ETV Bharat / opinion

బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ.. ప్రాంతాలవారీగా ఎన్నికల వ్యూహం.. హైదరాబాద్​లో కీలక భేటీ - 2024 పార్లమెంట్ ఎన్నికల బీజేపీ వ్యూహం

BJP Strategy For 2024 : వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై బుధవారం ఆ పార్టీ ముఖ్య నేతలంతా భేటీ అయ్యారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో మోదీ అధ్యక్షతన అర్థరాత్రి వరకు ఈ భేటీ జరిగింది. ప్రాంతాల వారిగా వివిధ సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

bjp-strategy-for-2024-bjp-regional-strategy-for-upcoming-elections
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వ్యూహం
author img

By

Published : Jun 29, 2023, 6:19 PM IST

BJP Strategy For Upcoming Elections In India : ఇప్పటి వరకు తమకు తిరుగులేదని భావించిన భారతీయ జనతా పార్టీ.. కర్ణాటక ఓటమితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ తమ వ్యూహాలేమి అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడం వల్ల.. తదుపరి జరిగే ఎన్నికల్లో ఆచూతూచి అడుగులేయాలని భావిస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న వేళ.. వాటి ఎత్తులను చిత్తు చేయాలని ఆరాటపడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని.. 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి రావాలని ఆశపడుతోంది. అందుకు అనుగుణంగానే దేశ వ్యాప్తంగా కీలక సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది.

అర్థరాత్రి వరకు బీజేపీ కీలక నేతల భేటీ..
ఈ ఏడాది చివర్లో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలే లక్ష్యంగా.. దిల్లీలోని ప్రధాని నివాసంలో బుధవారం అర్థరాత్రి వరకు బీజేపీ ముఖ్య నేతల భేటీ జరిగింది. మోదీ అధ్యక్షతన దాదాపు ఐదు గంటల పాటు.. ఈ భేటీ సాగింది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్​తో పాటు మరికొంత మంది కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ప్రాంతాలవారీగా సమావేశాలు నిర్వహించి.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు రూపొందించాలని వీరంతా నిర్ణయించారు.

ప్రాంతాల వారీగా సమావేశాలు..
దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వేరువేరుగా సమావేశాలు నిర్వహించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పార్టీ పనితీరును మెరుగుపరచడం, ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణులను సమన్వయ పరచడం వంటి లక్ష్యాలను పెట్టుకుంది. ఈ సమావేశాలతో ప్రాంతాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత వస్తుందని అభిప్రాయానికి వచ్చింది. ఈ సమావేశాల కోసం ఓ షెడ్యూల్​ను కూడా ఖరారు చేసింది.

ప్రత్యేక సమావేశాల షెడ్యూల్..

  • ప్రాంతాల వారీగా జులై 6, 7, 8 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. జులై 6న గువాహటి కేంద్రంగా మొదటి సమావేశం జరుగుతుంది. ఇందులో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్, అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, మేఘాలయ, త్రిపురలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.
  • రెండవ సమావేశం జులై 7న దిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉత్తర భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై చర్చ జరుగుతుంది. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్​, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, గుజరాత్, దమణ్ దీవ్, దాద్రా నగర్ హవేలీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హరియాణా వంటి ప్రాంతాలపై పార్టీ నేతలు సమాలోచనలు చేస్తారు.
  • ఇక చివరి సమావేశం హైదరాబాద్​లో జులై 8న జరుగనుంది. దక్షిణ భారత రాష్ట్రాలు, దక్షిణాదిలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ముంబయి, గోవా, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్​లలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు ఓ నిర్ణయానికి వస్తారు.

ఈ మూడు సమావేశాలకు పార్టీకి చెందిన కీలక నేతలు హాజరవుతారు. అందులో రాష్ట్ర ఇంఛార్జ్​లు, రాష్ట్ర అధ్యక్షులు, సంస్థాగత కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ప్రాంతాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలను, పాటించాల్సిన ప్రణాళికలను రూపొందించిచేందుకు ఈ సమావేశాలు దోహదం చేస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంస్థాగతంగా పార్టీను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడించాయి.

నేతలకు మోదీ సూచనలు..
బుధవారం జరిగిన బీజేపీ అగ్రనేతల భేటీలో.. మోదీ కొన్ని కీలక సూచనలు చేశారు. వెనుకబడిన, అట్టడుగు వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వారికి సూచించారు. ఆయా వర్గాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తమ నియోజక వర్గాల్లోని బీసీ కులాలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలని మంత్రులను కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే మార్గాలను అన్వేషించాలని బీజేపీ ప్రజాప్రతినిధులను మోదీ కోరారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం.
-అనామిక రత్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.