LIVE: విజయవాడలో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్ - స్వరాజ్ మైదానం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 3:03 PM IST
|Updated : Jan 19, 2024, 3:25 PM IST
CM Jagan inaugurating Ambedkar statue: విజయవాడలో 125 అడుగుల భారత రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ కాంస్య విగ్రహన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవిష్కరించనున్నారు. సామాజిక న్యాయం - మహాశిల్పం పేరుతో ఈ విగ్రహన్ని ప్రభుత్వం నిర్మించింది. 18.81 ఎకరాల్లో 404 కోట్ల రూపాయల వ్యయంతో అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారు. విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా అంబేడ్కర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. స్వరాజ్ మైదానంలో నిర్మించిన ఈ విగ్రహన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మైదానంలో సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి సహా పలువురు అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొననున్నారు
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా పోలీసులు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చెన్నై, విశాఖ నుంచి వచ్చే భారీ వాహనాలకు అనుమతి నిరాకరించారు. భారీ వాహనాలకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతి నిరాకరణతో, జాతీయరహదారి మీదుగా వచ్చే వాహనాలు వివిధ మార్గాల్లో మళ్లించారు. సభకు వచ్చే వాహనాల కోసం పలు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. ఎంజీ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, చుట్టుగుంటలో పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయగా, విద్యాధరపురం, వజ్రా గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో సైతం పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రోజు విగ్రహన్ని ఆవిష్కరిస్తుండగా, రేపటి నుంచి అంబేడ్కర్ విగ్రహ సందర్శనకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.