ETV Bharat / opinion

హిరోషిమాపై దాడికి 75ఏళ్లు.. మారని ప్రపంచదేశాలు!

హిరోషిమాపై అమెరికా అణు బాంబుతో దాడి చేసి నేటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. 1945 ఆగస్టు 6న ఆ ప్రాంతంపై అణ్వాయుధాలను ప్రయోగించగా.. లక్షల మంది జపాన్​ పౌరులు మరణించారు. ఆ రేడియోధార్మికత నుంచి బయటపడేందుకు ఆ నగరానికి, దేశానికి ఏళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం ఆ నగరం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది. అయితే ఇలాంటి దుర్ఘటనల ఫలితాల గురించి తెలిసినా ప్రపంచ దేశాలు మాత్రం అణ్వాయుధ శక్తిని విడిచిపెట్టట్లేదు. దీనికి కారణాలను ఓసారి పరిశీలిద్దాం..

author img

By

Published : Aug 6, 2020, 10:02 AM IST

Updated : Aug 6, 2020, 11:42 AM IST

75TH ANNIVERSARY OF HIROSHIMA
ఆ దుర్ఘటనకు 75 ఏళ్లొచ్చినా ప్రపంచదేశాలు మారవా..?

1945 ఆగస్టు 6.. ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని ఓ విషాదకరమైన రోజు. ముఖ్యంగా జపాన్‌ వాసులనైతే ఇప్పటికీ ఆ తేదీ కలవరపెడుతూనే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా అణుదాడికి బలయ్యాయి జపాన్​లోని హిరోషిమా, నాగసాకి నగరాలు. సరిగ్గా ఈ రోజునే హిరోషిమాలో లిట్‌ బాయ్‌ అనే అణుబాంబు విధ్వంసం సృష్టించగా.. ఆ ఘటనకు నేటికి 75 ఏళ్లు.

ఇదీ జరిగింది..

1945 ఆగస్టు 6న ఉదయం దాదాపు ఎ‍నిమిదన్నర గంటలు(జపాన్‌ స్థానిక కాలమానం ప్రకారం). హిరోషిమా గగనతలంలో చక్కర్లు కొట్టింది 'ఎనోలా గే' అనే బీ-29 బాంబర్ విమానం.. 'లిటిల్ బాయ్' అనే అణుబాంబును జారవిడిచింది. ఫలితంగా కొన్ని సెకన్లలోనే కనీవినీ ఎరగనంత విస్పోటనం చోటుచేసుకుంది. ఆ దెబ్బకు హిరోషిమా శ్మశానంలా మారిపోయింది. బాంబు పేలగానే ఉష్ణోగ్రత 10 లక్షల సెంటిగ్రేడ్​కు చేరింది. దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలోని అన్ని భవనాలు భస్మీపటలంగా మారాయి. ఈ దాడిలో దాదాపు లక్షా 40 వేల మంది జపాన్​​ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఆ భయంకర విస్ఫోటనాన్ని తట్టుకొని పాక్షికంగా నిలిచిన జన్​బకూ డోమే అనే భవనం మాత్రమే పాక్షికంగా నిలిచింది. ఇది హిరోషిమా శాంతి చిహ్నంగా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత ఆగస్టు 9న నాగసాకి అనే పట్టణంలో మరోసారి అణుదాడి చేసింది అమెరికా. అనంతరం కాలంలో శాంతి ఒప్పందాల కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అణుదాడులు జరగలేదు.

భారీగా ఉండేవట..

ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో దాదాపు 55వేల న్యూక్లియర్​ వార్​హెడ్​లు అమెరికా, రష్యా వద్దే ఉండేవని సమాచారం. 1970లో ఏర్పాటైన న్యూక్లియర్​ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్​పీటీ) ద్వారా అణు స్థిరత్వాన్ని పెంచాలని.. అమెరికా, రష్యా ఒప్పందం చేసుకున్నాయి. అణ్వాయుధాల వాడకాన్ని పరిమితం చేయాలని నిర్ణయించాయి. అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధంలో మరో పక్షంలో ఉన్న జర్మనీ, జపాన్, ఇటలీ న్యూక్లియర్​ శక్తిని పొందకుండా చేయాలని ఎన్​పీటీ ఉద్దేశించింది. ఏ దేశ భద్రతకైనా ముప్పు ఉందని కోరితే.. ఐరాస శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలు(అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్​, చైనా) సాయం చేసేందుకు ముందుకొస్తాయని చెప్పారు. అయితే ఇతర దేశాలు మాత్రం తమ భద్రత కోసం అణుశక్తిని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

భారత్​ కూడా ఆ జాబితాలో..

