ETV Bharat / opinion

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

Chhattisgarh Election 2023 : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించకపోయినా.. ప్రచారసభల్లో కొత్త పథకాలు, ఉచిత హామీలు ఇస్తూ ఓటర్లలో జోష్‌ నింపుతున్నారు. అధికార పార్టీతో పోలిస్తే ప్రచారంలో బీజేపీ కొంత వెనుకబడినట్లు ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికతోపాటు పార్టీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించకపోవటం తమకు ప్రతికూల అంశమని అంటున్న కమలనాథులు.. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రధాని మోదీ ఛరిష్మాపైనే ఆశలు పెట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 7:47 AM IST

Chhattisgarh Election 2023 : ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ.. రెండోసారి కూడా సీఎం పీఠం కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్ణాటకలో విజయవంతం అయిన ఉచిత హామీల ఫార్ములాను ఇక్కడ కూడా పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రధాని మోదీ ఛరిష్మా, అవినీతి అంశాల ద్వారా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కమలం పార్టీ.. ప్రచారంలో కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

కాంగ్రెస్​ హామీల వర్షం
Chhattisgarh Election Congress : ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు ఈనెల 7న, 17న రెండువిడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరో 6 రోజుల్లో 20స్థానాల్లో తొలివిడత పోలింగ్‌ జరగనుంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత హామీలు ప్రకటిస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే మళ్లీ రైతు రుణమాఫీ, కుల గణన, వరి సేకరణ ధర పెంపు, గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించనున్నట్లు రాహుల్‌ ప్రకటించారు.

  • LIVE: छत्तीसगढ़ की जनता कांग्रेस को चुनेगी - सबसे ज्यादा फसलों के मूल्य के लिए। किसानों की कर्जमाफी के लिए। आदिवासियों, ​दलितों और गरीबों के कल्याण के लिए।

    बिलासपुर, छत्तीसगढ़https://t.co/22SFHcoZyv

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డైలమాలో కమలం నేతలు!
Chhattisgarh Election BJP : హస్తం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే కమలం నేతలు డైలామాలో ఉన్నారు. ఏ హామీలు ఇవ్వాలి? ఎలాప్రచారం చేయాలి? అన్న విషయంలో స్పష్టతలేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. బస్తర్‌ డివిజన్‌లో ఈనెల 7న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు బరిలో ఉన్నా.. ప్రచారంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనందున.. ఏ హామీలు ఇవ్వాలి? ఎలాప్రచారం చేయాలనే విషయంలో దిశానిర్దేశం చేసే నాయకుడు లేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాలతోపాటు ప్రధాని మోదీ ప్రచారంపై ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు.

  • देखिए, छत्तीसगढ़ में पिछले पांच वर्षों में हुए भ्रष्टाचार और कुशासन पर आधारित वेब सीरीज "लबरा राजा" pic.twitter.com/09yROTfHNv

    — BJP (@BJP4India) November 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అర డజనుకుపైగా ప్రభుత్వ పథకాల్లో..
ఈనెల 2న తొలిసారి ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. కంకర్‌ ప్రచారసభలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలో విడుదల చేయనున్న ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు.. అన్నివర్గాలను ఆకట్టుకుంటాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్న కమలం నేతలు.. అర డజన్‌కుపైగా ప్రభుత్వ పథకాల్లో కుంభకోణం జరిగినట్లు ఆరోపిస్తున్నారు. వరి సేకరణ, ఎక్సైజ్‌, మైనింగ్‌సహా అనేక కుంభకోణాల్లో బ్యూరోక్రాట్లు, కేబినెట్‌ మంత్రులకు ప్రమేయం ఉందని విమర్శిస్తున్నారు.

ఇంటింటికి వెళ్లి ఉచిత హామీలను ప్రచారం చేస్తూ..
ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. ఆ పార్టీశ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఉచిత హామీలను ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా రాహుల్‌, ప్రియాంక కూడా ఛత్తీస్‌గఢ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వీలైనంత ఎక్కువగా ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. రైతు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చి ఉచిత పథకాలతో కాంగ్రెస్‌ ప్రచారానికి జోష్‌ పెంచుతున్నారు. ఇప్పటివరకు హస్తం పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయకపోయినా.. ఆ పార్టీ అగ్రనేతలు అనేక పథకాలు, ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి కొంత అనుకూల వాతావరణం కనిపిస్తోందని కమలం నేతలే అంగీకరిస్తున్నారు. అధికార పార్టీతో పోలిస్తే ప్రచారంలో వెనుకబడినట్లు చెబుతున్నారు.

అధికార హస్తం పార్టీకి మరింత కలిసి వచ్చే..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో బీసీ జనాభా 41శాతం ఉంది. ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ కులగణన హామీ ఇచ్చింది. ఇది హిందూ ఓటర్లలో చీలిక తెస్తుందని కాషాయ పార్టీ నేతలు కలవరం చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇంతవరకు హిందువులు, బీసీ ఓటర్లు బీజేపీకు సంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్నారు. కుల గణన హామీతో వారి ఓట్లలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉందన్న ప్రచారానికి కమలం పార్టీ నేతల వ్యాఖ్యలు బలపరుస్తున్నాయి. ఇది అధికార హస్తం పార్టీకి మరింత కలిసి వచ్చే అంశం కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Chhattisgarh Assembly Election 2023 Prediction : ఛత్తీస్​గఢ్​లో హోరాహోరీ.. బఘేల్​పై కాంగ్రెస్ నమ్మకం..​ మోదీపైనే బీజేపీ ఆశలు.. గెలుపెవరిది?

BJP Tough Seats In Chhattisgarh : ఆ 9 స్థానాలే టార్గెట్​.. 23 ఏళ్లుగా గెలవని బీజేపీ.. ఈసారి పక్కా ప్లాన్​తో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.