కావల్సినవి
- పులుపు తక్కువగా ఉన్న పచ్చిమామిడికాయ - ఒకటి
- చక్కెర - కప్పు
- పెరుగు - కప్పు
- జీడిపప్పూ, బాదం - 4 చొప్పున (నీళ్లలో నానబెట్టుకోవాలి)
తయారీ
మామిడికాయను చెక్కు తీసి కాసిని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మామిడికాయ ఉడికించిన నీటిని విడిగా తీసుకోవాలి. మామిడికాయ గుజ్జ, చక్కెర, పెరుగు మిక్సీలో తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. తరవాత మామిడికాయ ఉడికించిన నీరూ పోసుకుని మరోసారి మిక్సీ పట్టి గ్లాసుల్లోకి తీసుకోవాలి. దీనిపై నానబెట్టిన జీడిపప్పూ, బాదంపలుకులూ అలంకరిస్తే టేస్టీ టేస్టీ మామిడికాయ లస్సీ సిద్ధం.