ETV Bharat / opinion

మౌలిక సదుపాయాల నిధితో రైతు కష్టాలు తీరేనా? - రైతుల వార్తలు

రైతు ఏం పండించినా అది గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేకుండా ప్రతినాయక పాత్ర పోషిస్తున్న అనేకాంశాల్లో మౌలిక సదుపాయాల కొరత ఒకటి. ఏదోలా కష్టపడి పంటను మార్కెట్‌యార్డుకు చేర్చినా, అక్కడ టార్పాలిన్లూ లేక, తడిసిన ధాన్యానికి ధర రాక సగటు రైతుపడే మూగవేదన మాటల్లో చెప్పలేనిది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మౌలిక సదుపాయాల నిధి ఎలా కర్షకుని సమస్యలను పరిష్కరించనుంది?

Can a farmer be rewarded with an infrastructure fund
మౌలిక సదుపాయాల నిధితో రైతు కష్టాలు తీరేనా?
author img

By

Published : Aug 11, 2020, 11:10 AM IST

రైతు జీవన భద్రతకు, జాతి ఆహార భద్రతకు అవినాభావ సంబంధం ఉంది. ఆ మౌలిక సత్యాన్ని విస్మరించి- నేడు కావాల్సింది జాతీయ రైతు ప్రణాళిక అంటూ డాక్టర్‌ స్వామినాథన్‌ సమర్పించిన విలువైన సిఫార్సుల్ని అటకెక్కించిన పాలకశ్రేణుల అలక్ష్యంతో, సేద్యం సంక్షోభాల సుడిగుండమైంది. రైతు ప్రయోజనాలను, సేద్య ప్రగతిని, గ్రామీణాభివృద్ధిని వేర్వేరుగా పరిగణించినంతకాలం నికర ప్రగతి ఎండమావిగానే మిగులుతుందన్న మోదీ ప్రభుత్వం... తాజాగా లక్ష కోట్ల రూపాయల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించింది. వ్యవసాయ రంగంలోనూ ఇండియా స్వావలంబన సాధించడమే లక్ష్యంగా పట్టాలకెక్కించిన ఈ ప్రాజెక్టు ద్వారా- పంట నూర్పిళ్ల దశనుంచి మార్కెటింగ్‌ దాకా అవసరపడే సరఫరా గొలుసు సేవలు, ప్రాథమిక ప్రాసెసింగ్‌ కేంద్రాలు, గోదాములు, గిడ్డంగులు, నాణ్యతా పరీక్ష యూనిట్లు, శీతల నిల్వ సదుపాయాలు, పక్వానికి తెచ్చే శీతల గదులు, విలువ జోడింపు వంటి విస్తృత మౌలిక వసతులను కల్పించనున్నారు.

ఆ సంకల్పంతోనే..

రైతులు, వారి ఉత్పాదక సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఔత్సాహిక వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, అంకుర పరిశ్రమలు, మార్కెటింగ్‌ సహకార సంఘాలకు వడ్డీ రాయితీలతో రుణ వితరణ ద్వారా ఈ కీలక మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చెయ్యాలన్నది కేంద్ర సర్కారు సంకల్పం. తద్వారా తగిన ధర వచ్చేదాకా పంట నిల్వ చేసుకొనే వెసులుబాటు, విలువ జోడింపు ద్వారా గిట్టుబాటు- రైతుకు దక్కుతాయని వ్యవసాయానుబంధ పరిశ్రమలతో ఉపాధికి ఊతం లభిస్తుందని, ఆహార వృథాను అరికట్టడం సాధ్యపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని వ్యవసాయం, అనుబంధ రంగాల మొత్తం విలువ ఆధారంగా మౌలిక సదుపాయాల నిధిలో రుణ వితరణ మొత్తాల వాటాల్ని ఖరారు చేసిన కేంద్ర ప్రభుత్వం- వ్యవసాయరంగ పునరుద్ధరణ దిశగా ముందడుగు వేసింది. రైతు శ్రేయానికి ఏ మేరకు దోహదపడుతుందన్నదే, ఈ భూరి ప్రాజెక్టు సాఫల్యానికి గీటురాయి!

రైతు వేదన తగ్గేనా..

రైతు ఏం పండించినా అది గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేకుండా ప్రతినాయక పాత్ర పోషిస్తున్న అనేకాంశాల్లో మౌలిక సదుపాయాల కొరత ఒకటి. కోత ఖర్చులూ రాక టొమాటోల్ని రోడ్లమీద పారబోసే బడుగు రైతు ఆక్రోశం, మరోచోట అవే టొమాటో ధరలు చుక్కలనంటి కొనుగోలుదార్ల నైరాశ్యం ఏటా అనుభవమవుతూనే ఉన్నాయి. ఇలా పంటల వృథా రూపేణా ఇండియా ఏటా కోల్పోతున్న మొత్తం రూ.44వేల కోట్లు! నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌ లైన్‌(ఎన్‌ఐపీ) ఏర్పాటుపై నియుక్తమైన టాస్క్‌ఫోర్స్‌ ప్రధానంగా ఈ-మార్కెట్‌ సదుపాయాలు, గిడ్డంగులు-శుద్ధి, పరిశోధన అభివృద్ధిపై దృష్టి సారించాలంటూ వచ్చే అయిదేళ్లలో లక్షా 68వేల కోట్ల రూపాయల పెట్టుబడుల అవసరాన్ని మొన్న ఏప్రిల్‌లో ప్రస్తావించింది. పంటను మార్కెట్‌యార్డుకు చేర్చినా, అక్కడ టార్పాలిన్లూ లేక, తడిసిన ధాన్యానికి ధర రాక సగటు రైతుపడే మూగవేదనకు తాజా మౌలిక సదుపాయాల నిధి ఎలా అక్కరకు రానుందో చూడాలి.

పూర్తిగా అసంబద్ధమైన కనీస మద్దతు ధర బడుగు రైతు బతుకును ఛిద్రం చేస్తోందన్న క్షేత్రస్థాయి వాస్తవాల్ని జాతీయ నమూనా అధ్యయనాలే నిర్ధారించాయి. సగటు రైతు కుటుంబ ఆదాయం నెలకు ఆరువేల రూపాయల లోపేనని వెల్లడైనా, స్వామినాథన్‌ సూచనల మేరకు- భూమి, కౌలు వ్యయాల్నీ గణించి వాస్తవ ఖర్చులకు అదనంగా యాభై శాతం లాభం కలిపి గిట్టుబాటు ధర ప్రకటించాలన్న మేలిమి సూచనను మన్నించకపోవడమే రైతు శ్రేయాన్ని దిగలాగుతోంది. మౌలిక సదుపాయాల నిధి సరే- రైతుబాగు పట్ల ఏలికల ఆలోచనల్లోనే మౌలిక మార్పు రావాలి. రైతు పరిధిలో లేని ప్రకృతి ఉత్పాతాలు, చీడపీడల దాడుల వంటివాటి నుంచి పటిష్ఠ రక్షాకవచాలు ఏర్పరచి, కాయకష్టానికి తగిన గిట్టుబాటుకు భరోసా ఇచ్చే కార్యాచరణ వ్యూహాలే వ్యవసాయాన్ని పండగ చేస్తాయి!

ఇదీ చూడండి: పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.