్రమ రవాణా సాగిస్తున్నాయి. బాలల, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు కూడా కొత్త విధానాలను చేపట్టి, సమన్వయంతో ముందుకు సాగాలి.

జోరుగా ఘటనలు

జులై 10న దిల్లీలో రూ.2,500 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్‌ పట్టుబడింది. జులై ఆరో తేదీన ముంబయిలో రూ.2,000 కోట్ల విలువైన 293 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్‌లో హైదరాబాద్‌లో రెండు టన్నుల గంజాయిని నిఘా యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. సింథటిక్‌ మత్తుమందు అల్ప్రజోలమ్‌ను తెలంగాణ, హైదరాబాద్‌, కర్ణాటకలలో అక్రమ రవాణా చేస్తున్న దుండగులను కూడా జూన్‌లోనే పట్టుకున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే జాతీయ మాదకద్రవ్య నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) 4.82 టన్నుల గంజాయి, 5.25 కిలోల నల్లమందు, 48.8 కిలోల చరస్‌ను స్వాధీనం చేసుకుంది.

- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చదవండి : అబద్ధాన్ని ఆశ్రయించడమే ఆపద్ధర్మ రాజకీయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.