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత భారత్​, పాకిస్థాన్​, ఉత్తరకొరియా దేశాలు.. న్యూక్లియర్​ టెస్టులు చేసి అణుశక్తిని సంపాదించుకున్నాయి. భారత్​ 1974లో భారత్​ న్యూక్లియర్​ టెస్టు చేసి తయారీ సామార్థ్యం సంపాదించినా.. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయలేదు. ఇజ్రాయెల్​ అపారదర్శక హోదా పొందగా.. ఇరాక్​, ఇరాన్​, లిబియా దేశాలు అణ్వాయుధ మార్గంలోకి వెళ్లకుండా ఐరాస దేశాలు నిరోధించాయి. అయితే ఇప్పడు దేశ సమగ్రత, భద్రత పేరిట అణుశక్తి కావాలని చాలా దేశాలు కోరుతున్నాయి.

1991లో అణ్వాయుదాలను తగ్గించాలని యూఎస్​ఎస్​ఆర్​ తీర్మానించింది. అప్పట్నుంచి అణుశక్తిని అభివృద్ధి చేసుకోవడం తగ్గించాలని అన్ని దేశాలు అంగీకారం తెలిపాయి. అయితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, రాజకీయంగా ముఖ్యమైన దేశాలు (ఐదు యుఎన్‌ఎస్‌సీ సభ్యులు), అత్యంత సంపన్నమైన జీ 20 దేశాలు తమ దేశ భద్రతలో భాగంగా అణ్వాయుధాలను ఏర్పాటు చేసుకున్నాయి. 2001లో జరిగిన 9/11 దాడి, 2008లో ముంబయి ఉగ్రదాడి సహా పొరుగు దేశాల నుంచి సరిహద్దు ముప్పు పెరగడం వల్ల రక్షణ రంగానికి పెద్దపీట వేసింది భారత్​.

ముప్పు పొంచి ఉంది..

ఆగస్టు 3న యూఎన్ జాతీయ​ భద్రతా మండలికి(యుఎన్‌ఎస్‌సి) ఐరాస సమర్పించిన రహస్య నివేదికలో.. ఉత్తర కొరియా అణు పరికరాలను అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఇది బాలిస్టిక్ క్షిపణుల వార్‌హెడ్‌లతో ప్రయోగించవచ్చని స్పష్టం చేసింది. అయితే దీని కారణంగా ప్రపంచ శాంతికి ముప్పుగా చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేసినా.. కిమ్​ ప్రభుత్వం మాత్రం అణ్వాయుధాలను విడిచిపెట్టేందుకు సాహసించట్లేదు.

హిరోషిమా దాడి జరిగి 75 ఏళ్లయిన నేపథ్యంలో.. ప్రస్తుతం అమెరికా-రష్యా, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు కలవరపెడుతున్నాయి. చాలా దేశాలు అణ్వాయుధాలను వ్యూహాత్మకంగా భావిస్తున్నాయి. అణుశక్తిని సంపాదించుకోడానికి పలు దేశాలు సరికొత్త విధానాలను తయారుచేసుకుంటున్నాయి. ఉత్తరకొరియా మాత్రమే కాకుండా ఈ జాబితాలో చాలా దేశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల నాయకత్వం అంతా కలిసి భవిష్యత్​లో ఇలాంటి ఘటనలను నిలువరించి శాంతి వైపు మొగ్గుచూపాల్సిన బాధ్యత ఉంది.

- సీ.ఉదయ్​ భాస్కర్

Last Updated : Aug 6, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.